Latest Updates
-
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.!
Mangal Rashi Parivartan 2022:కుజుడి రవాణాతో ఈ రాశులకు ప్రతికూలం..ఈ పరిహారాలు పాటించండి..!
2022లో ఫిబ్రవరి 26వ తేదీన అంగారకుడు మకరంలోకి రవాణా చేసే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావాలు, పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారక గ్రహాన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. అంగారకుడి కదలిక రాశిచక్రాలలో మార్పు కారణంగా ప్రజల జీవితాల్లో భారీ మార్పులు కనిపిస్తాయి. ఎవరి జాతకంలో అయితే అంగారకుడు(కుజుడు) బలమైన స్థానంలో ఉంటారో.. వారు జీవితంలో గొప్ప విజయాన్ని పొందుతారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన కుజుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో ఏప్రిల్ 7వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఈ సందర్భంగా కుజుడి రవాణా సమయంలో ద్వాదశ రాశులపై కొన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి..

మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఇంతకీ కుజుడి రవాణా వల్ల ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి కుజుడి రవాణా సమయంలో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పని వల్ల గుర్తింపు లభిస్తుంది. ఈ కాలంలో ఎలాంటి ఆర్థిక పెట్టుబడులు పెట్టొద్దు. భార్యభర్తల మధ్య సంబంధాలు బాగానే ఉంటాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారు కుజుడి రవాణా కారణంగా దూర ప్రయాణాలు చేయొచ్చు. ఈ కాలంలో మీరు మంచి లాభాలను పొందుతారు. మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. పని విషయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వివాహితులు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీరు కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. మనసు ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం మరియు యోగా చేయండి.
పరిహారం : మంగళవారం రక్తదానం చేస్తే, మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

మిధున రాశి..
ఈ రాశి వారికి కుజుడి రవాణా సమయంలో మిశ్రమ ఫలితాలు రావొచ్చు. అయితే ఈ కాలంలో కొత్త పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు రావొచ్చు. అయితే అంతా సజావుగా సాగుతుంది. మరోవైపు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు.
పరిహారం : కుజుడి గ్రహానికి సంబంధించిన ‘ఓం అంగారకాయ నమః' మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి

కర్కాటక రాశి..
కుజుడి రవాణా కాలంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే మీరు మీ కెరీర్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు ఆఫీసులో సహోద్యోగులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. మీ సీనియర్లు మీతో సంతోషంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో పొట్టకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీ వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు సాగొచ్చు.
పరిహారం : దుర్గాదేవిని పూజించాలి. పేదలకు ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరియు వృద్ధులకు సహాయం చేస్తే శుభ ఫలితాలొస్తాయి

సింహ రాశి..
ఈ రాశి వారు కుజుడి రవాణా సమయంలో మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీరు శత్రువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఫీల్డ్ లో కూడా పోటీదారుల కంటే ముందుండొచ్చు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : మంగళవారం, శనివారం కోతులకు అరటి పండును తినిపిస్తే శుభ ఫలితాలొస్తాయి.

కన్య రాశి..
ఈ రాశి వారు కుజుడి రవాణా కాలంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీరు మీ సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో సత్సబంధాలు కొనసాగించలి. ఈ సమయంలో మీ ప్రమోషన్ ఆలస్యం కావొచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు సరైన మనీ ప్లానింగ్ చేయాలి. వ్యాపారులకు మంచిగా ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.
పరిహారం : మీరు ఆవులకు బెల్లం సమర్పించొచ్చు.

తుల రాశి..
ఈ రాశి వారు ఈ కాలంలో బిజీగా ఉంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్త వినిపించొచ్చు. ఈ సమయంలో వ్యాపారవేత్తలు కొన్ని పెద్ద పెట్టుబడులు పెట్టొచ్చు. మరోవైపు మీ వ్యక్తిగత జీవితంలో బంధువులతో తగాదాలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా ప్రభావితమౌతుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పరిహారం : పేదలకు బట్టలు దానం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..
కుజుడి రవాణా సమయంలో ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగొచ్చు. మీరు మీ లక్ష్యాలను పూర్తి చేయగలరు. అయితే ఈ సమయంలో మీ శత్రువులు మీకు హాని చేయొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ కెరీర్ కు సంబంధించిన ఫలితాలను పొందేందుకు తక్కువ దూరం ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. ఈ కాలంలో పెట్టుబడి పెట్టొచ్చు.
పరిహారం : మీరు చిన్న తోబుట్టువులకు బహుమతులు అందిస్తే, మీకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఈ కాలంలో ఆస్తికి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు అన్ని రకాల ఇబ్బందుల నుండి జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా ఉండొచ్చు. మీరు కొంత ఆర్థిక పరంగా నష్టపోవచ్చు. అయితే సరైన ప్రణాళికతో వెళితే కచ్చితంగా కోలుకుంటారు.
పరిహారం : ప్రతిరోజూ వీధి కుక్కలకు జాగ్రత్తగా చూసుకోవాలి మరియు ప్రతిరోజూ వాటికి ఆహారం ఇవ్వొచ్చు.

మకర రాశి..
ఇదే రాశిలోకి అంగారకుడు ప్రవేశించడంతో ఈ రాశి వారు కొంత దూకుడుగా ప్రవర్తించొచ్చు. ఈ కాలంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చు. మీరు కొత్త ఇల్లు లేదా ఆస్తిని కొనుగోలు చేయాల్సిన సమయం ఇది. మీ పనులకు చాలా డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి మీరు మీ బడ్జెట్ కు అనుగుణంగా మార్పు చేసుకోవాలి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పరిహారం : మీ ఇంట్లో మంగళ యంత్రాన్ని ప్రతిష్టించి, క్రమం తప్పకుండా పూజించాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఈ కాలంలో చిన్న ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఉద్యోగులకు ప్రతికూలంగా ఉంటుంది. ఆఫీసులో ఉన్నతాధికారులతో వాదనలు ఉండొచ్చు. ఈ సమయంలో మీరు కష్టపడి పని చేయాలి. మీరు ఏకాగ్రతతో ఉండాలి. అప్పుడే మీరు కొత్త ఉద్యోగావకాశాలను పొందొచ్చు. మీరు కొన్ని పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు. మీ జీవిత భాగస్వామి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పరిహారం : మీరు ఇల్లు, గుడి లేదా పార్కు దగ్గర దానిమ్మ చెట్టును నాటొచ్చు.

మీన రాశి..
కుజుడి రావాణా సమయంలో ఈ రాశి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కొంచెం ధైర్యం మరియు అవగాహనతో వాటిని అధిగమించొచ్చు. ఈ సమయంలో మీకు లక్కీగా ఉంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ను పొందొచ్చు. మీకు అవసరమైన పెరుగుదల రావొచ్చు. వ్యాపారులు ముందుకు వెళ్లి ఆర్థిక ఒప్పందాలు చేసుకోవచ్చు. ఇది మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.
పరిహారం : మంగళవారం రోజున ఎరుపు రంగు దారంతో మూడు ముఖాల రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలొస్తాయి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారక గ్రహాన్ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. అంగారకుడి కదలిక రాశిచక్రాలలో మార్పు కారణంగా ప్రజల జీవితాల్లో భారీ మార్పులు కనిపిస్తాయి. ఎవరి జాతకంలో అయితే అంగారకుడు(కుజుడు) బలమైన స్థానంలో ఉంటారో.. వారు జీవితంలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26వ తేదీన కుజుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో ఏప్రిల్ 7వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఈ సందర్భంగా కుజుడి రవాణా సమయంలో ద్వాదశ రాశులపై కొన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి.



Click it and Unblock the Notifications