Latest Updates
-
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో..
Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...
మిధునంలోకి కుజుడి ప్రవేశంలో ద్వాదశ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడు(కుజుడు) శక్తి మరియు ధైర్యానికి కారకంగా పరిగణించబడుతుంది. 2021 సంవత్సరంలో కుజుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 01:16 గంటలకు ప్రవేశించనున్నాడు.

ఈ సమయంలో ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో ప్రభావం పడుతుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారు మానసిక మరియు శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సందర్భంగా ఏయే రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీరు చింతించాల్సిన పని లేదు. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి వారి నుండి అంగారకుడు నిష్క్రమించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. మరోవైపు వ్యాపారులు ఈ కాలంలో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

మిధున రాశి..
కుజుడు వృషభరాశి నుండి ఈ రాశిలోకి ప్రవేశించే సమయంలో మిధున రాశి వారికి గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారి స్వభావం మారుతుంది. ఈ సమయంలో మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీ పదాల వల్ల గొడవలు జరగొచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మరోవైపు మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి..
అంగారకుడు మిధునంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీరు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులకు ఈ కాలంలో మంచి ఫలితాలు రావొచ్చు.

సింహ రాశి..
కుజుడు మిధునంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ కాలంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ సీనియర్లు కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీరు ధైర్యం మరియు సహనంతో అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొంటారు.

కన్య రాశి..
మిధునంలోకి కుజుడు రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ కాలంలో ప్రత్యర్థులు మీరు చాలా చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినొచ్చు.

తుల రాశి..
కుజుడు మిధున రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పని నిమిత్తం ప్రయాణించాల్సి ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో బలంగా ఉంటుంది. అయితే మీరు మీ ఖర్చులపై నిఘా పెంచాలి.

వృశ్చిక రాశి..
మిధున రాశిలోకి అంగారకుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఈ కాలంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ తోబుట్టువులతో గొడవల వల్ల మీరు విడిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు మానసికంగా బాధపడతారు. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని నియంత్రించాలి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
అంగారకుడు మిధున రాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో గందరగోళం ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈ కాలంలో చాలా బలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపిస్తాయి.

మకర రాశి..
మిధున రాశిలోకి కుజుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చట్టపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ కాలంలో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ పనితో సీనియర్ అధికారులు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

కుంభ రాశి..
అంగారకుడు మిధునంలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దీని వల్ల మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

మీన రాశి..
మిధున రాశిలోకి అంగారకుడు రవాణా చేసే సమయంలో ఈ రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఈ కాలంలో శుభ ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా షాపింగ్ చేయొచ్చు.



Click it and Unblock the Notifications











