For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...

మిధునంలోకి కుజుడి ప్రవేశంలో ద్వాదశ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడు(కుజుడు) శక్తి మరియు ధైర్యానికి కారకంగా పరిగణించబడుతుంది. 2021 సంవత్సరంలో కుజుడు వృషభరాశి నుండి మిధున రాశిలోకి ఏప్రిల్ 14వ తేదీ ఉదయం 01:16 గంటలకు ప్రవేశించనున్నాడు.

Mars Transit in Gemini on 14 April 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సమయంలో ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో ప్రభావం పడుతుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారు మానసిక మరియు శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సందర్భంగా ఏయే రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీరు చింతించాల్సిన పని లేదు. త్వరలో మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీ విశ్వాసం పెరుగుతుంది. మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారి నుండి అంగారకుడు నిష్క్రమించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. మరోవైపు వ్యాపారులు ఈ కాలంలో మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

మిధున రాశి..

మిధున రాశి..

కుజుడు వృషభరాశి నుండి ఈ రాశిలోకి ప్రవేశించే సమయంలో మిధున రాశి వారికి గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వారి స్వభావం మారుతుంది. ఈ సమయంలో మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీ పదాల వల్ల గొడవలు జరగొచ్చు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మరోవైపు మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Venus Transit In Aries: మేషరాశిలోకి శుక్రుడి ఎంట్రీతో ఈ 5 రాశులకు లాభమంట...!Venus Transit In Aries: మేషరాశిలోకి శుక్రుడి ఎంట్రీతో ఈ 5 రాశులకు లాభమంట...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

అంగారకుడు మిధునంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆరోగ్య పరంగా సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీరు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులకు ఈ కాలంలో మంచి ఫలితాలు రావొచ్చు.

సింహ రాశి..

సింహ రాశి..

కుజుడు మిధునంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ కాలంలో మంచి ఫలితాలు వస్తాయి. మీ సీనియర్లు కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీరు ధైర్యం మరియు సహనంతో అన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొంటారు.

కన్య రాశి..

కన్య రాశి..

మిధునంలోకి కుజుడు రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ కాలంలో ప్రత్యర్థులు మీరు చాలా చురుకుగా ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినొచ్చు.

Ugadi Rasi Phalalu 2021: కొత్త ఏడాదిలో కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!Ugadi Rasi Phalalu 2021: కొత్త ఏడాదిలో కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!

తుల రాశి..

తుల రాశి..

కుజుడు మిధున రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు పని నిమిత్తం ప్రయాణించాల్సి ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో బలంగా ఉంటుంది. అయితే మీరు మీ ఖర్చులపై నిఘా పెంచాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

మిధున రాశిలోకి అంగారకుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఈ కాలంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ తోబుట్టువులతో గొడవల వల్ల మీరు విడిపోయే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీరు మానసికంగా బాధపడతారు. ఈ సమయంలో మీరు మీ కోపాన్ని నియంత్రించాలి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

అంగారకుడు మిధున రాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ వైవాహిక జీవితంలో గందరగోళం ఉండొచ్చు. ఆర్థిక పరంగా ఈ కాలంలో చాలా బలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపిస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

మిధున రాశిలోకి కుజుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చట్టపరమైన విషయాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు ఈ కాలంలో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీ పనితో సీనియర్ అధికారులు చాలా సంతోషంగా ఉంటారు. మరోవైపు మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

అంగారకుడు మిధునంలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దీని వల్ల మీ మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

మీన రాశి..

మీన రాశి..

మిధున రాశిలోకి అంగారకుడు రవాణా చేసే సమయంలో ఈ రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు ఈ కాలంలో శుభ ఫలితాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొత్త వాహనం లేదా షాపింగ్ చేయొచ్చు.

English summary

Mars Transit in Gemini on 14 April 2021 Effects on Zodiac Signs in Telugu

Mars Transit in Gemini Effects on Zodiac Signs in Hindi : The Mars Transit in Gemini will take place on 14 April 2021.
Desktop Bottom Promotion