Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Mars Transit in Leo On 20 July: సింహ రాశిలోకి అంగారకుడి సంచారం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం...!
2021లో జులై 20వ తేదీన అంగారకుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం వృశ్చిక రాశికి అధిపతిగా భావిస్తారు. నవగ్రహాలకు ఉండే విభిన్న స్వభావాల కారణంగా అంగారకుడిని గ్రహాలకు సేనాధిపతిగా పరిగణిస్తారు.

అంతేకాదు ధరణి పుత్రుడిగా భావిస్తారు. అంగారకుడి ప్రభావం వల్ల రాశిచక్రాల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తెలివి, గంభీరం, శక్తివంతంగా ఉంటారు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2021 సంవత్సరంలో జులై 20వ తేదీన అంటే నేడు సాయంత్రం 5:21 గంటలకు అంగారకుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో సెప్టెంబర్ 6వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. అనంతరం కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే అంగారకుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
సింహ రాశిలోకి అంగారకుడు ఆగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే ఈ రాశి వారు ఆర్థిక లాభాలను మాత్రం పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం కూడా చాలా మంచిగా ఉంటుంది. ప్రేమ జీవితంలో కొంత సమస్యగా ఉంటుంది. మీ కుటుంబంలో కొంత అసమ్మతి ఉంటుంది. ముఖ్యంగా మీరు వాహనం ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..
అంగారకుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది.. వ్యాపారులు ఈ సమయంలో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడులకు మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీ వైవాహిక జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

మిధున రాశి..
అంగారకుడి స్థానం మార్పు వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. నిరుద్యోగులకు ఈ సమయంలో శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఈ కాలంలో మంచి అవకాశాలను పొందొచ్చు. ఉద్యోగం మారాలనుకునేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేయాలి.

కర్కాటక రాశి..
అంగారకుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మీ కుటుంబ జీవితంలో పెద్దలందరూ మీకు మద్దతుగా నిలుస్తారు. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక ప్రయోజనాలు మెరుగయ్యే బలమైన అవకాశం ఉంది.

సింహ రాశి..
సింహ రాశిలోకి అంగారకుడు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. దీని వల్ల సమాజంలో మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ఓపికగా ఉండాలి. విద్యార్థులకు ఈ కాలంలో చాలా మంచి ఫలితాలు రావొచ్చు.

కన్య రాశి..
అంగారకుడు సింహ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఈ కాలంలో బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీకు ప్రతికూలంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఈ సమయంలో ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు.

తుల రాశి..
సింహ రాశిలోకి అంగారకుని ప్రవేశం వల్ల ఈ రాశి వారికి మంచిగా ఉంటుంది. అయితే మీ ఖర్చులు పెరుగుతాయి. మరోవైపు మీ ప్రేమ జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. మీరు సహనంతో పని చేయాలి. మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన మంచిగా ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి అంగారకుడి ప్రయాణం వల్ల ప్రత్యేక ఫలితాలొస్తాయి. ఈ సమయంలో మీ విశ్వాసం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో పనులను, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. మరోవైపు అంగారకుడు మార్పుతో కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ మొత్తంలో వ్యాపారులు అనేక లాభాలను ఆర్జించవచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశుల వ్యాపారులకు అంగారకుడి సంచారం వల్ల మంచి ఫలితాలొస్తాయి. మీరు పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో అంతా మీరు ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి. మీరు మీ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లొచ్చు. ఈ కాలాన్ని మీరు బాగా ఆనందిస్తారు.

మకర రాశి..
సింహ రాశిలోకి అంగారకుడు ప్రవేశించే సమయంలో ఈ రాశుల వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన లావాదేవీలను చేయకపోవడమే మంచిది. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. మీ ఉమ్మడి కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి వారికి అంగారకుడి రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో ఈ కాలంలో ఉద్రిక్తత ఉంటుంది. మీ సంబంధానికి మరికొంత సమయం ఇవ్వాలి. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు శత్రువుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..
అంగారకుడు తన స్థానాన్ని మార్చుకోవడం ద్వారా ఈ రాశి వారు తమ బడ్జెట్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలి.



Click it and Unblock the Notifications