For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అంగారకుడి(కుజుడు)ని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. మేష, వృశ్చిక రాశికి కూడా కుజుడు అధిపతిగా ఉంటాడు.

ఎంతో విశిష్టత కలిగిన కుజుడు 2022 సంవత్సరంలో మే 17వ తేదీన అంటే మంగళవారం ఉదయం 9:52 గంటలకు కుంభ రాశి నుండి మీన రాశిలోకి మారిపోయాడు. ఇదే రాశిలో జూన్ 27వ తేదీ వరకు ఉదయం 6 గంటల వరకు సంచారం చేయనున్నాడు.

అనంతరం మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే మీనరాశిలో ఇప్పటికే గురుడు, శుక్ర గ్రహాలు సంచారం చేస్తున్నారు. ఇప్పుడే అంగారకుడు కూడా ఈ రాశిలో చేరడం వల్ల మూడు గ్రహాల కలయిక జరగనుంది. ఈ గ్రహాల సంయోగం వల్ల ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే గ్రహాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Mangal Gochar 2022:కుజుడు మీనంలోకి ప్రవేశం.. ఈ రాశులకు చాలా అదృష్టం..!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి కుజుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మేషరాశి వారికి ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఈ సమయంలో మీరు ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదు. లేదంటే మీరు నష్టపోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ రహస్య శత్రువులు ఓడిపోతారు. మరోవైపు మీరు స్నేహితులు, బంధువుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి కుజుడు 11వ పాదం గుండా మీన రాశిలోకి కుజుడి సంచారం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో మంచి స్నేహాన్ని మరియు సంబంధాన్ని కొనసాగించొచ్చు. వారి సహకారం మరియు సహాయంతో మీరు డబ్బు సంపాదించొచ్చు. అంగారకుడి ఈ సంచార సమయంలో మీరు గతంలో కంటే సామాజికంగా మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. అలాగే, మీరు ఈ సమయంలో కొందు కొత్త స్నేహితులను పరిచయం చేసుకోవచ్చు. భాగస్వామ్యాలతో వ్యాపారం చేసే వారికి ఈ కాలంలో వ్యాపారాభివృద్ధి ఉంటుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి కుజుడు పదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మిధున రాశి వారు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ప్రమోషన్లు పొందొచ్చు. మీ సామాజిక హోదా పెరుగుతుంది. మీ ఆస్తి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. మీకు రావాల్సిన బకాయిలు కూడా అందుతాయి. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

ఈ 4 రాశుల వారు చాలా పవర్ ఫుల్.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి కుజుడు తొమ్మిదో స్థానం నుండి సంచారం చేయడం వల్ల కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి.ఈ సమయంలో, మీరు దీర్ఘకాలిక ప్రణాళికలలో పెట్టుబడి పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారులు ఈ కాలంలో మంచి లాభాలను కూడా పొందొచ్చు. మరోవైపు విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు మీ వ్యాపార ప్రమోషన్ కోసం మరియు విస్తరణ కోసం ప్రయాణాలు చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి కుజుడు ఎనిమిదో స్థానం నుండి మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఈ కాలంలో మీరు అవగాహన మరియు సంయమనంతో వ్యవహరిస్తే, మీరు చాలా విజయవంతం అవుతారు. ఉద్యోగులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వివాహ కార్యక్రమాల్లో ఆలస్యం జరగొచ్చు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి కుజుడు ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో వ్యాపారులకు కొంత పురోగతి లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ప్రతికూలత ఉంటుంది. మీ శత్రువులు మీకు సహాయం చేసేందుకు ముందుకొస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో పదోన్నతి మరియు గౌరవం పొందొచ్చు.

బుధుడి అస్తమయం వల్ల ఈ రాశులకు తీవ్రమైన కష్టాలు..!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి కుజుడు మీనంలోకి ఆరో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వ్యాపారులకు గొప్ప ప్రయోజనాలు దక్కుతాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ధైర్యం కూడా పెరుగుతుంది. ఈ కాలంలో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు వివాదాలకు దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి కుజుడు ఐదో స్థానం నుండి సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ సమయంలో మీ ప్రేమ జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు అవివాహితులకు వివాహానికి సంబంధించి శుభవార్తలు వినిపించొచ్చు. ఈ కాలంలో మీరు బహుళ వనరుల నుండి డబ్బు సంపాదించొచ్చు. దీంతో మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో, మీకు ఆసక్తి ఉన్న ఉద్యోగానికి మారిపవచ్చు.

ధనుస్సు రాశి..

ధనుస్సు రాశి..

ఈ రాశి నుండి కుజుడు నాలుగో స్థానం నుండి ప్రయాణం చేస్తాడు. ఈ సమయంలో మీ ప్రియమైన వారి పట్ల మరింత సున్నితంగా ఉంటారు. ఈ సమయంలో వాహనం లేదా భూమి కొనుగోలు కోసం డబ్బు ఖర్చు చేయొచ్చు. విదేశీ ఖాతాదారులతో వ్యవహరించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు మీ లావాదేవీల నుండి మంచి లాభం పొందొచ్చు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి కుజుడు మూడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు ధైర్యంతో క్లిష్ట పరిస్థితులను సులభంగా అధిగమిస్తారు. ఈ కాలంలో మీరు మీ వ్యూహాలను రహస్యంగా ఉంచినట్లయితే మీరు విజయం సాధిస్తారు. మీరు విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి కుజుడు రెండో స్థానం గుండా సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉండొచ్చు. ఈ సమయంలో మీ ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాదస్పద సమస్యలను మాట్లాడి పరిష్కరించుకోవడం తెలివైన పని. మీ ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..

మీన రాశి..

కుంభ రాశి నుండి కుజుడు ఈ రాశిలోకి సంచారం చేసే సమయంలో మీన రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. మీకు ఆధ్యాత్మికత పట్ల మక్కువ పెరుగుతుంది. కొత్త జంటలకు సంతానం గురించి శుభవార్త వినిపిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రమోషన్ మరియు బాధ్యత పెరుగుతుంది.

English summary

Mars Transit in Pisces on 17 May 2022 Effects and Remedies on 12 Zodiac Signs in Telugu

Mangal Rashi Parivartan 2022 In Meena Rashi; Mars Transit in Pisces Effects on Zodiac Signs in Telugu : The Mars Transit in Pisces will take place on 17 May 2022.
Story first published: Tuesday, May 17, 2022, 16:26 [IST]
Desktop Bottom Promotion