For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mars Transit in Sagittarius:ధనస్సులోకి కుజుడి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అంగారకుడికి(కుజుడు) ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం 2022 సంవత్సరంలో జనవరి 16వ తేదీన ఆదివారం సాయంత్రం 3:26 గంటలకు వృశ్చికరాశి నుండి ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఈ సమయంలో కుజుడి రవాణా చాలా శక్తివంతమైనది. దీంతో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారిపై సానుకూల ప్రభావాలు చూపుతాయి.. మరి కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఈ సందర్భంగా ఏయే రాశి వారికి ఎలాంటి అడ్డంకులు వస్తాయి.. ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ వారం మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోండి...

మేష రాశి..

మేష రాశి..

అంగారకుడు ధనస్సులోకి సంచారం చేయడం వల్ల చాలా లక్కీగా అనిపించొచ్చు. మీరు చాలా కాలంగా పూర్తి చేయాలని భావిస్తున్న పనులన్నీ ఈ కాలంలో పూర్తి చేయొచ్చు. దీంతో మీ కెరీర్ కు మంచి ఉపయోగం ఉంటుంది. ఈ సమయం ఆర్థిక పరంగా లాభం ఉంటుంది. వ్యాపారులకు కూడా ఈ కాలంలో లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి కుజుడి రవాణా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది.

పరిహారం : ఈ కాలంలో సైన్యం మరియు రైతులకు కొంత నిధిని సేకరించి విరాళంగా ఇవ్వాలి.

వృషభరాశి..

వృషభరాశి..

కుజుడి రవాణా సమయంలో ఈ రాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. అలాగే మీరు కారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ సీనియర్లు మీకు మద్దతు ఇవ్వరు. ఉద్యోగులకు ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ పనిని పూర్తి చేయాలనుకుంటే, మీరు ఓపిక పట్టాలి. మీ సంబంధంలో సామరస్యం ఉంటుంది.

పరిహారం : మంగళవారం రోజున సుందరకాండ పారాయణం చేయాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి కుజుడి రవాణా వల్ల సంతోషం కలుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఈ కాలంలో సానుకూల ఫలితాలను పొందుతారు. పని ప్రదేశంలో సీనియర్ అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీకు అండగా ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే.. మీకు ప్రమోషన్ రావొచ్చు. కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే.. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : మీరు కార్తీకేయుడిని పూజించి, ఎర్రని వస్త్రాలను సమర్పించాలి.

Makar Sankranti 2022: మకరంలో మూడు గ్రహాల కలయిక.. ఈ 5 రాశులకు అశుభ ఫలితాలు...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ కాలంలో మీకు చాలా రంగాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు త్వరలో ఉపాధి లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈ సమయం మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకోవచ్చు.

పరిహారం : మీ ఇంట్లో వేప ముక్కను పెంచుకోవాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో మంచి లాభాలను పొందొచ్చు. మరోవైపు ఉద్యోగులు తమ ఉద్యోగాలను మార్చాలని లేదా కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తుంటే ఈ సమయం అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో మీరు కొత్త వ్యూహాలను ప్రయత్నించాలి. వివాహితులకు పిల్లల విషయంలో కొన్ని సమస్యలొస్తాయి. ఉన్నత విద్య కోసం విద్యార్థులు ఇప్పటినుంచే ప్లాన్ చేసుకోవాలి. మరోవైపు ఆరోగ్య సమస్యలున్నాయి.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : శ్రీ మహావిష్ణువును పూజించి, ఎర్రచందనం సమర్పించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మీకు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మీ కుటుంబంతో మాట్లాడేటప్పుడు దూకుడుగా ఉండొద్దు. అది మీ సంబంధాన్ని మరింత దిగజార్చొద్దు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే వ్యాపార నిర్ణయాలు తొందరపాటులో తీసుకోవద్దు. ఈ సమయం మీకు అనుకూలంగా లేదు.

పరిహారం : ప్రతి సోమవారం ఆవుకు బెల్లం తినిపించాలి.

Makar Sankranti 2022: 29 ఏళ్ల తర్వాత శని, సూర్యుడి సంయోగం... 12 రాశులపై పడే ప్రభావం...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు కుజుడి రవాణా కాలంలో కొన్ని పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఆఫర్లు వస్తాయి. మీరు క్లిష్ట పరిస్థితులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే అన్నీ సవ్యంగా జరుగుతాయి.

పరిహారం : మంగళవారం రోజున ఏదైనా దేవాలయంలో దానిమ్మ గింజలను దానం చేయాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక సమస్యలు ఎదురుకావొచ్చు. ఏదైనా రుణం పొందే విషయంలో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ కారణంగా మీరు నిరాశకు గురవుతారు. విద్యార్థులకు ఇది చాలా కష్టమైన సమయం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ కాలంలో ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు.

పరిహారం : శుభ ఫలితాల కోసం మంగళ యంత్రాన్ని ధరించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు ఈ కాలంలో సానుకూల ధ్రుక్పథాన్ని కలిగి ఉండాలి. మీ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ప్లాన్ చేయండి. మీ వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది. మీరు వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీరు కొన్ని మూడ్ స్వింగ్ లను ఎదుర్కోవచ్చు.

పరిహారం : అవసరమైన వారికి రక్తదానం చేస్తే శుభఫలితాలొస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో ప్రతికూలంగా ఉండొచ్చు. దీంతో మీరు చాలా నిరాశ చెందొచ్చు. ఈ సమయంలో మీకు అనేక ఖర్చులుంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. మీరు ఉన్నతాధికారులతో, సహోద్యోగులతో సత్సంబంధాలను ఏర్పరచుకోవాలి. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించొచ్చు.

పరిహారం : మీ పడకగదిలో ఏనుగు దంతాన్ని ఉంచుకుంటే మంచిది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి కుజుడి రవాణా కాలంలో సానుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబం మరియు స్నేహితులతో సత్సంబంధాలను కలిగి ఉంటారు. వ్యాపారవేత్తలు హేతుబద్ధమైన ఎంపికలు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మరియు మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం బాగుంటుంది. మీరు ఈ సమయంలో శారీరకంగా ధ్రఢంగా ఉండొచ్చు. మీరు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం.

పరిహారం : బయటకు వెళ్లేటప్పుడు ఎర్రని రుమాలును మీతో తీసుకెళితే మీకు శుభప్రదంగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి కుజుడి సంచారం సమయంలో సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులు కొన్ని లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీరు వ్యక్తిగత జీవితంలో ప్రేమ మరియు ఆనందం నిండి ఉంటుంది. మీరు అనవసరమైన వాదనల్లో పాల్గొనొద్దు. మీ విధానంలో కొంచెం ఆచరణాత్మకంగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈ కాలం బాగానే ఉంటుంది. రోజువారీ వ్యాయామంపై ఫోకస్ పెట్టండి.

పరిహారం : మంగళవారం రోజున ఏదైనా గుడిలో తీపి పదార్థాలను దానం చేయాలి.

కుజుడు 2022లో ఏ రాశిలోకి, ఎప్పుడు రవాణా చేయనున్నాడు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో జనవరి 16వ తేదీన కుజుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు.

English summary

Mars Transit in Sagittarius On 16 January 2022 Effects on Zodiac Signs in Telugu

Mangal rashi parivartan january 2022 in Dhanu Rashi; Mars Transit in Sagittarius Effects on Zodiac Signs in Telugu : The Mars Transit in Sagittarius will take place on 16 January 2022. Learn about remedies to perform in Telugu.
Story first published: Monday, January 17, 2022, 11:06 [IST]