For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mars Transit in Virgo 6 Septemeber 2021: కన్యరాశిలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!

2021లో సెప్టెంబర్ 6వ తేదీన కన్యరాశిలో అంగారకుడి ప్రవేశంతో ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవగ్రహాలలో అంగారకుడి(కుజుడు)కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గ్రహాన్నే అరుణ గ్రహం అని కూడా పిలుస్తారు. ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల జాతకరీత్యా ధైర్యం, శక్తి కారకుడిగా పరిగణిస్తారు.

Mars Transit in Virgo On 06 September 2021 Effects on Zodiac Signs in Telugu

ఎంతో గొప్ప విశిష్టత కలిగిన అంగారకుడు సెప్టెంబర్ తొలి వారంలో అంటే 2021 సంవత్సరంలో సెప్టెంబర్ ఆరో తేదీన ఉదయం 3:56 గంటలకు తన స్థానాన్ని మారనున్నాడు.

Mars Transit in Virgo On 06 September 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. శని గ్రహం తర్వాత అత్యంత క్రూరమైన గ్రహంగా కుజుడిని పరిగణిస్తారు. అలాంటి అంగారకుడు సింహ రాశి నుండి కన్యా రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఏ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.. ఏ రాశి సానుకూల ఫలితాలు వస్తాయనే వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.

zodiac signs:ఏ రాశుల వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారంటే...!zodiac signs:ఏ రాశుల వారికి ఎక్కువ మంది శత్రువులు ఉంటారంటే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి అంగారకుడు(కుజుడు) ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు మీ శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు చేపట్టే ప్రతి ప్రయత్నంలో సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఈ కాలంలో మీ ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు ఈ కాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి కుజుడు ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో వృషభ రాశి వారు క్రీడా రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ కాలంలో క్రీడా పోటీల్లో పాల్గొనే వారు కచ్చితంగా విజయం సాధిస్తారు. మరోవైపు విద్యార్థులు తమ ప్రతిభను చాటే అవకాశాన్ని పొందుతారు. మీరు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి ఫలితాలను సాధిస్తారు. మరోవైపు ఉద్యోగులు ఈ కాలంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టినప్పుడు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి, సమయానికి మీ పనులన్నీ పూర్తి చేస్తారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి కుజుడు నాలుగో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మీ కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సొంత వ్యక్తులే కుట్ర పన్నే అవకాశం ఉంది. వారు మిమ్మల్ని అవమానించేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయంలో మీరు జాగ్ర్తగా ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ ప్రణాళికలను గోప్యంగా ఉంచాలి.

Venus Transit in Libra On 06 September 2021:తులరాశిలోకి శుక్రుడి సంచారం... 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!Venus Transit in Libra On 06 September 2021:తులరాశిలోకి శుక్రుడి సంచారం... 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి అంగారకుడు మూడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ధైర్యం, శ్రమ కచ్చితంగా పెరుగుతాయి. అయితే మీ కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు స్నేహితులు, బంధువుల నుండి సహకారం ఆశించొచ్చు. అంతే కాకుండా గొప్ప వ్యక్తుల ప్రోత్సాహంతో మీరు తప్పకుండా విజయం సాధించగలరు. ఈ సమయంలో వ్యాపారులకు ఆదాయ పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు మీ వ్యాపారాన్ని మరింత పెంచుకోవాలంటే.. మీరు మంచి ప్లాన్ ను రూపొందించుకోవాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి కుజుడు రెండో పాదం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే మీరు వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వ్యాపారులు ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపార ఒప్పంద విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

సింహ రాశి నుండి కన్యరాశిలోకి కుజుడు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీరు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు మీ కోర్టు కేసులకు సంబంధించిన వివాదాలు ముగుస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో పని చేసే వారికి పరిస్థితులు అనుకూలంగా మారతాయి.

సెప్టెంబరులో 5 గ్రహాల మార్పు.. ఈ రాశులకు అనుకూలం...!సెప్టెంబరులో 5 గ్రహాల మార్పు.. ఈ రాశులకు అనుకూలం...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి కుజుడు పన్నెండో స్థానం సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురవ్వొచ్చు. ఈ కారణంగా కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీరు కోర్టులకు సంబంధించిన వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలి. మరోవైపు పిల్లలకు సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని కలవరపెట్టొచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి అంగారకుడు పదకొండో స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వ్యాపారులకు మంచి లాభాలొస్తాయి. ఈ సమయంలో అంగారకుడి సంచారం వల్ల మీకు అనేక చోట్ల నుండి మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులు తమ కెరీర్లో మంచి పురోగతిని సాధిస్తారు. కొందరు విదేశీ వనరుల నుండి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది. మరోవైపు ప్రేమ సంబంధిత విషయాల్లో నిరాశగా ఉంటుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి కుజుడు పదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఉద్యోగులు కార్యాలయంలో పురోగతి గురించి కొన్ని శుభవార్తలు వింటారు.మీరు పని ప్రదేశంలో మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాదు.. మీ కలలన్నీ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగులు ఉద్యోగం మార్పు కోసం చూస్తుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేపట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేస్తారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి కుజుడు తొమ్మిదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మీ ధైర్యం కూడా పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రశంసించబడతాయి. మీకు ఈ కాలంలో మతం, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. విదేశీ కంపెనీలలో సేవ లేదా పౌరసత్వం కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతం అయ్యే అవకాశం ఉంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి కుజుడు ఎనిమిద స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఆరోగ్య పరంగా మీకు ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మీ కోర్టు కేసులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి కుజుడు ఏడో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. అయితే ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. వివాహ సంబంధిత చర్చల్లో కాస్త ఆలస్యమవుతుంది. మీరు మీ వ్యూహాలు మరియు ప్రణాళికలను గోప్యంగా ఉంచాలి. అప్పుడే మీరు విజయం సాధిస్తారు.

FAQ's
  • కన్యరాశిలోకి సెప్టెంబర్ 6న ఏ గ్రహం రవాణా చేయబోతోంది?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎంతో గొప్ప విశిష్టత కలిగిన అంగారకుడు సెప్టెంబర్ తొలి వారంలో అంటే 2021 సంవత్సరంలో సెప్టెంబర్ ఆరో తేదీన ఉదయం 3:56 గంటలకు సింహ రాశి నుండి కన్యరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.. ఏ రాశి సానుకూల ఫలితాలు వస్తాయనే వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.

English summary

Mars Transit in Virgo On 06 September 2021 Effects on Zodiac Signs in Telugu

Here we are talking about the mars transit in virgo 6 september 2021, effect on zodiac signs in telugu. Have a look,
Story first published:Monday, September 6, 2021, 15:37 [IST]
Desktop Bottom Promotion