For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Planets Snuggle: ఆకాశంలో మళ్లీ అద్భుతం... శుక్రుడు, అంగారకుడి కలయికను నేరుగా చూడొచ్చట...!

ఆకాశంలో ఈరోజు అద్భుతం జరగనుంది. శుక్రుడు, అంగారకుడు చాలా దగ్గరగా రానున్నారు.

|

ఆకాశంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకు అనేక అద్భుతాలు చోటు చేసుకోగా.. ఈరోజు అంటే జులై 13వ తేదీన రాత్రి వేళ కూడా మరో అద్భుతం జరగనుంది. ఖగోళంలో భూమికి అత్యంత సమీపంలో ఉండే శుక్రుడు, అంగారక గ్రహాలు పరస్పరం మరింత దగ్గరగా రానున్నాయి.

Mars, Venus, Moon Set to Align Today: When and How to Watch This Celestial Wonder in India

ఈ సమయంలో ఇవి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. ఈ అద్భుతమైన ద్రుశ్యాన్ని ఎలాంటి సాధనాలు లేకుండా నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖగోళంలోని ఆయా గ్రహాల కక్ష్యల కారణంగా కొన్ని అరుదైన సందర్భాల్లో ఇలా ఒకదానికొకటి దగ్గరగా వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.

Mars, Venus, Moon Set to Align Today: When and How to Watch This Celestial Wonder in India

ఈరోజున రాత్రి శుక్రుడు, అంగారక గ్రహాలు దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య దూరం కేవలం 0.5 డిగ్రీల మేరకు మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రెండు గ్రహాలు చంద్రుడు పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం నుండే మొదలవుతుందని, ఇవి ఈరోజున మరింత దగ్గరగా కనిపిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Mars, Venus, Moon Set to Align Today: When and How to Watch This Celestial Wonder in India

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారకుడు, శుక్రుడు, బుధుడు, గురుడు, శని గ్రహాలను నక్షత్ర గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ ఐదు గ్రహాల్లో ఏవైనా రెండు ఒకదానికొకటి దగ్గరగా వస్తే భూమి నుండి అవి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి లేదా కలుస్తాయి. అప్పుడు ఇలాంటి పరిస్థితిని గ్రహాల యుద్ధం అని అంటారు. అయితే సూర్యుడు, చంద్రుడు ఎప్పుడూ గ్రహ యుద్ధంలో ఉండరు. ఎందుకంటే సూర్యుడితో పాటు ఏ గ్రహం వచ్చినా అది అస్తమించినట్లు కనిపిస్తుంది. భూమి నుండి చూసినప్పుడు ఆ గ్రహం కనిపించదు. కానీ ఆయా గ్రహాల కక్ష్య ద్రుష్ట్యా అరుదైన సందర్భాల్లో మాత్రమే భూమి నుండి చూసినప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. ఈ ఖగోళ వింతను నేరుగా చూడొచ్చని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ తెలిపింది. మంగళవారం తర్వాత కుజ, శుక్ర, గ్రహాలు దూరంగా వెళ్లిపోనున్నాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం శుక్రుడు, అంగారకుడు దగ్గరకు రావడం ఇదే మొట్టమొదటిసారి. అంగారకుడు, శుక్రుడు మళ్లీ 2022 ఫిబ్రవరి 12వ తేదీన, అదే సంవత్సరంలో మార్చి 12వ తేదీన మరోసారి దగ్గరకు రానున్నాయి.

English summary

Mars, Venus, Moon Set to Align Today: When and How to Watch This Celestial Wonder in India

Here we are talking about the mars, venus, moon set to align today: When and how to watch this celestial wonder in India. Have a look
Story first published:Tuesday, July 13, 2021, 22:15 [IST]
Desktop Bottom Promotion