Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Mercury Combust 2022 :కుంభంలో బుధుడి అస్తమయం.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు...!
2022లో మార్చి 18న కుంభరాశిలో బుధుడి అస్తమయం వల్ల రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలివితేటలు, కమ్యూనికేషన్, సంపద, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే బుధుడు 2022 సంవత్సరంలో మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం నాడు కుంభరాశిలో అస్తమించనున్నాడు.

సూర్యుడికి దగ్గరగా వెళ్లడం వల్ల తన శక్తిని కోల్పోతాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
బుధుడి అస్తమయం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ మనసులో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు తండ్రి మద్దతు లభిస్తుంది. మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలను వింటారు.

వృషభ రాశి..
ఈ రాశి వారికి ఈ కాలంలో ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మనసులో ఏదో ఒక విషయం గురించి అలజడి పెరుగుతుంది. ఉద్యోగులకు పురోగతికి సంబంధించిన శుభవార్తలు వినిపిస్తాయి. మీరు కొత్త వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది.

మిధున రాశి..
ఈ రాశి వారు బుధుడి అస్తమయం కాలంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యకు సంబంధించిన సమస్యలు పెరగొచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. మరోవైపు మీరు మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు బుధుడి అస్తమయం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. మీరు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలను వింటారు. మీ ప్రయాణం మొత్తం సుఖమయం అవుతుంది. మీరు ఏదైనా మతపరమైన స్థలాన్ని సందర్శించడానికి వెళ్లొచ్చు. వ్యాపారస్తులు తమ నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి.

సింహ రాశి..
ఈ రాశి వారికి బుధుడి అస్తమయం సమయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ మనసు ఆనందంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగాలు మారాలని ఆలోచించే వారికి, మంచి అవకాశం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి బుధుడి అస్తమయం సమయంలో ప్రత్యేకంగా ఉండదు. ఈ కాలంలో మీరు మీ తండ్రి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీరు చాలా ఓపికగా ఉండాలి. ఉద్యోగులు ఈ కాలంలో శుభవార్తలను వింటారు.

తుల రాశి..
ఈ రాశి వారికి బుధుడి అస్తమయం కారణంగా మంచిగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు భౌతిక సౌకర్యాల కోసం ఎక్కువ ఖర్చు చేయొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి బుధుడి అస్తమయం సమయంలో మనసులో ఏదో ఒక విషయం గురించి అలజడి ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు తమ ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ కాలంలో మీకు మంచి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటకు బదిలీ జరిగే అవకాశం ఉంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి బుధుడి అస్తమయం సమయంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెంచుకుంటారు. వ్యాపారులు కూడా మంచి ఫలితాలను పొందుతారు. మీ విదేశీ ప్రయాణ కల కూడా నెరవేరుతుంది.

మకర రాశి..
బుధుడి అస్తమయం వల్ల ఈ రాశి వారి ఉద్యోగులకు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు కోరుకున్న చోటుకు బదిలీ పొందొచ్చు. మీ ఆఫీసులో వాతావరణం బాగుంటుంది. మీరు సహోద్యోగులతో పాటు సీనియర్ అధికారుల మద్దతును పొందుతారు. మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

కుంభ రాశి..
ఈ రాశి వారికి బుధుడి అస్తమయం కారణంగా, వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు చాలా ఓపికగా ఉండాలి. ఈ పరిస్థితిలో కూడా, మీరు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి విజయం లభిస్తుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి బుధుడి అస్తమయం కారణంగా, కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు రావొచ్చు. ఈ కాలంలో మీరు చాలా తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయం కొంత ఉపశమనం కలుగుతుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలివితేటలు, కమ్యూనికేషన్, సంపద, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే బుధుడు 2022 సంవత్సరంలో మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం నాడు కుంభరాశిలో అస్తమించనున్నాడు. సూర్యుడికి దగ్గరగా వెళ్లడం వల్ల తన శక్తిని కోల్పోతాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.



Click it and Unblock the Notifications