Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Mercury Combust 2022 :బుధుడి అస్తమయంతో ఈ 4 రాశులకు రాబోయే 20 రోజుల్లో అదృష్టం వరిస్తుంది...!
2022లో బుధుడు కుంభంలో అస్తమయం చెందడం వల్ల ఈ రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బుధుడిని తెలివితేటలు, కమ్యూనికేషన్, సంపద, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే బుధుడు 2022 సంవత్సరంలో మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం నాడు కుంభరాశిలో అస్తమించనున్నాడు.

సూర్యుడికి దగ్గరగా వెళ్లడం వల్ల తన శక్తిని కోల్పోతాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు తమ స్థానాలను మారినప్పుడు, మరీ ముఖ్యంగా గ్రహాలు అస్తమయం మరియు ఉదయించే సమయంలో ద్వాదశ రాశుల వారిలో, కొన్ని రాశుల వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయట. ఈ సందర్భంగా నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమే ఇప్పుడే చూసేయ్యండి...

బుధుడి అస్తమయం..
2022 సంవత్సరంలో బుధుడు మకరం నుండి కుంభరాశిలోకి మార్చి 6వ తేదీన ప్రవేశించాడు. ఆ తర్వాత మార్చి 18వ తేదీన అంటే శుక్రవారం రోజున అస్తమించనున్నాడు. సాధారణంగా గ్రహాల అస్తమయం వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువగా వస్తుంటాయని చాలా మంది నమ్ముతారు. అయితే జ్యోతిష్యశాస్త్రం నాలుగు రాశుల వారికి మంచి లాభాలు రానున్నాయట. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి..
బుధుడి అస్తమయం వల్ల ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మరోవైపు నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈ కాలంలో మంచి ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మిధునరాశి
బుధుడి అస్తమయం వల్ల ఈ రాశి వారిలో ఉద్యోగులు తాము ఊహించిన ఫలితాలను పొందొచ్చు. ముఖ్యంగా మీరు కోరుకున్న పదోన్నతులు రావొచ్చు. ఈ సమయంలో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మరోవైపు మీరు మతపరమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మకరరాశి
బుధుడు అస్తమించే సమయంలో మకర రాశి వారికి అదృష్టంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు వైవాహిక జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలంగా మరియు అనుకూలంగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు ఈ సమయంలో ఒక కొలిక్కి వస్తాయి. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. అలాగే ఉద్యోగులకు శుభ ఫలితాలు రానున్నాయి. మీరు కోరుకున్న చోటుకు బదిలీ పొందొచ్చు. మీ ఆఫీసులో వాతావరణం బాగుంటుంది. మీరు సహోద్యోగులతో పాటు సీనియర్ అధికారుల మద్దతును పొందుతారు. మీరు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మీన రాశి..
బుధుడి అస్తమయం వల్ల ఈ రాశి వారిలో వ్యాపారులకు ఊహించిన లాభాలొస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించొచ్చు. మరోవైపు మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే.. ఈ సమయం ఉత్తమంగా ఉంటుంది. పాత బకాయిల ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుంది.



Click it and Unblock the Notifications