Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
ధనుస్సురాశిలో బుధుడి అస్తమయం.. ఈ రాశులవారికి తీవ్ర నష్టాలు, నివారణలేంటంటే
ధనుస్సు రాశిలో బుధుడి అస్తమయం వల్ల ఏయే రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో బుధుడికి ఎంతో ప్రాధాన్య ఉంది. తెలివితేటలు, సంపద, ఐశ్వర్యానికి ప్రతీకగా బుధగ్రహాన్ని భావిస్తారు. 2023 జనవరి 2వ తేదీ సోమవారం రోజున బుధుడు ధనుస్సు రాశిలో అస్తమించనున్నాడు. సూర్యుడికి దగ్గరగా వెళ్లడం వల్ల తన శక్తిని కోల్పోతాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది.

ధనుస్సు రాశిలో బుధుడి అస్తమయం వల్ల ఏయే రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రంలో అస్తమయం అంటే ఏంటి?
గ్రహాలు సూర్యుడికి కొన్ని డిగ్రీలు దగ్గరగా వచ్చినప్పుడు సంభవించే పరిస్థితిని అస్తమయం అంటారు. గ్రహాలు ఇలా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి బలాన్ని కోల్పోతాయి. దానిని దహనం అంటారు.
ధనుస్సు రాశిలో బుధుడి అస్తమయం: సమయం
2023, జనవరి 2వ తేదీన తిరోగమన బుధుడు ధనుస్సు రాశిలో తెల్లవారుజామున 2.33 గంటలకు అస్తమించనున్నాడు. అలాగే జనవరి 13వ తేదీన ఉదయం 5.15 గంటలకు బయటకు రానున్నాడు.

మేషరాశి:
ధనుస్సు రాశిలో బుధుడు దహనం చేయడం వల్ల మేష రాశి వారికి బుధుడు మూడో ఇంటిని, ఆరో ఇంటిని పాలిస్తాడు. తొమ్మిదో ఇంటి ధనుస్సు రాశిలో అస్తమిస్తాడు. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు వారి వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు పడతారు. కమ్యూనికేట్ చేసేటప్పుడు స్పృహతో ఉండాలని సలహా ఇస్తారు. తండ్రి, గురువులు, సలహదారులతో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు కూడా మాటల తీరు అదుపులో ఉంచుకోవడం మంచిది.
పరిహారం: ఆలయంలో ఆకుపచ్చ రంగులో ఉన్న స్వీట్లను దానం చేయండి.

వృషభం:
ధనుస్సు రాశిలో బుధుడు అస్తమించడం వల్ల వృషభ రాశి వారికి రెండు, ఐదో ఇంట్లో బుధుడు పాలిస్తున్నాడని, అస్తమయం 8వ ఇంట్లో జరుగుతుందని సూచన. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. సేవింగ్స్‌తో రిస్క్ తీసుకోవద్దు. చర్మ సంబంధిత సమస్యలు రావొచ్చు. సంతాన సమస్యలు వస్తాయి. అత్తమామలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం: ట్రాన్స్‌జెండర్లను గౌరవించాలి. వారికి ఆకుపచ్చు రంగు దుస్తులు దానం చేయండి.

మిథునరాశి:
ధనుస్సు రాశిలో బుధుడి అస్తమయం ద్వారా మిథునరాశి వారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భాగస్వాముల మధ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దంపతుల మధ్య అపార్థాలు రావొచ్చు. ముఖ్యంగా దంపతులు జాగ్రత్తగా ఉండట మంచిది
పరిహారం: గణేశుడిని పూజించాలి.

కర్కాటకరాశి:
కర్కాటక రాశి వారికి 12, 13 ఇంటికి బుధుడు అధిపతి. 6వ ఇంట్లో ధనుస్సు రాశిలో బుధుడి అస్తమయం వల్ల కొంత ప్రభావం ఉంటుంది. వృత్తి సంబంధిత ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. నిరాశ, ధన నష్టం, అనారోగ్య సమస్యలు రావొచ్చు. ఆర్థిక స్థితి బాగుండదు. సైబర్ నేరాలకు బాధితులగా మారే అవకాశం ఉంది. అప్రమత్తత అవసరం.
పరిహారం: బుధ గ్రహ బీజ మంత్రాన్ని రోజూ పఠించాలి.

సింహరాశి:
సింహరాశి 2, 11 ఇళ్లకు బుధుడే అధిపతి. ధనుస్సు రాశిలో బుధుడి అస్తమయం వల్ల సింహ రాశి వారు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. షేర్‌మార్కెట్లు, లాటరీలు, జూదాల్లో నష్టపోయే అవకాశాలు ఎక్కువ. డబ్బుతో వ్యవహరించే పనుల్లో అప్రమత్తత చాలా అవసరం. విద్యార్థులూ కొత్త కోర్సుల ఎంపిక, ఉద్యోగాల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం: ఆవులకు పచ్చి మేత వేయాలి.

కన్య:
కన్యరాశి దశమ లగ్నానికి బుధుడు అధిపతి. 4వ ఇంట్లో బుధుడు దహనం అవుతున్నాడు. కుటుంబసభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కన్య రాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌లో సమస్యలు వస్తాయి. వాహనాలు సమస్యలు తెప్పిస్తాయి. ఇంటి నుండి పని చేసే వారు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొటారు.
పరిహారం: ఆకుపచ్చ దుస్తులు ధరించాలి. కనీసం ఆకుపచ్చ కర్చీఫ్ అయినా దగ్గర ఉంచుకోవాలి.

తులారాశి:
తులారాశి వారికి బుధుడు 12వ, 9వ ఇంటికి అధిపతి. ఇప్పుడు 3వ ఇంట్లో బుధుడు అస్తమించనున్నాడు. ట్రిప్స్, తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తుంటే అది అర్ధాంతరంగా ఆగిపోవచ్చు. తోబుట్టువులతో వాగ్వాదాలు చేయకపోవడం మంచిది. వృత్తిలో ఏకాగ్రత సమస్య ఎదుర్కోవచ్చు.
పరిహారం: ఓం నమో భగవతే వాసుదేవాయ అని రోజూ 108 సార్లు పఠించాలి.

వృశ్చికరాశి:
వృశ్చికరాశి వారి 11వ, 8వ ఇంటిని బుధుడు పరిపాలిస్తాడు. రెండో ఇంట్లో బుధుడు దహనం అవుతున్నాడు. బుధుడి అస్తమయం వల్ల ఆర్థిక సమస్యలు రావొచ్చు. ఊహాగానాలతో కూడిన వ్యాపారాలు చేయవద్దు. సేవింగ్స్ తో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఇతరులతో మాట్లాడేటప్పుడు పదాల ఎంపికలో జాగ్రత్త అవసరం.
పరిహారం: తులసి మొక్కకు రోజూ నీరు పోయాలి. ఒక ఆకును తినాలి.

ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి 7వ, 10వ ఇంటికి బుధుడు అధిపతి. ఇప్పుడు ధనుస్సు రాశిలో బుధుడు అస్తమించనున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి. నాడీ వ్యవస్థ, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం: రోజూ దీపం వెలిగించాలి. తులసి మొక్కను పూజించాలి.

మకరరాశి:
మకర రాశి వారికి బుధుడు 6వ, 9వ ఇంటికి అధిపతి. 12వ ఇంట్లో బుధుడు అస్తమించనున్నాడు. ధనుస్సు రాశిలో బుధుడు దహనం వేళ తల్లిదండ్రులను ఆరోగ్యంగా చూసుకోవాలి. ఆకస్మిక విదేశీ వ్యాపార పర్యటనలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రణాళికలు సాధ్యం కాకపోవచ్చు. ఆర్థిక నష్టం బాధించవచ్చు.
పరిహారం: గుమ్మడి కాయను తీసుకుని దానిని నుదిటిపై తాకి నీటిలో సమర్పించాలి.

కుంభరాశి:
కుంభ రాశి వారికి బుధుడు 5వ, 8వ ఇళ్లకు అధిపతిగా ఉంటాయి. ఈ సమయంలో కొన్ని తప్పుడు పెట్టుపడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృత్తిలో సమస్యలు రావొచ్చు. కుటుంబసభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం.
పరిహారం: చిన్న పిల్లలకు ఏదైనా పచ్చని బహుమతి ఇవ్వాలి.

మీనారాశి:
మీన రాశి వారికి బుధుడు 4వ, 7వ ఇళ్లకు అధిపతిగా ఉంటాయి. బుధుడి అస్తమయం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా అప్రమత్తంగా ఉండాలి. తెలిసినవారే అడ్డంకులు సృష్టించవచ్చు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం: బుధ గ్రహ బీజ్ మంత్రాన్ని రోజూ పఠించాలి.



Click it and Unblock the Notifications











