Just In
- 8 hrs ago
Happy Eid al-Adha 2022 : బక్రీద్ సందర్భంగా మీ ముస్లిం మిత్రులకు ఈ విషయం చెప్పడం మర్చిపోకండి...!
- 9 hrs ago
అన్ని రకాల డైట్లు ప్రయత్నించినా బరువు తగ్గలేదా?... ఈ చిన్న పొరపాటు వల్లే...
- 12 hrs ago
పొరపాటున మర్చిపోయి వీటిని బెడ్ కింద పెట్టకండి లేకపోతే మీరు చాలా బాధపడాల్సి వస్తుంది..
- 14 hrs ago
మధుమేహాన్ని సులభంగా నియంత్రించడానికి ఈ చియా విత్తనాలను ఎలా ఉపయోగించాలో మీకు తెలుసా?
Don't Miss
- Sports
టీ20 ప్రపంచకప్‌కు మా ప్లాన్లలో ఉమ్రాన్ మాలిక్ కచ్చితంగా ఉంటాడు : రోహిత్ శర్మ
- News
కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియాకు అదనపు శాఖల బాధ్యతలు
- Movies
విజయేంద్ర ప్రసాద్, ఇళయరాజాలకు కేంద్రం కీలక పదవులు.. నేరుగా రాజ్యసభకు!
- Technology
Flipkart లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి!
- Automobiles
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు
- Finance
Anand Mahindra: అదిరిపోయిన ఆనంద్ మహీంద్రా రిప్లై.. HRI అంటూ సమాధానం..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
వృషభంలో బుధుడి అస్తమయం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధ గ్రహం అతి చిన్నది. ఎవరి జాతకంలో అయితే బుధుని అనుగ్రహం ఉంటుందో వారికి తెలివితేటలు, మేధస్సు వంటివి పెరగడంతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ నేపథ్యంలో బుధుడు 2022 సంవత్సరంలో మే 13వ తేదీన వృషభరాశిలో అస్తమించబోతున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడనుంది.
ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.. ద్వాదశ రాశుల వారు ఏయే పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Lunar
Eclipse
May
2022
Astrology
:ఈ
ఏడాది
తొలి
చంద్ర
గ్రహణం
వేళ
ఈ
రాశులకు
చాలా
కష్టాలు...!

మేష రాశి..
వృషభంలో బుధుడి అస్తమయం సమయంలో ఈ రాశి వ్యాపారులకు ఆర్థిక లాభాలొస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీరు చేసే పనిలో కూడా విజయం సాధిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాల గురించి మాట్లాడేటప్పుడు చాలా ప్రశాంతంగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామితో ఆనందాన్ని కొనసాగించాలి. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.
పరిహారం : ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి బుధుడి అస్తమయం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో మెరుగ్గా పని చేస్తారు. మీరు చేసే పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కొన్ని ఉద్యోగావకాశాలను పొందొచ్చు. మీ ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది.
పరిహారం : ప్రతిరోజూ 14 సార్లు ‘‘ఓం బుధాయ నమః'' అని మంత్రాన్ని జపించాలి.

మిధున రాశి..
బుధుడి అస్తమయం సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వెంచర్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు సామరస్యం ఉంటుంది. ఆరోగ్య పరమైన విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : మీరు బుధవారం పేద పిల్లలకు భోజనం పెట్టొచ్చు.
మీ
పర్సులో
ఇవి
కచ్చితంగా
ఉండేలా
చూసుకోండి...
ఎందుకంటే
ఆర్థిక
సమస్యలను
అధిగమించొచ్చు...!

కర్కాటక రాశి..
ఈ రాశి వారు బుధుడి అస్తమయం సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. కొందరు వ్యక్తులు విదేశాల్లో కొత్త వ్యాపార అవకాశాలను పొందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు సామరస్యం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాలంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : బుధవారం రోజున ఆవుకు పచ్చి గడ్డిని తినిపిస్తే శుభ ఫలితాలొస్తాయి.

సింహ రాశి..
ఈ రాశి వారిలో ఉద్యోగులు ట్రాన్స్ ఫర్ కావొచ్చు. వ్యాపారులు తమ ప్రత్యర్థుల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటారు. మీ వ్యక్తిగత జీవితంలో వాదనలు ఉండొచ్చు. మీరు మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి.
పరిహారం : మీరు ప్రతిరోజూ లింగాష్టకం జపించాలి.

కన్య రాశి..
ఈ రాశి వారిలో నిరుద్యోగులు కొత్త ఉద్యోగావకాశాలను పొందుతారు. మీ జీవితం సానుకూల ప్రభావాలతో నిండి ఉంటుంది. వ్యాపారులకు విదేశాలలో కొత్త వెంచర్లు లభిస్తాయి. మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఒకరికొకరు మద్దతు ఇస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది.
పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామం జపించాలి.
Chandra
Grahan
2022:ఈ
ఏడాది
సంపూర్ణ
చంద్ర
గ్రహణం
ఎప్పుడు?
ఎక్కడ
కనిపిస్తుంది?

తుల రాశి..
ఈ రాశి వారిలో ఉద్యోగులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారులు ఈ కాలంలో నష్టపోయే అవకాశం ఉంది. మీరు మీ ప్రణాళిక ప్రకారం పని చేయాలి. ఆరోగ్య పరంగా ఈ కాలంలో ఏవైనా సమస్యలుంటే, వైద్యుడిని సంప్రదించాలి.
పరిహారం : శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించి, నూనెతో దీపారాధన చేయాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారులకు కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావొచ్చు. మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో మీ రోగ నిరోధక శక్తి తగ్గొచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం :‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని రోజూ 11 సార్లు జపించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారిలో ఉద్యోగులు ఈ కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీకు కష్టంగా ఉండొచ్చు. మీరు చాలా జాగ్రత్తగా పని చేయాలి. మీ సంబంధంలో కొన్ని హెచ్చుతగ్గులుంటాయి. మీ జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు రావొచ్చు. వ్యాపారులకు ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : మీరు ప్రతిరోజూ 11 సార్లు ‘‘ఓం గుర్వే నమః'' అని జపించాలి.

మకర రాశి..
ఈ రాశి వారు ఈ కాలంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలి. వ్యాపారులకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు మీ వ్యాపార విస్తరణ కోసం ప్లాన్ చేసుకోవాలి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ధ్యానం, యోగా, వ్యాయామం చేయాలి.
పరిహారం : మీరు హనుమాన్ చాలీసాను పఠించాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఈ కాలంలో కెరీర్ కు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు కొన్ని కొత్త ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మీ కుటుంబ సభ్యులతో గొడవలు జరగొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం :మీరు శనివారం రోజున అనారోగ్యంతో ఉన్న వారికి ఆహారం ఇవ్వొచ్చు.

మీన రాశి..
ఈ రాశి వారిలో పని చేసే వారికి కొత్త ఉద్యోగావకాశాలు రావొచ్చు. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తారు. మరోవైపు వ్యాపారులకు ఈ కాలంలో తక్కువ లాభం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని పరిష్కరించడానికి, మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.
పరిహారం : మీరు మీ ఇంటి పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి.
గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు దయచేసి మీరు వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించగలరు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు 2022 సంవత్సరంలో మే 13వ తేదీన వృషభరాశిలో అస్తమించబోతున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.. ద్వాదశ రాశుల వారు ఏయే పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...