For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధుడి అస్తమయం వల్ల ఈ రాశులకు తీవ్రమైన కష్టాలు..!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధ గ్రహం అతి చిన్నది. ఎవరి జాతకంలో అయితే బుధుని అనుగ్రహం ఉంటుందో వారికి తెలివితేటలు, మేధస్సు వంటివి పెరగడంతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ నేపథ్యంలో బుధుడు 2022 సంవత్సరంలో మే నెలలో 11వ తేదీన తిరోగమనం చెందిన తర్వాత రెండు రోజులకే అంటే 13వ తేదీన శుక్రవారం నాడు వృషభరాశిలో అస్తమించాడు. వచ్చే నెల అంటే జూన్ 9వ తేదీ వరకు ఇదే స్థితిలో కొనసాగనున్నాడు.

నవ గ్రహాలలో కొన్ని సూర్యుని చుట్టూ వేగంగా తిరుగుతూ.. సూర్య గ్రహానికి వెనుక వైపునకు పయనిస్తాయి. అప్పుడు అవి మనకు కనిపించవు. భూమి కూడా సూర్యుడి వెనుక వైపునకు వెళ్లినప్పుడు ఇంకో వైపున ఉండే గ్రహాలనేవి కనిపించవు.

వీటినే గ్రహాల అస్తమయం లేదా అస్తంగతం అని అంటారు. ఇలా గ్రహాలు అస్తమయం అయిన సమయంలో కొంత బలహీనంగా మారిపోతాయి. దీంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. అందులోనూ కొన్ని రాశుల వారికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఈ సందర్భంగా బుధుడి అస్తమయం వల్ల ఏ రాశుల వారికి తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

వృషభంలో బుధుడి అస్తమయం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు బుధుడి అస్తమయం కాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలంలో మీకు ఆరోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మీ అమ్మగారి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. తనను జాగ్రత్తగా చూసుకోవాలి.

పరిహారం : ఉదయాన్నే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి బుధుడి అస్తమయం కాలంలో కుటుంబ జీవితంలో ఇబ్బందులు పెరగొచ్చు.. ఈ కాలంలో మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీ ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక పరంగా సమస్యలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి. మరోవైపు వ్యాపారులు ఈ కాలంలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు.

పరిహారం : ప్రతిరోజూ విష్ణుసహస్రనామం జపించాలి.

Lunar Eclipse May 2022 Astrology :ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వేళ ఈ రాశులకు చాలా కష్టాలు...!

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి బుధుడి అస్తమయం సమయంలో కుటుంబ విషయంలో అనేక సమస్యలు ఎదురుకావొచ్చు. వీటి గురించి ఆలోచించి మీరు చాలా ఇబ్బంది పడతారు. మరోవైపు ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్రమైన నష్టం రావొచ్చు. వ్యాపారులు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవాలి.

పరిహారం : మీరు హనుమాన్ చాలీసాను పఠించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి బుధుడి అస్తమయం సమయంలో అనవసరమైన ఖర్చులు పెరగొచ్చు. ఆరోగ్య పరంగా సమస్యలు ఎక్కువ కావొచ్చు. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మీ ఖర్చులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. డబ్బు విషయంలో ఎవ్వరినీ నమ్మకండి.

పరిహారం :మీరు శనివారం రోజున అనారోగ్యంతో ఉన్న వారికి ఆహారం ఇస్తే శుభ ఫలితాలొస్తాయి.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు దయచేసి మీరు వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించగలరు.

2022లో బుధుడు ఏ రాశిలోకి, ఎప్పుడు అస్తమయం చెందాడు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు 2022 సంవత్సరంలో మే 13వ తేదీన వృషభరాశిలో అస్తమించాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడనుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు పడనున్నాయట. ఆ రాశుల వ్యక్తులెవరో ఇప్పుడు తెలుసుకుందాం...

English summary

Mercury Combust in Taurus, These Zodiac Signs Will Be In Trouble

Here we are talking about the Mercury combust in Taurus, these zodiac signs will be in Trouble. Have a look
Story first published: Saturday, May 14, 2022, 10:39 [IST]
Desktop Bottom Promotion