For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధుడు మకరంలోకి సంచారం.. రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

2022 ఫిబ్రవరి 4న మకరరాశిలోకి బుధుడు సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలేంటో చూడండి.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటాడు. అందుకే బుధుడి అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. బుధుడిని తెలివితేటలు, సంపదకు కారకరంగా భావిస్తారు.

Mercury Direct In Capricorn February 2022 Effects on Zodiac Signs in Telugu

ఎవరి జాతకంలో అయితే బుధుడి ప్రభావం ఉంటుందో వారి జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతారు. ప్రస్తుతం బుధుడు తిరోగమన దిశలో ప్రయాణిస్తున్నాడు. అయితే త్వరలోనే తన దిశను మార్చుకోనున్నాడు. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగో తేదీన అంటే శుక్రవారం రోజున బుధుడు మకర రాశిలోకి సంచారం చేయనున్నాడు.

Mercury Direct In Capricorn February 2022 Effects on Zodiac Signs in Telugu

ఈ సమయంలో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా బుధుడి సంచారం వల్ల ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ఏయే రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

February Horoscope 2022: ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు.. మీ రాశి కూడా ఉందేమో చూడండి...February Horoscope 2022: ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి శుభ ఫలితాలు.. మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి..

మేష రాశి..

బుధుడు మకరంలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు ఏదైనా పెట్టుబడికి సంబంధించి ఏవైనా కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఏదైనా కొత్త వెంచర్ లేదా ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీకు సరైన ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, ఫలితాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మీరు మీ పై అధికారులతో మంచి సంబంధాలను కొనసాగించగలుగుతారు. మీరు ఎక్కువ డబ్బును ఆదా చేయగలుగుతారు. ఈ కాలంలో వ్యాపారులు లాభాలు పొందుతారు. మిమ్మల్ని ఫిట్ గా ఉంచుకునేందుకు ధ్యానం లేదా యోగా సాధన చేయండి.

పరిహారం : బుధవారం రోజున ఉపవాసం ఉండాలి. అలాగే ప్రతిరోజూ 41 సార్లు ‘ఓం నమో నారాయణః' అని జపించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

బుధుడి మకరంలోకి సంచారం సమయంలో ఈ రాశి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మీకు పదోన్నతి లభించొచ్చు. ఈ కాలంలో మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అయితే మీరు మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : విష్ణుసహస్రనామాన్ని పఠిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో చాలా విషయాల్లో సానుకూల ఫలితాలొస్తాయి. మీరు కొత్త ప్రాజెక్టులు మరియు డీల్స్ ను పొందుతారు. దీంతో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక ధోరణిని కలిగి ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ కాలంలో మంచి ట్రిప్ ప్లాన్ చేయొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో కూడా మంచి సమయాన్ని గడుపుతారు.

పరిహారం : బుధవారం రోజున బాలాజీ గుడికి వెళ్లి పాలు, దానం చేయొచ్చు.

February Vrat And Festival List 2022: మాఘ మాసంలో ముఖ్య పండుగలు, వ్రతాలెప్పుడొచ్చాయో చూడండి...February Vrat And Festival List 2022: మాఘ మాసంలో ముఖ్య పండుగలు, వ్రతాలెప్పుడొచ్చాయో చూడండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని అడ్డంకులు ఎదురుకావొచ్చు. మీ ప్రియమైన వారితో అపార్థాలను క్లియర్ చేయడానికి మీరు విజయవంతంగా కమ్యూనికేట్ చేయగలరు. మీరు చాలా పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. మీరు ఈ సమయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

పరిహారం : నరసింహ స్వామిని తాజా పువ్వులతో ఆరాధించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

బుధుడు మకరరాశిలోకి సంచారం చేసే సమయంలో ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. మీరు పదోన్నతి పొందే బలమైన అవకాశం ఉంది. మీరు ఆఫీసులో సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఈ కాలంలో వ్యాపారులకు మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ 41 సార్లు ‘ఓం నమో నారాయణః' అనే మంత్రాన్ని జపించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో మిశ్రమ పలితాలను పొందుతారు. వ్యాపారులు కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయం మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇది మీకు ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు ఒత్తిడికి గురవుతారు. ఈ కాలంలో మీరు స్నేహితుల నుండి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారం : ఈ కాలంలో మీరు విష్ణువును పూజించొచ్చు. ప్రతిరోజూ 41 సార్లు ‘ఓం నమో నారాయణ' అని జపించాలి.

వాస్తు రీత్యా ఈ అలవాట్లను వెంటనే మానేయండి... లేదంటే పేదరికం పట్టి పీడిస్తుంది...వాస్తు రీత్యా ఈ అలవాట్లను వెంటనే మానేయండి... లేదంటే పేదరికం పట్టి పీడిస్తుంది...

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో సంతోషంగా మరియు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అవసరమైన సమయాల్లో మీ స్నేహితులు మీకు సహకరిస్తారు. ఉద్యోగులు ఈ కాలంలో పురోగతి సాధించొచ్చు. అదే సమయంలో మీరు ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు. మీరు శారీరకంగా బలంగా ఉంటారు. మీరు సానుకూల శక్తితో చుట్టుముట్టారు. వ్యాపారులు ఈరోజు లాభపడతారు.

పరిహారం : మీరు ప్రతిరోజూ 41 సార్లు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

మీరు ఈ కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో మీకు ఎలాంటి ఉపశమనం లభించదు. ఉద్యోగులు కెరీర్ పరంగా ఎంత కష్టపడి పని చేసినప్పటికీ, విజయం సాధించలేరు. వ్యాపారులు ఆశించిన మేరకు ఫలితాలను పొందలేరు. ఈ పరిస్థితిలో మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా ఈరోజు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పరిహారం : ఈ కాలంలో మీరు పేద విద్యార్థులకు పుస్తకాలను విరాళంగా ఇవ్వొచ్చు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో సానుకూల ఫలితాలను పొందుతారు. కెరీర్ పరంగా ఎదిగేందుకు ఈ సమయం మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, మీకు చాలా అవకాశాలు ఉంటాయి. మీరు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో కూడా మంచి సంబంధాలను కలిగి ఉంటారు. వ్యాపారులకు లాభదాయకమైన సమయం కాబట్టి.. మీరు కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. మీ తోబుట్టువులు మీకు మద్దతు ఇస్తారు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే ‘ఓం నమో నారాయణః' అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

ఇదే రాశిలోకి బుధుడు సంచారం చేయడం వల్ల ఈ రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు లోన్ ద్వారా డబ్బును పొందాలని ఆలోచిస్తున్నట్లయితే, దాన్ని బాగా ఉపయోగించుకోవాలి. మీరు ఈ కాలంలో పొదుపు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగులు ఆఫీసులో ప్రమోషన్ పొందొచ్చు. మీరు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ఫిట్ గా ఉండేందుకు ఆహారంపై శ్రద్ధ వహించాలి.

పరిహారం : మీరు నారాయణ మంత్రాన్ని పఠించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ కాలంలో మీరు మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. మీ మార్గంలో చాలా అడ్డంకులు రావొచ్చు. ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. మరోవైపు మీకు విదేశాల నుండి కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా ఈ కాలంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. మరోవైపు మీరు చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : బుధవారం రోజున విష్ణుమూర్తికి నూనె దీపం వెలిగించి పూజ చేయాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ కాలంలో మీరు మీ విశ్వాసాన్ని కోల్పోవచ్చు. ఈ కాలంలో మీరు విజయం సాధించడానికి కొంత సమయం పట్టొచ్చు. మీరు మీ నైపుణ్యాలను సమర్థవంతంగా ఉపయోగించలేరు. ఉద్యోగులు ఈ కాలంలో తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. లేదంటే పై అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులు ఈ కాలంలో నష్టాలను ఎదుర్కోవచ్చు. మీ కొత్త వెంచర్లు లేదా ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టకపోవడమే మంచిది. మీ ఆదాయం పరిమితంగా ఉంటుంది. మీరు మరిన్ని ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారం : బుధవారం రోజున వికలాంగులకు సహాయం చేయాలి మరియు ఎవరికైనా ఆహారం దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

FAQ's
  • 2022లో బుధుడు ఏ రాశిలోకి ఎప్పుడు సంచారం చేయనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2022 సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగో తేదీన అంటే శుక్రవారం నాడు బుధుడు ధనస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది.కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.

English summary

Mercury Direct In Capricorn February 2022 Effects on Zodiac Signs in Telugu

Mercury Direct February 2022 in Makar Rashi; Mercury Direct In Capricorn Effects on Zodiac Signs in telugu: The Mercury Direct In Capricorn will take place on 04 February 2022. Learn about remedies to perform in Telugu
Story first published:Thursday, February 3, 2022, 12:30 [IST]
Desktop Bottom Promotion