Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
బుధుడి తిరోగమనం వల్ల 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావమంటే..!
మిధునంలోకి బుధుడు తిరోగమనం చేసే సమయంలో రాశి చక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాలేంటో తెలుసుకోండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఎవరి జాతకంలో అయితే బుధుడి అనుగ్రహం ఉంటుందో.. వారికి వ్యాపారం, ఉద్యోగంతో పాటు ఇతర రంగాల్లో మెరుగ్గా రాణించడానికి తోడ్పాటుగా ఉంటుందని పండితులు చెబుతారు.

ఈ నేపథ్యంలో బుధుడు 2021లో మే 26వ తేదీన ఉదయం 7:59 గంటల నుండి మిధున రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఇక్కడే జూన్ మూడో తేదీ వరకు సంచారం చేయనున్నాడు. అదే సమయంలో మే 30వ తేదీన తెల్లవారుజామున 4:10 గంటలకు తిరోగమనం చెందనున్నాడు.

జూన్ మూడో తేదీన మధ్యాహ్నం 2:12 గంటలకు వృషభరాశిలోకి తిరోగమన స్థితిలో చేరనున్నాడు. ఇక్కడే 23వ తేదీ మధ్యాహ్నం 3:34 గంటలకు సంచారం చేయనున్నాడు. మరోవైపు సెప్టెంబర్ 27వ వతేదీ వరకు ఇక్కడే ఉండనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం వల్ల ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతారు. మీరు ఎంత కష్టపడినా, ఫలితం నిరాశాజనకంగానే ఉంటుంది. మీ ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సమయంలో బుధుడి అనుగ్రహం కోసం మీరు హనుమాన్ చాలీసాను పఠించాలి.

వృషభ రాశి..
బుధుడు తిరోగమనం చెందే సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు ఏదైనా గాయమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ధ్యానం లేదా యోగా చేయాలి. అది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరోవైపు స్నేహితులతో ఈ సమయం మంచిగా గడుపుతారు. మీ ప్రేమ జీవితంలో కూడా అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ శివుని మంత్రం, దుర్గా మంత్రాన్ని జపించాలి.

మిధున రాశి..
ఈ రాశి వారు బుధుడి తిరోగమనం సమయంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ నిర్లక్ష్యం కారణంగా జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్ లేదా కళ్లకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు మంచి ప్రణాళిక నిమిత్తం పని చేయాలి. వ్యాపారులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మంచి ఫలితాల కోసం మీ కులదైవాన్ని ఆరాధించాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం సమయంలో కొన్ని చర్మ సమస్యలు ఉండొచ్చు. మీరు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. మీ కెరీర్ కొంత గందరగోళంలో పడొచ్చు. మీ నిర్ణయాలు తొందరపాటులో తీసుకోకండి. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుభఫలితాల కోసం శివ మంత్రం లేదా శివ స్తోత్రాలను పఠించాలి.

సింహ రాశి..
ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మీకు వెన్నునొప్పి లేదా కీళ్లనొప్పులు వస్తుంటాయి. మీ కెరీర్ కు సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ సమయంలో మీ సీనియర్ల సహాయం తీసుకోవాలి. పని విషయంలో ఈరోజు ఓపికగా ఉండాలి. ప్రతిరోజూ విష్ణు మంత్రాన్ని జపించడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలుంటే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా ముందుకు సాగాలి. విద్యార్థులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు సానుకూల వార్తలు వినొచ్చు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ విష్ణు మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలను పొందుతారు.

తుల రాశి..
ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు మానసికంగా ఒత్తిడిని అధిగమించడానికి యోగా మరియు ధ్యానం చేయాలి. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు పెరగొచ్చు. మరోవైపు ఉద్యోగులకు ఈ కాలంలో మంచిగా ఉంటుంది. మీరు హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ పని రంగంలో మీకు నిరాశ ఎదురవుతుంది. మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మీ కెరీర్ గురించి అయోమయం చెందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ సమస్యల పరిష్కారానికి, గణేష్ మంత్రం జపించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారిలో విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఈ సమయంలో మీరు పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. మీ తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగులకు ఈ కాలంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు దత్తాత్రేయ మంత్రం లేదా గురు మంత్రం లేదా సోత్త్రం జపించడం వల్ల ఫలప్రదంగా ఉంటుందది.

మకర రాశి..
ఈ రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఈ కాలంలో మీకు ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. ఉద్యోగులు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వినొచ్చు. వ్యాపారులకు ఈ సమయంలో మంచిగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సానుకూలంగా ఉంటుంది. మీరు హనుమాన్ చాలీసా లేదా శివ మంత్రాన్ని ప్రతిరోజూ జపించాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు బుధుడి తిరోగమనం సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కెరీర్ ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశం లభిస్తుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు ఈరోజు మంచి ప్రణాళిక కలిగి ఉండాలి. మీ వైవాహిక జీవితంలో పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు హనుమాన్ చాలీసా లేదా మ్రుత్యంజయ మంత్రాన్ని జపించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు. ఈ కాలంలో మీరు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త వ్యాపార ప్రణాళిక చేయొచ్చు. ఉద్యోగులు ఈరోజు శుభవార్త పొందొచ్చు. మీరు విష్ణు మంత్రం జపించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications