For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధుడు మకరంలోకి తిరోగమనం.. 12 రాశులపై పడే ప్రభావం.. పాటించాల్సిన పరిహారాలివే...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధ గ్రహం అతి చిన్నది. బుధ గ్రహం 2022లో జనవరి 14వ తేదీన మకరరాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఇదే రాశిలో ఫిబ్రవరి 4వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.

ఈ కాలంలో చాలా మంది జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. బుధుడు మకరంలోకి తిరోగమనం కారణంగా ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడనుంది..ఏయే రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.. ద్వాదశ రాశుల వారు ఏయే పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Makar Sankranti 2022 Horoscope:మకరంలోకి సూర్యుడి రవాణా.. 12 రాశులపై పడే ప్రభావం...!

మేష రాశి..

మేష రాశి..

ఈ కాలంలో ఈ రాశి వారికి పనిభారం పెరుగుతుంది. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే సమయం ఇది. ఉద్యోగులు ఈ సమయంలో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తవచ్చు. మీ కెరీర్ మరియు వ్యక్తిగత సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి.

పరిహారం : ఈ కాలంలో ఏదైనా స్థలంలో బియ్యం, పాలు సమర్పించవచ్చు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీరు విదేశాల నుండి కొన్ని అవకాశాలను పొందొచ్చు. మీ ఆరోగ్యం క్షీణించొచ్చు. కాబట్టి కొన్ని వైద్యఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు.

పరిహారం : బుధవారం రోజున ఏదైనా ఆలయంలో ఆకుపచ్చని దుస్తులు లేదా స్వీట్లను సమర్పించొచ్చు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ఆలోచనలు చేస్తారు. ఏదైనా పత్రాలపై సంతకం చేయడానికి ఇది సరైన సమయం కాదు. మీ వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.

పరిహారం : మట్టికుండలో తేనేను నింపి ఏకాంత ప్రదేశంలో పాతిపెట్టండి.

2022 Yearly Rasi Phalalu : కొత్త ఏడాదిలో ఈ రాశుల వారు అద్భుత విజయాలు సాధిస్తారట...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ కాలంలో ఏదైనా సమస్యను పరిష్కరించడానికి ఇదే ఉత్తమ సమయం. మీరు మీ కార్యాలయంలో లేదా జీవిత భాగస్వామి నుండి కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుంది. వ్యాపారస్తులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు ఎలాంటి ఒప్పందంపై సంతకం చేయకుండా ఉండాలి.

పరిహారం : ప్రతి బుధవారం ఆవులకు పచ్చి గడ్డిని తినిపించండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ కాలంలో మీరు కొన్ని చట్టపరమైన విషయాల్లో చిక్కుకోవచ్చు. ఈ సమయంలో కొంత గందరగోళంగా ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. మీరు ఓపికతో ముందుకు సాగండి. ఆరోగ్య పరంగా ఈరోజు చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి మీ ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించాలి.

పరిహారం : ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు, పువ్వులను సిద్ధంగా ఉంచుకోండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ సమయంలో విద్యార్థులకు కొంత ఆందోళనగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ పిల్లల మాటలను జాగ్రత్తగా వినాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్లాన్ చేసుకునే వారికి విద్యపై ఏకాగ్రత కుదరడం కష్టమవుతుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.

పరిహారం : ఆవుకు ఏదైనా ఆహారం తినిపిస్తే, మంచి ఫలితాలొస్తాయి.

2022లో పురుషులు ఎలా ఉండబోతున్నారో తెలుసా? ఈ 4 రాశుల వారికి రాజయోగం రాబోతుంది....!

తుల రాశి..

తుల రాశి..

ఈ కాలంలో మీరు చాలా బిజీగా ఉండొచ్చు. మీ పనిని ప్రారంభించడానికి మీరు పరిశోధన చేయాలి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. మీ తల్లిదండ్రులకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. మీరు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగొచ్చు.

పరిహారం : మీరు మానసిక ప్రశాంతత కోసం వెండి గొలుసు ధరించాలి. సంపద కోసం బంగారు గొలుసు ధరించొచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ కాలంలో మీరు కొన్ని కారణాల వల్ల ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు మీ సోదరులు మరియు సోదరీమణులకు సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఈ కాలంలో మీరు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి పని చేస్తారు.

పరిహారం : మీరు పక్షులకు ఆహారం ఇవ్వొచ్చు. వీలైతే మేకను దానం చేయొచ్చు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త పనిలో పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకోవచ్చు. అయితే నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. లేదంటే మీరు ఆర్థిక పరంగా నష్టపోవాల్సి రావొచ్చు. మీరు అపొహలు మానుకోవాలి. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్లయితే, సకాలంలో తిరిగి ఇవ్వండి.

పరిహారం : ఈ కాలంలో గుడ్లు, మాంసం, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ కాలంలో మీరు మీ పనులపై ఫోకస్ పెట్టాలి. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి. మీరు ప్రశాంతంగా మరియు ఓపికగా ఉండాలి. మీరు మీ ప్రణాళికలను తనిఖీ చేయడానికి తగినంత సమయం తీసుకోవాలి. ఈ సమయం మీ వ్యక్తిత్వం గురించి ఆలోచించకుండా మీకు సహాయం చేస్తుంది.

పరిహారం : బుధవారం రోజున ఆకుపచ్చని రంగు దుస్తులు ధరించండి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ కాలంలో మీరు వ్యాపార సంబంధిత ప్రయాణాలు చేయొచ్చు. మీరు మంచి లాభాన్ని పొందుతారు. మీరు కొత్త ఆలోచనలను అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మొద్దు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : మీరు ప్రతిరోజూ 108 సార్లు బుధ మంత్రాన్ని జపించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితిలో కొంత క్షీణత ఉండొచ్చు. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు నష్టపోవాల్సి రావొచ్చు. విద్యార్థులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనవచ్చు.

పరిహారం : మీరు ధ్యానం మరియు యోగాను ఆశ్రయించాలి.

2022లో బుధుడు మకరంలోకి ఎప్పుడు తిరోగమనం చెందనున్నాడు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం 2022లో జనవరి 14వ తేదీన మకరరాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఇదే రాశిలో ఫిబ్రవరి 4వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఈ కాలంలో చాలా మంది జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి.

English summary

Mercury Retrograde in Capricorn On 14 January 2022 Effects on Zodiac Signs in Telugu

Budh Vakri 2022 in Makara Rashi: Mercury Retrograde in Capricorn Effects on Zodiac Signs in Telugu: The Mercury Retrograde in Capricorn will take place on 14 January 2022. Learn about remedies to perform in Telugu
Story first published: Thursday, January 13, 2022, 15:03 [IST]
Desktop Bottom Promotion