For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mercury Retrograde in Taurus : బుధుడి తిరోగమనంతో ఈ రాశులకు ఇబ్బందులు.. మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు..

2022లో మే 10వ తేదీన బుధుడు వృషభంలోకి తిరోగమనం చేసే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం, రాశుల వారు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

|

సౌర వ్యవస్థలో బుధుడిని అతి చిన్న గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అయితే బుధుడిని దేవ దూత అంటారు. ఇది సూర్యునికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం.

Mercury Retrograde in Taurus on 10th May 2022, Effects and Remedies on 12 Zodiac Signs in Telugu

ఎవరి జాతకంలో అయితే బుధుడి అనుగ్రహం ఉంటుందో వారికి సంపద, మేధస్సు, శ్రేయస్సు వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఇలా ఎంతో విశిష్టత కలిగిన బుధుడు త్వరలో తన స్థానాన్ని మారబోతున్నాడు.

Mercury Retrograde in Taurus on 10th May 2022, Effects and Remedies on 12 Zodiac Signs in Telugu

2022 సంవత్సరంలో మే నెలలో 10వ తేదీన అంటే మంగళవారం రోజున వృషభ రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఇదే రాశిలో జూన్ 3వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఇలా బుధుడు వృషభ రాశిలో తిరోగమనం చెందడం వల్ల ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏయే రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట..Vastu Tips for Wallet:మీ పర్సులో ఇవి ఉంటే వెంటనే పడేయండి... ఎందుకంటే డబ్బు సమస్యలు పెరుగుతాయట..

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం వల్ల శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీ నైపుణ్యాలను పెంచుకుంటారు. పరిస్థితులను త్వరగా అర్థం చేసుకుంటారు. అయితే మీ తోబుట్టువులతో కొంత సమస్య ఉండొచ్చు. మరోవైపు వ్యాపారులు ఏదైనా కొత్త దాంట్లో పెట్టుబడి పెడితే నష్టపోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు తమ సహోద్యోగుల నుండి సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. బ్యాంకులో పని చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : మీ ఇంటి పెద్దలను గౌరవించండి మరియు వారికి బహుమతులు ఇవ్వండి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి ఇది అనుకూలమైన సమయం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు విజయం సాధిస్తారు. మీ ఖర్చులను తెలివిగా చేయండి. అప్పుడే మీరు ఎక్కువ డబ్బు ఆదా చేయగలుగుతారు. ఈ సమయంలో మీరు చాలా చురుగ్గా ఉంటారు. అయితే ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

పరిహారం : బుధవారం అమ్మాయిలకు ఆకుపచ్చని వస్త్రాలు, గాజులు దానం చేయాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి బుధుడి తిరోగమనం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా ఈ కాలంలో నిద్రలేమితో బాధపడొచ్చు. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లయితే, మీరు దాని నుండి ఉపశమనం పొందొచ్చు. ఈ సమయంలో ఎలక్ట్రికల్ పరికరాలను జాగ్రత్తగా వాడాలి. ఈ కాలంలో పనికి సంబంధించిన ప్రయాణం చేయొచ్చు.

పరిహారం : పచ్చి పప్పును రాగి పాత్రలో నింపి ఏకాంత ప్రదేశంలో పాతి పెట్టాలి.

ఈ 5 రాశుల భర్తలు అత్యంత నమ్మకంగా ఉంటారు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...ఈ 5 రాశుల భర్తలు అత్యంత నమ్మకంగా ఉంటారు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

బుధుడి తిరోగమనం సమయంలో ఇంట్లోని కుటుంబ సభ్యులతో మనస్పర్దలు రావొచ్చు. ఆర్థిక పరంగా మాత్రం కొంత శుభప్రదంగా ఉంటుది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంది. మీకు కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మీరు విదేశీ మార్కెట్లో పని చేస్తున్నట్లయితే, మీ వ్యాపారం మరియు లావాదేవీలలో కొంత పెరుగుదల ఉంటుంది.

పరిహారం : సంపదను ఆకర్షించేందుకు వెండి గొలుసుతో కూడిన బంగారు లాకెట్ ను ధరించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఏదైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు మీ ఇంటి వాతావరణం ఈ కాలంలో ప్రభావితమవుతుందది. మీకు మరియు మీ కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఉండొచ్చు. మీరు పాత వాహనాలను కొనుగోలు చేయొచ్చు.

పరిహారం : ఈ కాలంలో ఆవులకు పచ్చి మేత తినిపిస్తే శుభ ఫలితాలొస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ కాలంలో మీరు కష్టపడి పని చేయాలి. ఉద్యోగులు యజమానితో మంచి సంబంధాలను కొనసాగించాలి. వ్యాపారులకు పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వారితో మీ రిలేషన్ ను బలోపేతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టాలి. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు.

పరిహారం : మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం తులసి చెట్టును నాటి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

ఈ 4 రాశుల మగాళ్లు మగువలను మహారాణిలా చూసుకుంటారట...!ఈ 4 రాశుల మగాళ్లు మగువలను మహారాణిలా చూసుకుంటారట...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల మీకు మంచి ఫలితాలొస్తాయి. ఉద్యోగులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అలర్జీలు, ఒత్తిడి మరియు ఆందోళనతో బాధపడొచ్చు. మీకు ప్రయోజనం కలిగించని విషయాలపై టైమ్ వేస్ట్ చేయొద్దు. పరిశోధనలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : మీ సామర్థ్యం మేరకు పిల్లలకు స్టేషనరీ మరియు మందులను దానం చేయొచ్చు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో సంబంధంలో అడ్డంకులు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అవివాహితులు తమ జీవిత భాగస్వామిని కనుగొనవచ్చు. వ్యాపారులు తమ భాగస్వాములతో కలిసి పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఎవరికీ అప్పుడు ఇవ్వకండి.

పరిహారం : మీరు బుధవారం గ్రీన్ కలర్ డ్రస్సులను ధరించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ఆరోగ్య సమస్యలతో బాధపడొచ్చు. మీ దీర్ఘకాలిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీకు వివాహమై, మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే, మీరు ఓపికగా ఉండాలి. మీరు కోపం తెచ్చుకుంటే మీ పరిస్థితి మరింత దిగజారుతుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ వనరులను ఉపయోగిస్తారు.

పరిహారం : మీ సంబంధంలో శాంతి మరియు సంతోషం కోసం మీరు ఆలయానికి వచ్చి పప్పు దానం చేయాలి.

మకర రాశి..

మకర రాశి..

బుధుడి తిరోగమనం సమయంలో ఈ రాశి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు అన్ని అడ్డంకులను సమర్థంగా అధిగమిస్తారు. మీ పిల్లల అనారోగ్య సమస్యల గురించి ఆందోళన చెందుతారు. మీరు విదేశీ కళాశాలల్లో అడ్మిషన్ కోసం ప్లాన్ చేస్తుంటే, శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం దుర్గా సప్తశతి పారాయణం చేయాలి. అలాగే దుర్గామాతను పూజించాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

బుధుడి తిరోగమనం సమయంలో ఈ రాశి వారి ఇంటి వాతావరణం బాగుంటుంది. మీ కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ సమస్యలు ఉంటాయి. ఈ కాలంలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కొన్ని పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం 108 సార్లు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ కాలంలో మీరు మీ తోబుట్టువులతో చిన్న ట్రిప్ కు వెళ్లొచ్చు. మీడియా రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో మంచిగా రాణిస్తారు. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి పరిష్కరించుకోవాలి. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారానికి సంబంధించి బోల్డ్ స్కై తెలుగు ఎలాంటి హామీ ఇవ్వదని పాఠకులు గుర్తుంచుకోవాలి. మీరు ఈ సమాచారాన్ని, ఊహలను పరిగణనలోకి తీసుకునే ముందు మీ వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుడిని సంప్రదించగలరు.

FAQ's
  • 2022లో బుధుడు ఏ రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు?

    2022 సంవత్సరంలో మే నెలలో 10వ తేదీన అంటే మంగళవారం రోజున వృషభ రాశిలోకి తిరోగమనం చెందనున్నాడు. ఇదే రాశిలో జూన్ 3వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఇలా బుధుడు వృషభ రాశిలో తిరోగమనం చెందడం వల్ల ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏయే రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

English summary

Mercury Retrograde in Taurus on 10th May 2022, Effects and Remedies on 12 Zodiac Signs in Telugu

Mercury Retrograde in Taurus May 2022 Effects on Zodiac Signs in Telugu: The Mercury Retrograde in Taurus will take place on 10th may 2022. Learn about remedies to perform in Telugu.
Story first published:Saturday, May 7, 2022, 11:03 [IST]
Desktop Bottom Promotion