Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
అరుదైన భద్రరాజయోగం.. 2023లో ఈ రాశుల వారిపై లక్ష్మీ కటాక్షం, డబ్బుకు లోటుండదు
భద్ర రాజయోగం ప్రభావం అన్ని రాశుల వారిలోనూ ఉంటుంది. బుధుడు సృష్టించిన భద్ర రాజయోగ ప్రభావం వల్ల 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023 ప్రారంభంలోనే అనేక గ్రహాలు సంచరిస్తున్నాయి. అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. గ్రహాలు రాశిచక్ర గుర్తులను మారుస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు తిరోగమనం చెందుతాయి. గ్రహాల సంచార ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తులపై, భూమిపై ఉంటుంది. బుధగ్రహం సంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడనుంది. డిసెంబర్ 31వ తేదీన బుధుుడు ధనుస్సు రాశిలోకి తిరోగమనంలో సంచరించనున్నాడు. సంవత్సరం ప్రారంభంలో బుధుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన మకరరాశిలోకి, ఫిబ్రవరి 27న కుంభరాశిలోకి, మార్చి 16న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు.

భద్ర రాజయోగం ప్రభావం అన్ని రాశుల వారిలోనూ ఉంటుంది. బుధుడు సృష్టించిన భద్ర రాజయోగ ప్రభావం వల్ల 5 రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయంలో వారు మంచి లాభాలు పొందుతారు. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్య రాశి
భద్ర రాజయోగం ఏర్పడటం కన్యరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాశి నుండి 8వ ఇంట్లో బుధుడు సంచరించనున్నాడు. ఈ సమయంలో కన్యరాశి వారి నుండి అప్పులు తీసుకున్న వారు తిరిగి చెల్లిస్తారు. ఈ సమయంలో కన్యరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. లక్ష్మీ కటాక్షం ఉండటం వల్ల లాభాలు వస్తాయి. కన్యరాశి వారు భద్ర రాజయోగం సమయంలో ఆర్థికంగా చాలా కలిసివస్తుంది. కుటుంబసభ్యులు, ముఖ్యంగా తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి.

మిథునరాశి
మిథునరాశి వారికి భద్ర రాజయోగం చాలా కలిసి వస్తుంది. ఈ సంచారం మిథునరాశి వారి జాతకంలో 7వ ఇంట్లో ఏర్పడబోతోంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. భద్ర రాజయోగం సమయంలో మిథునరాశి వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. భాగస్వామ్య పనులు చేసే వారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. ఒంటరిగా ఉన్న వారికి ఈ సమయంలో మంచి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి భద్ర రాజయోగం లాభదాయకం కానుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి పెండింగ్ పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. మీరు పని మరియు వ్యాపారానికి సంబంధించిన విహార యాత్రకు వెళ్లవలసి వస్తుంది. ఈ ప్రయాణం ధనుస్సు రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. షేర్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు పొందుతారి. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇప్పటికే ఉన్న వ్యాపారాలు కూడా లాభాల బాటలో సాగుతాయి.

మేష రాశి
భద్ర రాజయోగం వల్ల మేష రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. భద్రరాజ యోగం ఏర్పడటం వల్ల మేష రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారైనా, వ్యాపారం చేస్తున్న వారైనా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంటారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు తమ ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. భద్ర రాజయోగం సమయంలో చేసే ఏ పనిలో అయినా మేషరాశి వారు విజయం సాధిస్తారు. అలాగే సానుకూల ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి
వృషభ రాశి వారికి భద్ర రాజయోగం చాలా అనుకూలంగా ఉండనుంది. వృషభ రాశి నుండి 8వ ఇంట్లో ఈ యోగం ఏర్పడనుంది. ఆరోగ్య సమస్యలతో బాధ పడే వారు ఈ సమయంలో వాటి నుండి కోలుకుంటారు. పరిశోధన రంగంలో ఉన్న వృషభ రాశి వారికి చాలా కలిసిరానుంది. వృషభ రాశి వారు ఈ సమయంలో ఆస్తుల కొనుగోలు చేస్తారు. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లేదా మరోచోట మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయం వృషభ రాశి వారికి చాలా కలిసి వస్తుంది. ఆచితూచి అడుగులు వేస్తూ పోతే లాభాలు వచ్చి పడతాయి.



Click it and Unblock the Notifications