Budh Rashi Parivartan 2022:కుంభంలోకి బుధుడి సంచారం.. ఈ రాశులకు అదృష్టం.. మీ రాశి ఉందేమో చూడండి...

2022లో మార్చి 6న కుంభంలోకి బుధుడు ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అతి చిన్న గ్రహంగా బుధుడిని పరిగణిస్తారు. ఈ గ్రహం కమ్యూనికేషన్, తెలివితేటలు, సంపద, శక్తికి ప్రతీకగా భావిస్తారు.

Budh Rashi Parivartan 2022 Mercury Transit in Aquarius On 6 March Effects on Zodiac Signs in Telugu

ఎవరి జాతకంలో అయితే బుధుని అనుగ్రహం ఉంటుందో, వారికి అనేక ప్రయోజనాలు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు. మరోవైపు బుధ గ్రహం అనుగ్రహం లేకపోతే ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయట.

Budh Rashi Parivartan 2022 Mercury Transit in Aquarius On 6 March Effects on Zodiac Signs in Telugu

ఈ నేపథ్యంలో 2022లో మార్చి 6వ తేదీన అంటే ఆదివారం నాడు బుధుడు మకరం నుండి కుంభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సమయంలో ఏయే రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి.. ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి బుధుడి రవాణా కారణంగా అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి పని చేస్తే ఆశించిన ఫలితం దక్కుతుంది. మీ అభిప్రాయానికి అందరూ గౌరవం ఇస్తారు. వ్యాపారులు ఈ కాలంలో కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులతో మీ సంబంధాలు కూడా పెరుగుతాయి. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

పరిహారం : బుధవారం వినాయకుడిని పూజించి, లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

బుధుడు కుంభంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులు సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార్లు కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. అంతేకాదు మీరు మంచి లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ ఇంటి వాతావరణం బాగుంటుంది.

పరిహారం : ఈ కాలంలో మీరు విష్ణువును పూజించాలి. దశావతార కథలను చదవాలి.

మిధున రాశి..

మిధున రాశి..

బుధుడి రవాణా కారణంగా ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందొచ్చు. మీరు కష్టానికి తగిన ఫలాలను అనుభవిస్తారు. వ్యాపారంలో ఉన్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కొత్త ప్రణాళికలు మరియు వ్యూహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీ స్నేహితుల సర్కిల్ పెరుగుతుంది.

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలికి బంగారం ఉంగరంలో పచ్చని ధరించాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

బుధుడి సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురుకావొచ్చు. ఈ కాలంలో ఉద్యోగులు కార్యాలయంలో పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మిమ్మల్ని దొంగ దెబ్బ తీయొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు మీరు ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తిని పెంచుకుంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలను పొందుతారు.

పరిహారం : ఒక తులసి చెట్టును నాటి.. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

సింహ రాశి..

సింహ రాశి..

బుధుడి రవాణా సమయంలో ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వ్యాపారులకు ఆశించిన ఫలాలు దక్కుతాయి. ఉద్యోగులు ఈ కాలంలో బదిలీకి సంబంధించిన ప్రణాళికలను రూపొందించుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ ప్రేమ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో బయటకు వెళ్లి వారితో నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు. మీరు వారితో ట్రిప్ ప్లాన్ చేస్తారు.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం ‘‘గజేంద్ర మోక్ష స్తోత్రం'' పఠిస్తే శుభ ఫలితాలొస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు. ఈ సమయంలో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. బ్యాంకింగ్, ఖాతాలు లేదా వ్యాజ్యానికి సంబంధించిన వ్యక్తులకు ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో ఉద్యోగం మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది సరైన సమయం కాదు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : బుధవారం రోజున పచ్చని దుస్తులను ధరించి దానం చేయాలి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో నైపుణ్యాలను పెంచుకోవడానికి అవకాశం పొందుతారు. ముఖ్యంగా మీడియా, థియేటర్ లేదా జర్నలిజంతో అనుబంధం ఉండేవారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనే అభిరుచి కారణంగా, మీరు సహోద్యోగుల నుండి ప్రశంసలను పొందుతారు. మీరు తీవ్రమైన సమస్యలను పరిష్కారం కనుగొంటారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : బుధవారం రోజున అమ్మాయిలకు పచ్చని కంకణాలు దానం చేయాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ కాలంలో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కోరుకున్న చోటకు బదిలీలు పొందొచ్చు. ఈ సమయంలో మీకు కుటుంబ మద్దతు లభిస్తుంది. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది సరైన సమయం.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం ‘విష్ణు సహస్రనామం'పారాయణ చేయాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు బుధుడి సంచారం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ ను బాగా పెంచుకుంటారు. మీరు చాలా మంది కస్టమర్లను ఆకర్షిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు మీ తోబుట్టువులు లేదా సహోద్యోగులతో చిన్న చిన్న ప్రయాణాలను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. వివాహం చేసుకున్న వారు రిలేషన్ షిప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : బుధవారం రోజున పచ్చని వస్త్రాన్ని కుడిచేతికి ధరించాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకోవచ్చు. మీ నైపుణ్యాల కారణంగా వ్యాపారం మీవైపు తిప్పుకుంటారు. మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి ఆకస్మికంగా ఆర్థిక లాభాలొస్తాయి.

పరిహారం : బుధవారం రోజున ఏదైనా ఆలయంలో పచ్చి పప్పును దానం చేయాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

బుధుడు ఇదే రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారు ఈ కాలంలో ప్రతికూల ఫలితాలను పొందుతారు. మీ కెరీర్ పరంగా రిస్క్ తీసుకోవడం వంటివి చేయకండి. మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులు మీ పనిని అభినందిస్తారు. రొమాంటిక్ రిలేషన్ షిప్ విషయంలో మీకు మంచి విజయం లభిస్తుంది. వివాహితులు మంచి అవగాహన కోసం మరింత కమ్యూనికేట్ చేయాలి.

పరిహారం : బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డిని తినిపించాలి.

మీన రాశి..

మీన రాశి..

బుధుడి సంచారం కారణంగా ఈ రాశి వారిలో ఉద్యోగులకు అనుకూల ఫలితాలు రావొచ్చు. మీకు వేతనం పెరుగుదల గురించి శుభవార్తలు వినిపించొచ్చు. వ్యాపారులకు ఈ కాలంలో కొంత లాభం చేకూరుతుంది. మీరు మీ భాగస్వామికి దూరంగా ఉండొచ్చు. ఈ సమయంలో మీరు కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టొచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ ఉదయం 108 సార్లు బుధ మంత్రాన్ని జపించాలి.

గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహాలు, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అందించింది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. మీరు వీటిని పరిగణనలోకి తీసుకునే ముందు వ్యక్తిగత జ్యోతిష్యనిపుణుని సంప్రదించగలరు.

FAQs
2022లో బుధుడు ఏ రాశిలోకి, ఎప్పుడు సంచరించనున్నాడు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అతి చిన్న గ్రహంగా బుధుడిని పరిగణిస్తారు. ఈ గ్రహం కమ్యూనికేషన్, తెలివితేటలు, సంపద, శక్తికి ప్రతీకగా భావిస్తారు. ఎవరి జాతకంలో అయితే బుధుని అనుగ్రహం ఉంటుందో, వారికి అనేక ప్రయోజనాలు దక్కుతాయని చాలా మంది నమ్ముతారు. మరోవైపు బుధ గ్రహం అనుగ్రహం లేకపోతే ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయట. ఈ నేపథ్యంలో 2022లో మార్చి 6వ తేదీన అంటే ఆదివారం నాడు బుధుడు మకరం నుండి కుంభ రాశిలోకి సంచారం చేయనున్నాడు.

BoldSky Lifestyle

Story first published: Saturday, March 5, 2022, 15:49 [IST]
Desktop Bottom Promotion