For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Budh Gochar 2022:మేషంలోకి బుధుడి ఎంట్రీ..ఈ రాశులకు శుభ ఫలితాలు...! మీ రాశి ఉందేమో చూడండి...

2022లో ఏప్రిల్ నెలలో బుధ రాశి మేషరాశిలోకి పరివర్తనం చెందడం వల్ల రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని తెలివికి, వ్యాపారం, విజ్ణానశాస్త్రం వంటి వాటికి కారణమని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతుంటారు.

Budh Rashi Parivartan 2022, Mercury Transit in Aries On 08 April Effects on Zodiac signs in Telugu

ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన అంటే శుక్రవారం రోజున బుధుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే రాశిలో ఏప్రిల్ 25వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు.

Budh Rashi Parivartan 2022, Mercury Transit in Aries On 08 April Effects on Zodiac signs in Telugu

ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది... ఇలాంటి సమయంలో రాశిచక్రాలు బుధుడి స్థితిని బలోపేతం చేయడానికి ఏమి చేయాలి.. ఎలాంటి పరిహారాలు పాటించాలి.. ఏయే రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Mangal Gochar April 2022 : ఏప్రిల్ నెలలో కుంభంలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!Mangal Gochar April 2022 : ఏప్రిల్ నెలలో కుంభంలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశిలోకి బుధుడి సంచారం జరిగే సమయంలో శుభ ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించొద్దు. వ్యాపారులలో కొత్త వెంబచర్లలో పెట్టుబుడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే, మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీ ప్రియమైన వారి నుండి మీకు సరైన మద్దతు లభించదు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

పరిహారం : మీరు ప్రతిరోజూ బుధ మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల లాభం కలుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలొస్తాయి. మీ కెరీర్ పరంగా మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టొచ్చు. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడాలంటే జంక్ ఫుడ్ దూరంగా ఉండాలి.

పరిహారం : కొత్త బట్టలు ధరించే ముందు వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు బుధుడి సంచారం కారణంగా మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు కొత్త వనరుల నుండి డబ్బు సంపాదించే అవకాశాన్ని పొందుతారు. మీ వ్యక్తిగత జీవితంలో, మీరు కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈ సమయంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారం : మీరు ఏదైనా ఆలయానికి వెళ్లి బియ్యం మరియు పాలు దానం చేయాలి.

April Horoscope 2022: ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి కష్టాలు.. తస్మాత్ జాగ్రత్త..!April Horoscope 2022: ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి కష్టాలు.. తస్మాత్ జాగ్రత్త..!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ కాలంలో ఈ రాశి వారిలో ఉద్యోగులకు బదిలీ కావొచ్చు. మీరు మీ పనిని శ్రద్ధగా చేసుకోవాలి. వ్యాపారులు కొన్ని లాభాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఖర్చు చేయాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కొంత ఇబ్బంది పెట్టొచ్చు.

పరిహారం : మీరు మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి.

సింహ రాశి..

సింహ రాశి..

బుధుడి సంచారం కారణంగా, ఈ రాశి వారు పనిలో బాగా రాణిస్తారు. మీ పనులన పూర్తి చేసేందుకు రిస్క్ తీసుకుంటారు. ప్రతిఫలంగా మీరు విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా స్థిరంగా ఉంటారు. మీరు ఎక్కువ డబ్బు ఆదా చేయగలరు. మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే మీరు ఫిట్ గా ఉండేందుకు, మంచి డైట్ ప్లాన్ ను అనుసరించాలి.

పరిహారం : ఆహారం తినే ముందు ఆవుకు మేత తినిపించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

బుధుడు మేషంలోకి సంచారం సమయంలో ఈ రాశి వారికి కొన్ని పనులు జరగవు. మీ కెరీరర్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. మీ పనిలో కొన్ని అడ్డంకులు రావొచ్చు. ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేరు. అయితే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు మీ తండ్రి ఆరోగ్యంపై నిఘా ఉంచాలి, అలాగే, మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

పరిహారం : వెండి గ్లాసులో నీరు తాగితే మీకు ప్రయోజనకర ఫలితాలొస్తాయి.

ఈ రాశుల వారు మానసిక వ్యాధిగ్రస్తులు మరియు సీరియల్ కిల్లర్ కావచ్చు... జాగ్రత్త...!ఈ రాశుల వారు మానసిక వ్యాధిగ్రస్తులు మరియు సీరియల్ కిల్లర్ కావచ్చు... జాగ్రత్త...!

తుల రాశి..

తుల రాశి..

బుధుడు మేషంలోకి సంచారం చేసే సమయంలో వ్యాపారులకు శుభ ఫలితాలొస్తాయి. ఈ సమయం మీకు చాలా బాగుంటుంది. విదేశాల్లో కొత్త ఉద్యోగావకాశాలు కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి. మరోవైపు మీరు కొన్ని ఆకస్మిక ఖర్చులను చేయాల్సి వస్తుంది. మీరు డబ్బు సంపాదించేందుకు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

పరిహారం : బుధవారం గ్రీన్ కలర్ డ్రస్సులు వేసుకోండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

బుధుడు మేషంలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి కెరీర్ పరంగా కొంత గందరగోళంగా ఉంటుంది. మీరు ఎలాంటి గొడవలకు దిగకండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీకు మద్దతు ఇస్తారు. మరోవైపు ఆరోగ్య పరంగా కొన్ని చర్మ సమస్యలు ఉండొచ్చు. మీరు అలర్జీల బారిన పడొచ్చు. మీరు మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

పరిహారం : మీ కుటుంబ సభ్యులను గౌరవించండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

బుధుడు మేష రాశిలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలొస్తాయి. మీరు సకాలంలో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త వెంచర్లలో పెట్టుబడులు పెట్టొచ్చు. మీ పిల్లలు విద్యలో బాగా రాణిస్తారు. మీరు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. అయితే అందుకు సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.

పరిహారం :బుధవారం రోజున ఉపవాసం ఉండాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారిలో ఉద్యోగులు బుధుడి రవాణా కారణంగా కార్యాలయంలో మంచి గుర్తింపు పొందుతారు. మీ పనికి ప్రశంసలు అందుతాయి. మీరు మీ కుటుంబం మరియు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని పంచుకుంటారు. ఈ సమయంలో మీరు కొన్ని ఆస్తి సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో మీకు జలుబు, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.

పరిహారం : బుధవారం నాడు పచ్చిగడ్డి, వెన్నెముక లేదా పాలకూర దానం చేయాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

బుధుడు సంచారం చేసే ఈ కాలంలో మీరు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించడం ముఖ్యం. మీరు సమాజంలో ప్రతిష్టను పొందగలుగుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అది భవిష్యత్తులో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ కాలంలో మీరు ఆరోగ్యంగా ఉంటారు.

పరిహారం : మీరు ప్రతిరోజూ బుధ మంత్రాన్ని జపించాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ కాలంలో వ్యాపారులు బాగా లాభపడతారు. మీరు కుటుంబ సభ్యులతో కూడా నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరగొచ్చు. మీరు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి మీరు ఈ సమయంలో సరైన పరిశుభ్రతను పాటించాలి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు.

పరిహారం : నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్షలను ధరిస్తే శుభ ఫలితాలొస్తాయి.

గమనిక : ఈ సమాచారం అంతర్జాలంలో అందుబాటులో ఉన్న ఊహాలపై ఆధారపడి ఉంది. ఈ కథనానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునేముందు లేదా ఈ పరిహారాలను పాటించడానికి ముందు దయచేసి సంబంధిత వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు.

FAQ's
  • 2022లో మేష రాశిలోకి బుధుడి సంచారం ఎప్పుడు జరగనుంది?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని తెలివికి, వ్యాపారం, విజ్ణానశాస్త్రం వంటి వాటికి కారణమని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 8వ తేదీన అంటే శుక్రవారం రోజున బుధుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే రాశిలో ఏప్రిల్ 25వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది...

English summary

Budh Rashi Parivartan 2022, Mercury Transit in Aries On 08 April Effects on Zodiac signs in Telugu

Budh Rashi Parivartan April 2022 in Mesha Rashi; Mercury Transit in Aries Effects on Zodiac Signs in telugu : The Mercury Transit in Aries will take place on 08 april 2022. Learn about remedies to perform in Telugu
Story first published:Thursday, April 7, 2022, 16:37 [IST]
Desktop Bottom Promotion