For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mercury Transit in Aries on 16 April:మేషంలోకి బుధుడి సంచారం వల్ల.. ఈ 3 రాశులకు అద్భుత ప్రయోజనాలు..!

బుధుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం, పరిహారాల గురించి తెలుసుకుందాం.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలలో బుధ గ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. బుధుని అనుగ్రహం ఉంటే, ప్రతి ఒక్కరి తెలివితేటలు, వ్యాపారంతో పాటు మరిన్ని బాగా మెరుగవుతాయని పండితులు చెబుతుంటారు.

Mercury Transit in Aries on 16 April 2021 Effects on Zodiac Signs in Telugu

అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న బుధుడు 2021లో ఏప్రిల్ 16వ తేదీన రాత్రి 8:45 గంటలకు మీన రాశి నుండి మేషరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో మే 01వ తేదీన ఉదయం 5 గంటల 39 నిమిషాల వరకు ఉంటారు.

Mercury Transit in Aries on 16 April 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ సందర్భంగా ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ఏ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది.. ఏ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది.. ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...

Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...Mars Transit in Gemini on 14 April: మిధునంలోకి కుజుడి ఎంట్రీతో.. ఎవరికి ప్రయోజనం.. ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశిలోకి బుధుడు రవాణా చేయడం వల్ల, మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు వివాదాలకు దూరంగా ఉండాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

మేషరాశిలోకి బుధుడి ప్రవేశంతో.. ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. మీరు వివాదాలు మరియు తగాదాలకు చాలా దూరంగా ఉండాలి. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను తగ్గించుకోవాలి. మరోవైపు విదేశీ ప్రయత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలొస్తాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రయాణించే వారు ప్రయోజనం పొందుతారు. విద్యార్థులకు విద్య విషయంలో అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి బుధుడి రవాణా వల్ల ఆర్థిక పరగా అనుకూలంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. మీరు ఊహించిన డబ్బును తిరిగి పొందుతారు. మీ ప్రసంగ నైపుణ్యాలు మరియు సున్నితమైన స్వభావం సహాయంతో క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కొంటారు. ఆరోగ్య పరంగా ఏవైనా సమస్యలు ఉండొచ్చు. అలాంటి సమయంలో స్నేహితులు, బంధువుల సహాయం తీసుకోవాలి.

Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి బుధుడి పరివర్తనం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు వ్యాపారం పెరుగుతుంది. మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్నేహితులు, బంధువుల నుండి శుభవార్తను వింటారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సంబంధాలు మంచిగా కొనసాగుతాయి.

సింహ రాశి..

సింహ రాశి..

బుధుడు మేషరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారిపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు కోరుకున్న బదిలీలను సాధించొచ్చు. విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాలనుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. పిల్లల వైపు నుండి మీకు చాలా విషయాల్లో ఉపశమనం లభిస్తుంది.

కన్య రాశి..

కన్య రాశి..

మేషరాశిలోకి బుధుడు రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. మీకు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు పెరుగుతాయి. ఈ కాలంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు విద్యార్థులు విద్య విషయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి ఏడో పాదం గుండా బుధుడు రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. సింగిల్ గా ఉండే వారికి వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ప్రేమ సంబంధిత విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీరు ప్రేమ వివాహం గురించి ఆలోచిస్తుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు వ్యాపారులకు ఈ కాలంలో మంచిగా ఉంటుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి ఆరో స్థానం గుండా బుధుడు సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు రహస్య శత్రువులు మరియు స్నేహితుల పట్ల జాగ్రత్త వహించాలి. మరోవైపు కొన్ని ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విదేశీ సంస్థలలో పని చేసే వారి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి ఐదో పాదం నుండి బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే.. అధ్యయనాల విషయంలో మరింత కష్టపడాలి. ప్రేమికులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి నాలుగో స్థానం గుండా బుధుడు తన స్థానాన్ని మారనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. మీ భూమి, ఆస్తికి సంబంధించిన విషయాల్లో బంధువులు, స్నేహితుల సహకారంతో అవి పరిష్కరించబడతాయి. మీరు ఇల్లు లేదా వాహనాన్ని కొనాలనుకుంటే, సమయం ఇప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంటుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి మూడో పాదం గుండా బుధుడు రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో కుంభ రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. మీరు క్లిష్ట పరిస్థితులను సులభంగా ఎదుర్కొంటారు. మీరు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రశంసలు లభిస్తాయి. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే మీరు కుటుంబసభ్యులు మరియు సోదరుల మధ్య విభేదాలు పెరగకుండా చూసుకోవాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి బుధుడు నిష్క్రమించడం వల్ల ఈ రాశి వారిపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఈ సమయంలో మీకు ఆకస్మికంగా డబ్బు పెరుగుతుంది. మీరు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ సమయం వ్యాపారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు పొరుగువారితో సంబంధాలు కూడా బలపడతాయి. మరోవైపు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు విజయం సాధించే అవకాశం ఉంది.

English summary

Mercury Transit in Aries on 16 April 2021 Effects on Zodiac Signs in Telugu

Here we are talking about the mercuy transit in aries on 16 april 2021 effects on zodiac signs in telugu. Read on
Desktop Bottom Promotion