For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mercury Transit in Cancer:కర్కాటకంలో సూర్యుడు, బుధుడు చేరితే.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో బుధుడిని యువరాజుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయినా బుధుడి అనుగ్రహం ఉంటేనే.. జ్ణానం, మేధస్సు, వ్యాపారం, సంపద మొదలైన కారకమైన గ్రహంగా పరిగణిస్తారు.

ఈ నెల ప్రారంభ సమయంలోనే బుధుడు మిధున రాశిలోకి ప్రవేశించాడు. జులై 25వ తేదీన మరోసారి తన స్థానాన్ని మారనున్నాడు. ఇప్పుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఆగస్టు 9వ తేదీ వరకు బుధుడు కర్కాటక రాశిలో నివాసం ఉండనున్నాడు. అనంతరం సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదిలా ఉండగా.. గ్రహాల అధిపతిగా భావించే సూర్యుడు ఇప్పటికే ఈ రాశిలోనే నివాసం ఉంటున్నాడు. దీంతో కర్కాటక రాశిలో సూర్యుడి, బుధుడి కలయిక జరగనుంది. నవగ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం ఉన్నందున.. ఈ గ్రహం సంచారం వల్ల ద్వాదశ రాశిచక్రాలపై ప్రభావం పడనుంది. ఈ సందర్భంగా బుధుడి రవాణా ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Mercury Transit in Cancer:కర్కాటకంలోకి బుధుడి సంచారంతో.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు...!Mercury Transit in Cancer:కర్కాటకంలోకి బుధుడి సంచారంతో.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు...!

మేష రాశి..

మేష రాశి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కర్కాటక రాశిలోకి బుధుడి ఆగమనం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఇంట్లో ఉండే ఇబ్బందులను అధిగమిస్తారు. మీ కుటుంబం మీకు అండగా నిలబడుతుంది. మరోవైపు విద్యార్థులకు కూడా ఈ కాలంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీ ఆదాయం మంచిగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో ఉద్యోగులు కార్యాలయంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరొచ్చు. అంతేకాకుండా మీ సామాజిక పరిధి కూడా పెరుగుతుంది. దీంతో సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. పెద్దలతో పరిచయాలు కూడా పెరుగుతాయి. మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యాపారంలోనూ మీరు మంచి లాభాలను అందుకుంటారు.

మిధున రాశి..

మిధున రాశి..

బుధుడు కర్కాటకంలోకి ఆగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీరు మీ సామర్థ్యంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. మీ వైవాహిక జీవితంలో అద్బుతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మరోవైపు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే.. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

Guru Purnima 2021: గురు పూర్ణిమ రోజున ఈ 5 రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. ఈ పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు...!Guru Purnima 2021: గురు పూర్ణిమ రోజున ఈ 5 రాశుల వారిపై తీవ్ర ప్రభావం.. ఈ పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలు...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

బుధుడు ఈ రాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలొస్తాయి. ఈ సమయంలో ఉద్యోగులు అనేక ప్రయోజనాలను పొందుతారు. మీకు మంచి గౌరవం కూడా లభిస్తుంది. మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. ఈ కాలంలో మీరు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

సింహ రాశి..

సింహ రాశి..

కర్కాటక రాశిలోకి బుధుడి రవాణా వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలు ఎదురవుతాయి. మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మీరు డబ్బును ఆదా చేయడంలో విఫలమవుతారు. ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. ఈ కాలంలో మీ ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉంటారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు బుధుడి స్థానం మార్పు వల్ల మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుండి మంచి సహకారం లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి. ఈ సమయంలో మీరు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకోవాలి. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం లభిస్తుంది. మీరు మీ పిల్లల నుండి కూడా ఆనందం పొందుతారు.

Guru Purnima 2021:గురు పూర్ణిమ రోజున ఏ రాశి వారు ఏ మంత్రం పఠించాలో చూసెయ్యండి...!Guru Purnima 2021:గురు పూర్ణిమ రోజున ఏ రాశి వారు ఏ మంత్రం పఠించాలో చూసెయ్యండి...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు బుధుడి రవాణా సమయంలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ కాలంలో మీరు కొత్త వాహనాలను కొనేందుకు ప్లాన్ చేస్తారు. మీరు ఏదైనా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. అంతేకాదు వాటి నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగులు కార్యాలయంలో జరిగే రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీ రిలేటివ్స్ తో సంబంధాలను మెరుగుపరచుకోవాలి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి వారికి బుధుడి ప్రయాణం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయి. మీరు ఊహించిన డబ్బు మీకు అందుతుంది. మీకు పూర్వీకుల ఆస్తి నుండి కూడా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. మీ జీవితం పట్ల మీ వైఖరి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరే ఏదైనా విషయంలో పరిశోధన చేస్తే.. అందులో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అద్బుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ సమయంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఈ సమయంలో మీకు వ్యక్తిగతంగా ఊహించిన ఫలితాలు రావొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. మీ కుటుంబ జీవితంలో కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుది. మీరు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ సమయంలో మీ ఆదాయం కూడా మంచిగా ఉంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి బుధుడి స్థానం మార్పు వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామితో పోరాటాలు మరియు సమస్యలు పెరగొచ్చు. మరోవైపు పెళ్లికాని వారి సమస్యలు ఈ సమయంలో ముగియవచ్చు.

కుంభరాశి..

కుంభరాశి..

బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు ఉండొచ్చు. ఉద్యోగంలో ట్రాన్స్ ఫర్ ఆశించే వారికి శుభవార్తలు వినిపించొచ్చు. మరోవైపు విద్యార్థులు అధ్యయనాలలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..

మీన రాశి..

బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. మీకు ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీకు ప్రభుత్వ పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మీరు మీ పూర్వీకుల నుండి ఆస్తికి సంబంధించి మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి డబ్బులను ఖర్చు చేస్తారు. ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణంలో శాంతి వాతావరణం ఉంటుంది. మీకు ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది.

English summary

Mercury Transit in Cancer On 25 July 2021 Effects on Zodiac Signs in Telugu

Mercury Transit in Cancer Effects on Zodiac Signs in Telugu: The Mercury Transit in Cancer will take place on 25 July 2021. Learn about remedies to perform in Telugu
Story first published: Saturday, July 24, 2021, 16:32 [IST]