Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
Mercury Transit in Cancer:కర్కాటకంలోకి బుధుడి సంచారంతో.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనాలు...!
2021లో కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి చక్రాలకు అద్భుతమైన ప్రయోజనాలుంటాయట. ఆ రాశులేవో చూసెయ్యండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో బుధుడిని యువరాజుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయినా బుధుడి అనుగ్రహం ఉంటేనే.. జ్ణానం, మేధస్సు, వ్యాపారం, సంపద మొదలైన కారకమైన గ్రహంగా పరిగణిస్తారు.

ఈ నెల ప్రారంభ సమయంలోనే బుధుడు మిధున రాశిలోకి ప్రవేశించాడు. జులై 25వ తేదీన మరోసారి తన స్థానాన్ని మారనున్నాడు. ఇప్పుడు మిధున రాశి నుండి కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఆగస్టు 9వ తేదీ వరకు బుధుడు కర్కాటక రాశిలో నివాసం ఉండనున్నాడు. అనంతరం సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదిలా ఉండగా.. గ్రహాల అధిపతిగా భావించే సూర్యుడు ఇప్పటికే ఈ రాశిలోనే నివాసం ఉంటున్నాడు. దీంతో కర్కాటక రాశిలో సూర్యుడి, బుధుడి కలయిక జరగనుంది. నవగ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం ఉన్నందున.. ఈ గ్రహం సంచారం వల్ల ద్వాదశ రాశిచక్రాలపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ఆ రాశులల మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కర్కాటక రాశిలోకి బుధుడి ఆగమనం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ ఇంట్లో ఉండే ఇబ్బందులను అధిగమిస్తారు. మీ కుటుంబం మీకు అండగా నిలబడుతుంది. మరోవైపు విద్యార్థులకు కూడా ఈ కాలంలో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీ ఆదాయం మంచిగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో ఉద్యోగులు కార్యాలయంలో మంచి ప్రయోజనాలను పొందుతారు. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరొచ్చు. అంతేకాకుండా మీ సామాజిక పరిధి కూడా పెరుగుతుంది. దీంతో సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. పెద్దలతో పరిచయాలు కూడా పెరుగుతాయి. మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యాపారంలోనూ మీరు మంచి లాభాలను అందుకుంటారు.

మిధున రాశి..
బుధుడు కర్కాటకంలోకి ఆగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మీరు మీ సామర్థ్యంతో ఆదాయాన్ని పెంచుకుంటారు. మీ వైవాహిక జీవితంలో అద్బుతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. మరోవైపు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే.. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది.

ధనస్సు రాశి..
కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అద్బుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ సమయంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఈ సమయంలో మీకు వ్యక్తిగతంగా ఊహించిన ఫలితాలు రావొచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. మీ కుటుంబ జీవితంలో కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుది. మీరు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. ఈ సమయంలో మీ ఆదాయం కూడా మంచిగా ఉంటుంది. మీకు స్నేహితుల మద్దతు లభిస్తుంది.

మీన రాశి..
బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వ్యాపారులకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ప్రభుత్వం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీకు ప్రభుత్వ పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. మీరు మీ పూర్వీకుల నుండి ఆస్తికి సంబంధించి మంచి ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి డబ్బులను ఖర్చు చేస్తారు. ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణంలో శాంతి వాతావరణం ఉంటుంది. మీకు ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications