Mercury Transit in Gemini On 07 July 2021: జులై 7న బుధుడు మిధునంలో ఎంట్రీ.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

మిధునంలోకి బుధుడి సంచారం వల్ల ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలలో బుధ గ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. బుధుడిని గ్రహాలలో రారాజుగా భావిస్తారు. బుధుని అనుగ్రహం ఉంటే, ప్రతి ఒక్కరి తెలివితేటలు, వ్యాపారంతో పాటు మరిన్ని బాగా మెరుగవుతాయని పండితులు చెబుతుంటారు.

Mercury Transit in Gemini On 07 July 2021 Effects on Zodiac Signs in Telugu

అంతటి గొప్ప ప్రాముఖ్యత ఉన్న బుధుడు 2021లో జులై 7వ తేదీ ఉదయం 11.59 గంటలకు వృషభరాశి నుండి మిధునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇక్కడే జులై 25వ తేదీ ఉదయం 11:31 గంటల వరకు ఉండనున్నాడు.

Mercury Transit in Gemini On 07 July 2021 Effects on Zodiac Signs in Telugu

అనంతరం కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ప్రస్తుతం కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బుధుడి ప్రయాణం వల్ల ద్వాదశ రాశిచక్రాలపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏ రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలొస్తాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలొస్తాయి. ఏయే పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

బుధుడు మిధునరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు ఈ సమయంలో కార్యాలయంలో కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఏ పని అయినా చాలా జాగ్రత్తగా చేయండి. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు పదాలను జాగ్రత్తగా వాడాలి.

పరిహారం : బుధవారం రోజున ‘విష్ణు సహస్రనామం' పఠిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

వృషభ రాశి..

వృషభ రాశి..

బుధుడు మిధునంలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీ పెండింగ్ పనులు పూర్తి కావొచ్చు. ఉద్యోగులు ప్రమోషన్ సాధించొచ్చు. మీరు కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలవొచ్చు.

పరిహారం : బుధవారం రోజున గణేశుడిని ఆరాధించాలి.

మిధున రాశి..

మిధున రాశి..

బుధుడు ఈ రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి శుభప్రదంగా ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. మీ పనికి సంబంధించిన పర్యటనలు కూడా విజయవంతమవుతాయి. ఈ సమయంలో ఆర్థిక పరంగా మంచి లాభాలొస్తాయి. వ్యాపారులు కుటుంబ సభ్యుల సహాయంతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు.

పరిహారం : బుధవారం రోజున వినాయకుడికి లడ్డూ సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి బుధుడి రవాణా వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అయితే వ్యాపారులు మాత్రం డబ్బును కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో వివాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులు ఈరోజు ఆఫీసులో బాస్ కోపాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పరిహారం : బుధవారం రోజున దేవాలయాల్లో పచ్చని వస్తువులను దానం చేయాలి.

సింహ రాశి..

సింహ రాశి..

బుధుడి రవాణా సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో పెండింగ్ బిల్లులను కూడా చెల్లిస్తారు. ఈ సమయంలో నిపుణులకు మంచి ప్రోత్సాహాకాలు లభిస్తాయి. మీ ఆసక్తులు మరియు అభిరుచులు లేదా పార్ట్ టైమ్ పని చేయడం ద్వారా అదనపు ఆదాయం రావొచ్చు. మీరు ఈ కాలంలో కొత్త స్నేహితులను పొందుతారు. వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

పరిహారం : బుధవారం రోజున కూరగాయలను దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి బుధుడి ప్రయాణం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీరు పని విషయంలో మెరుగవుతారు. మీరు కొన్ని కొత్త కార్యక్రమాలను చేపడతారు. దీని వల్ల మీకు అద్భుతమైన ఫలితాలొస్తాయి. మార్కెటింగ్, జర్నలిజం, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి శుభ ఫలితాలొస్తాయి. అయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : మీరు పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకోవాలి.

తుల రాశి..

తుల రాశి..

బుధుడి రవాణా వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. మీ ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. మీరు కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేయొచ్చు. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ బాస్ మీ పనితో సంతోషంగా ఉంటారు. దీని వల్ల మీకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. మీరు ఆస్తి లేదా కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు.

పరిహారం : బుధవారం రోజున 108 సార్లు బుధమంత్రాన్ని జపించాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

బుధుడి మిధున రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఈ సమయంలో మంచి లాభాలు రావొచ్చు. తల్లిదండ్రులతో సహా మొత్తం మీ ఇంటి ఆరోగ్యం మంచిగా ఉంటుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

బుధుడు మిధున రాశిలోకి రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి ఊహించిన ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి గౌరవం లభిస్తుంది. మీరు కొత్తగా ఏదైనా పని చేయాలని చూస్తున్నట్లయితే, ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పని సంబంధిత లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాల నుండి డబ్బులు పొందొచ్చు. పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఏ అవకాశం వచ్చిన వాటిని వదులుకోకండి.

పరిహారం : పేదలకు ఈరోజు పచ్చని గాజులను దానం చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు బుధుడి రవాణా సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. లేదంటే మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ కాలంలో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు. కొత్త పనిని ప్రారంభించకపోవడం ఇంకా మంచిది. అయితే ఏదైనా కొత్త పని చేసే ముందు జ్యోతిష్యుడి సలహా తీసుకోవాలి. మీరు కోర్టు కేసులకు దూరంగా ఉండాలి.

పరిహారం : బుధవారం రోజున పచ్చని దుస్తులను అమ్మాయిలకు విరాళంగా ఇవ్వాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి బుధుడి ప్రయాణం వల్ల కొన్ని సమస్యలు రావొచ్చు. ముఖ్యంగా విద్యార్థులు అధ్యయనాల విషయంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. మరోవైపు ఆధ్యాత్మిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలలో విజయం సాధించడంలో మీకు మంచి పరిచయాలు వస్తాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : భగవద్గీతను ప్రతిరోజూ చదివితే ప్రయోజనం ఉంటుంది

మీన రాశి..

మీన రాశి..

బుధుడు మిధునంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీకు ఆర్థిక పరమైన కష్టాలు రావొచ్చు. మీరు ఏ పనినైనా చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు వాదనలకు చాలా దూరంగా ఉండాలి. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా పని చేయాలి.

పరిహారం : క్రిష్ణ లీలల కథలు వింటే మంచి ప్రయోజనం ఉంటుంది.

Story first published: Saturday, July 3, 2021, 10:42 [IST]
Desktop Bottom Promotion