Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Mercury Transit in Leo On 09 August 2021: బుధుడి రవాణా వల్ల ఈ 4 రాశులకు కష్టాలు...!
2021లో ఆగస్టు 9వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం.. వాటి పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడిని వివేకం, మేధస్సుకు ప్రతీకగా భావిస్తారు. బుధుడి ప్రభావం వల్ల మనుషులపై మానసికంగా ప్రభావం పడుతుంది.

అంతటి గొప్ప విశిష్టత కలిగిన బుధుడు ఆగస్టు తొమ్మిదో తేదీన అంటే సోమవారం రోజున తన స్థానాన్ని మారబోతున్నాడు. కర్కాటక రాశి నుండి సూర్యుని రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అనంతరం కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు.

సందర్భంగా ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏయే రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశి ప్రతికూలంగా ఉంటుంది.. బుధుడు అనుగ్రహం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ఈ రాశుల వారిని పెళ్ళి చేసుకోవడం మహా పాపం...

మేష రాశి..
ఈ రాశి వారు బుధుడి రవాణా కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతిష్ట పెరుగుతుంది మీకు కొంత ప్రభుత్వ సహాయం కూడా దక్కొచ్చు. మరోవైపు మీ వైవాహిక జీవితం కూడా మంచిగా ఉంటుంది. బుధుడి అనుగ్రహాన్ని పొందడానికి మీరు గోమాతకు సేవ చేయాలి.

వృషభ రాశి..
ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల ఆర్థిక పరమైన సమస్యలు తొలగిపోతాయి. మీరు కొత్త ఆదాయ వనరులను కూడా పొందుతారు. ఈ సమయంలో మీకు తల్లి మద్దతు లభిస్తుంది. భౌతికపరమైన సుఖాల కోసం మీరు కొంత డబ్బు ఖర్చు చేయొచ్చు. బుధుడి అనుగ్రహం పొందేందుకు మీరు ఒక కుంకుమపువ్వును ఒక డబ్బాలో వేసి మీ దగ్గరే ఉంచుకోండి. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మిధున రాశి..
బుధుడు సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మీ వైవాహిక జీవితంలో మీరు ఊహించిన ఫలితాలొస్తాయి. మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ రాశి వ్యాపారులు మరియు ఉద్యోగులు మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్య పరంగా కూడా మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీపై చెడు ప్రభావం పడకుండా మీరు ఉదయాన్నే పళ్లను శుభ్రం చేసుకోవాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి బుధుడి రవాణా వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. పిల్లలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులు ఈరోజు మరింత కష్టపడాల్సి ఉంటుంది. బుధుడి ప్రతికూల ప్రభావం తగ్గేంత వరకు. అంటే ఆగస్టు 26వ తేదీ వరకు వెండిని మీ దగ్గర ఉంచుకోండి.

సింహ రాశి..
ఈ రాశి వారికి బుధుడి రవాణా వల్ల కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. పిల్లల వైపు నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ వైవాహిక జీవితంలో తక్కువ సామరస్యం ఉంటుంది. ఈ కాలంలో మీరు ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి ఏదైనా దేవాలయానికి వెళ్లి ఆకుపచ్చ రంగు వస్తువులను దానం చేయండి.

కన్య రాశి..
ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలు వస్తాయి. మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఇలాంటి సానుకూలతను కాపాడుకోవడానికి మీరు మీ మెడలో పసుపు రంగు దారాన్ని ఆగస్టు 16వ తేదీ వరకు ధరించాలి. తర్వాత దాన్ని నీటిలో వదిలేయండి.

తల రాశి..
ఈ రాశి వారికి బుధుడి రవాణా వల్ల ఆర్థిక పరంగా నష్టాలు ఎదురుకావొచ్చు. అంతేకాదు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. దీని కారణంగా మీ బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ సమయంలో మీరు నిర్ణయాలను తెలివిగా తీసుకోవాలి. మీరు ప్రతికూల ఫలితాలను నివారించడానికి ఆగస్టు 16వ తేదీ వరకు మీ మెడలో రాగి బిల్లలను ధరించాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల కొన్ని విషయాల్లో ఉపశమనం కలుగుతుంది. మీకు కష్ట సమయంలో ఇతర వ్యక్తుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో మీ అసంపూర్తి పనులన్నీ పూర్తవుతాయి. ఈ కాలంలో మీరు దుర్గా మాతను ఆరాధించాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి బుధుడి రవాణా వల్ల ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయం ఆరోగ్య పరంగా అద్భుతంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు. మీరు కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంతో మీరు ఆనందంగా గడుపుతారు. ఈ సమయంలో మీరు సానుకూల ఫలితాలను పొందేందుకు ఆకుపచ్చ రంగు వస్తువులను మీ వద్ద ఉంచుకోవాలి.

మకర రాశి..
ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. కానీ మీరు కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కాంలో మీరు మీ తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బుధుడి ప్రతికూల ప్రభావాల నివారణకు మట్టి కుండలో పొడి చక్కెర వేసి దాన్ని మూసేసి.. ఏదైనా రహస్య ప్రదేశంలో పాతిపెట్టండి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి బుధుడి ప్రయాణం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు అత్తమామల నుండి ఆర్థిక సహాయం పొందొచ్చు. ఏదైనా కోర్టు కేసులో నిర్ణయం మీకు అనుకూలంగా రావొచ్చు. మీ జీవితంలో సానుకూలతను కాపాడుకోవడానికి ఆలయంలో ఏదైనా పచ్చి వస్తువులను దానం చేయండి.

మీన రాశి..
ఈ రాశి వారికి బుధుడి ప్రయాణం వల్ల పూర్తి సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో ఏదైనా శుభకార్యం ప్రారంభించే ముందు, ఆడపిల్లల దీవెనలు తీసుకోండి. వారి ఆశీర్వాదం వల్ల మీకు మంచి జరుగుతుంది.



Click it and Unblock the Notifications