Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
Mercury Transit 2021 August:సింహంలో బుధుడి సంచారం..ఈ రాశులకు అద్భుత ప్రయోజనం..ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి
సింహ రాశిలోకి బుధుడు ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడిని వివేకం, మేధస్సుకు ప్రతీకగా భావిస్తారు. బుధుడి ప్రభావం వల్ల మనుషులపై మానసికంగా ప్రభావం పడుతుంది.

అంతటి గొప్ప విశిష్టత కలిగిన బుధుడు ఆగస్టు తొమ్మిదో తేదీన అంటే సోమవారం రోజున మధ్యాహ్నం 1:23 గంటలకు కర్కాటక రాశి నుండి సూర్యుని రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఇదే రాశిలో ఆగస్టు 26వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు.

అనంతరం కన్య రాశిలోకి మారనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశులపై శుభ ఫలితాలు పడనున్నాయి. సింహ రాశిలోకి బుధుడి సంచారం వల్ల ఏయే రాశుల వారు ప్రత్యేక ప్రయోజనాలు పొందనున్నారు. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

కన్య రాశి..
బుధుడు సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు గొప్ప ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఊహించిన విధంగా ఫలితాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినిపిస్తాయి. వ్యాపారులకు ఆర్థిక పరంగా మంచి లాభాలొస్తాయి. మీ వైవాహిక జీవితంలో మీరు కోరుకున్న ఫలితాలొస్తాయి. మీ జీవిత భాగస్వామి మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారు. మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

తుల రాశి..
సింహ రాశిలోకి బుధుడి రవాణా వల్ల తుల రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లు మరియు సహోద్యోగుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. అదే సమయంలో మీకు చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ కాలంలో విలువైన సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ సభ్యుల మధ్య మంచి సామరస్యం ఉంటుంది.

కుంభ రాశి..
సూర్యుని సొంత రాశి అయిన సింహ రాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి గొప్పగా ఉంటుంది. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి సహకారం అందిస్తారు. మరోవైపు మీరు చేసే పనుల్లో మీరు ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి. వ్యాపారులు ఆర్థిక పరమైన లాభాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులుగా ఉండి కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఈ సమయం మంచి శుభవార్త వినిపిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొని ఉంటే తప్పకుండా మంచి విజయం సాధిస్తారు.



Click it and Unblock the Notifications