Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్‌తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే!
బుధుడు తులరాశిలోకి సంచారం.. 12 రాశిచక్రాలపై పడే ప్రభావం...
2021లో నవంబర్ 2వ తేదీన బుధుడు తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా రాశిచక్రాలపై పడే ప్రభావం, పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో బుధుడిని యువరాజుగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే బుధుడి అనుగ్రహం ఉంటుందో వారికి మేధస్సు, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఎక్కువగా లభిస్తాయని పండితులు చెబుతారు. అలాంటి బుధుడు 2021లో నవంబర్ 2వ తేదీన ఉదయం 9:50 గంటలకు కన్య రాశి నుండి నిష్క్రమించి తులరాశిలోకి ఆగమనం చేయనున్నాడు.

ఈ రాశిలో ఇప్పటికే సూర్యుడు మరియు అంగారకుడు నివాసం ఉంటున్నారు. బుధుడు ఇదే రాశిలో నవంబర్ 21వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత వృశ్చికరాశిలోకి రవాణా చేయనున్నాడు. ఇలా బుధుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు ద్వాదశ రాశిచక్రాలపై ప్రభావం పడుతుందట. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి.. ఏయే రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి సాధారణ ఫలితాలు వస్తాయి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారికి సకాలంలో పనులు పూర్తవుతాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. ఏ విషయంలో రాజీపడొద్దు.

వృషభ రాశి..
ఈ రాశి నుండి ఆరో పాదం నుండి బుధుడు సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. మీరు బాగా నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయొచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో నష్టపోవాల్సి రావొచ్చు. విద్యార్థులు మరియు పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులు మంచి ఫలితాలు కావాలంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీరు మీ శక్తిని పూర్తిగా వాడుకుంటే, మీరు తప్పక విజయం సాధిస్తారు.

మిధున రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. మీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందుతారు. మీ వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాలలో ఉదాసీనత తొలగిపోతుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి బుధుడు నాలుగో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు కుటుంబ కలహాలు మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల మీ మనసు కలత చెందుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు కోర్టుకు సంబంధించిన కేసుల్లో పరిష్కారం కొనుగొనవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. మీరు ఇల్లు లేదా వాహనం కొనాలని చూస్తున్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి..
ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. మీకు కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుందది. మీకు మతం మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీ కంపెనీలలో సేవ లేదా పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. మీ నిర్ణయాలు మరియు చర్యలు ప్రశంసించబడతాయి. మీ వ్యూహాలను గోప్యంగా ఉంచండి.

కన్య రాశి..
ఈ రాశి నుండి బుధుడు రెండో పాదం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈ కాలం బలంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు కూడా అందుతాయి. మీ సున్నితమైన స్వభావంతో క్లిష్ట పరిస్థితులను సులభంగా అధిగమిస్తారు. మీ ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. మీకు సీనియర్లు, కుటుంబ సభ్యుల నుండి సహకారం లభిస్తుంది.

తులా రాశి..
ఈ రాశిలో ఇప్పటికే సూర్యుడు మరియు అంగారకుడు నివాసం ఉంటున్నారు. ఇప్పుడు బుధుడు కూడా ఇదే రాశిలో చేరనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగులకు ప్రతికూలంగా ఉంటుంది. మీరు సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో టెండర్ వంటి వాటికి దరఖాస్తు చేసుకుంటే మంచి ఫలితాలు రావొచ్చు.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి బుధుడు పన్నెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఎక్కువ ఖర్చులు చేయాల్సి రావొచ్చు. ఈ కాలంలో డబ్బు ఎవరికీ ఎక్కువగా అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే డబ్బు సకాలంలో అందదు.. మరోవైపు విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు కావాలంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీ కోర్టు కేసులలో పరిష్కారానికి మీరే చొరవ తీసుకోవాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీ పని యొక్క పరిధి పెరుగుతుంది. ఉద్యోగులకు గౌరవం మరియు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీకు సీనియర్లు మరియు కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంటలకు పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీ ప్రేమ విషయాలలో ఉదాసీనత తొలగిపోతుంది.

మకర రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఉద్యోగులకు పదోన్నతులు, గౌరవం పెరుగుతాయి. మీరు కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఏదైనా టెండర్లు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ వివాహ సంబంధ చర్చలు కూడా సఫలమవుతాయి. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటారు. అనాధ శరణాలయాలకు కూడా ఉదారంగా విరాళాలు ఇస్తారు. విదేశీ కంపెనీలలో సేవ, పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మీన రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చర్మవ్యాధులు లేదా అలర్జీలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. సకాలంలో పనులు పూర్తి చేయాలి. మరోవైపు ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని పని చేస్తే, ఫలితం అనుకూలంగా వస్తుంది.
2021లో నవంబర్ 2వ తేదీన ఉదయం 9:50 గంటలకు కన్య రాశి నుండి నిష్క్రమించి తులరాశిలోకి ఆగమనం చేయనున్నాడు. ఈ రాశిలో ఇప్పటికే సూర్యుడు మరియు అంగారకుడు నివాసం ఉంటున్నారు. బుధుడు ఇదే రాశిలో నవంబర్ 21వ తేదీ వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత వృశ్చికరాశిలోకి రవాణా చేయనున్నాడు.



Click it and Unblock the Notifications











