For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mercury Transit in Libra on 22 September 2021:తుల రాశిలోకి బుధుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

2021 సంవత్సరంలో సెప్టెంబర్ 22న తులరాశిలోకి బుధుడు సంచారం చేసే సమయంలో ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే..

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో బుధ గ్రహానికి ప్రత్యేక స్థానముంది. ఈ గ్రహాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. బుధుడి అనుగ్రహం ఉన్న వారికి మేధస్సు, శక్తి సామర్థ్యాలు ఎక్కువగా లభిస్తాయని పండితులు చెబుతారు.

Mercury Transit in Libra On 22 September 2021 Effects on Zodiac Signs in Telugu

అలాంటి బుధుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రభావం రాశిచక్రాల వారి తెలివితేటలు, జ్ణానంపై కచ్చితంగా ప్రభావం పడుతుందట. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తేదీన బుధుడు కన్య రాశి నుండి తులరాశిలోకి సంచారం చేయనున్నాడు.

Mercury Transit in Libra On 22 September 2021 Effects on Zodiac Signs in Telugu

ఈ రాశిలో ఇది వరకే శుక్రుడు నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు బుధుడు కూడా ఇక్కడకు చేరుకోవడం వల్ల శుక్రుడు, బుధుడి కలయిక ఈ రాశిలో జరగనుంది. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారిలో కొన్ని రాశుల వారిపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Numerology: బర్త్ డేను బట్టి మీ పర్సనాలిటీ గురించి ఎలా తెలుసుకోవచ్చంటే...!Numerology: బర్త్ డేను బట్టి మీ పర్సనాలిటీ గురించి ఎలా తెలుసుకోవచ్చంటే...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఏడో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో వ్యాపారులకు అద్భుతమైన ప్రయోజనాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఉద్యోగులకు కూడా వారి కెరీర్లో ఉన్నత స్థానాలకు వెళ్లేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ కాలంలో మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలు రావొచ్చు. మీరు కొత్త స్కిల్స్ ను సైతం నేర్చుకుంటారు.

వృషభరాశి..

వృషభరాశి..

ఈ రాశి నుండి బుధుడు ఆరో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని ప్రతికూల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు మీపై ఆధిపత్యం చేసేందుకు.. మీకు కొంత హాని తలపెట్టొచ్చు. ఈ కాలంలో కోర్టు కేసుల్లో చిక్కుకున్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఐదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మిధున రాశి వారికి ప్రత్యేక ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు ఈ కాలంలో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తారు. అంతేకాదు వాటిని ఆచరణలో పెట్టి సక్సెస్ కూడా సాధిస్తారు. ఉద్యోగులు ఆఫీసులో తమ సీనియర్ ఆఫీసర్ల నుండి పనికి సంబంధించి ప్రశంసలను అందుకుంటారు. ఈ కాలంలో మీకు గౌరవం, మర్యాదలు లభిస్తాయి.

Mercury Transit in Libra on 22 September 2021:తులరాశిలో బుధుడి సంచారం.. ఈ రాశులకు ప్రయోజనం...!Mercury Transit in Libra on 22 September 2021:తులరాశిలో బుధుడి సంచారం.. ఈ రాశులకు ప్రయోజనం...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి బుధుడు నాలుగో పాదం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీరు మీ పరిస్థితులను సంపూర్ణంగా పూర్తి చేస్తారు. మరోవైపు ఈ కాలంలో మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా కొత్త ఆస్తి లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తుంటే.. ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే మీ సామాజిక స్థాయి దెబ్బ తింటుంది. సమాజంలో మీకు గౌరవం కూడా తగ్గుతుంది. మీకు బుధుడి అనుగ్రహం కావాలంటే.. మీరు బుధవారం రోజున పచ్చిగడ్డి మేతగా వేస్తే శుభఫలితాలను పొందుతారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి బుధుడు రెండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మరోవైపు కుటుంబ సభ్యులతో వ్యాపారం చేస్తున్న వారికి లాభాలొచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయ, మీడియా సంబంధిత రంగాల్లో ఉండే వారికి ఈ కాలంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు.

Mercury Transit in Libra on 22 September 2021:తులరాశిలో బుధుడి ఎంట్రీ.. ఈ రాశుల వారు జరభద్రం...!Mercury Transit in Libra on 22 September 2021:తులరాశిలో బుధుడి ఎంట్రీ.. ఈ రాశుల వారు జరభద్రం...!

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశిలోకే బుధుడు ఆగమనం చేయడం వల్ల ఈ రాశి వారికి శుభ ప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగులు ఊహించిన విధంగా ఫలితాలొస్తాయి. మీరు పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. మరోవైపు వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఇంకోవైపు ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఈ రాశి వారికి శుభవార్తలు వినిపిస్తాయి. మీ నైపుణ్యం, జ్ణాపకశక్తిని చూసి చాలా మంది మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఈ సమయంలో మీరు ఏ వ్యాపారం చేసినా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి బుధుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ఆర్థిక పరమైన సమస్యలు ఎదురుకావొచ్చు. మీరు డబ్బుకు సంబంధించిన విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు భాగస్వాములపై కొంచెం ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే మీరు లాభం స్థానంలో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి బుధుడు పదకొండో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి అన్నింటా విజయం దక్కుతుంది. మీరు అకస్మాత్తుగా మంచి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగులకు ఆఫీసులో ఊహించిన ప్రమోషన్లు రావొచ్చు. లేదా మీ జీతం భారీగా పెరగొచ్చు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ కు కూడా ముందడుగు పడుతుంది. మీ వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఆఫీసులో కొలీగ్స్ మరియు సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఈ కాలంలో మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరంగా వారి సహాయం మీకు లభిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు చాలా మంచిగా ఉంటుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి బుధుడు తొమ్మిదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మత సంబంధిత ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం మంచిగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి. మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా అనేక సమస్యలు ఎదురవ్వొచ్చు. ఈ సమయంలో మీరు బయటి ఆహారం తినడం మానేయాలి. మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు ఉద్యోగులకు ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. బుధుడి అనుగ్రహం పొందేందుకు మీరు విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడిని పూజించాలి.

English summary

Mercury Transit in Libra On 22 September 2021 Effects on Zodiac Signs in Telugu

Here we are talking about the mercury transit in libra on 22 september 2021, Effects on Zodiac Signs in Telugu. Have a look
Desktop Bottom Promotion