Latest Updates
-
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే!
Mercury Transit in Libra on 22 September 2021:తులరాశిలో బుధుడి ఎంట్రీ.. ఈ రాశుల వారు జరభద్రం...!
2021 సంవత్సరంలో సెప్టెంబర్ 22న తులరాశిలోకి బుధుడు సంచారం చేసే సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాలలో బుధ గ్రహానికి ప్రత్యేక స్థానముంది. ఈ గ్రహాన్ని చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. బుధుడి అనుగ్రహం ఉన్న వారికి మేధస్సు, శక్తి సామర్థ్యాలు ఎక్కువగా లభిస్తాయని పండితులు చెబుతారు.

అలాంటి బుధుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ప్రభావం రాశిచక్రాల వారి తెలివితేటలు, జ్ణానంపై కచ్చితంగా ప్రభావం పడుతుందట. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరంలో సెప్టెంబర్ 22వ తేదీన బుధుడు కన్య రాశి నుండి తులరాశిలోకి సంచారం చేయనున్నాడు.

ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారిలో కొన్ని రాశుల వారిపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇంతకీ బుధుడి రవాణా వల్ల ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురువుతాయి... వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో వృషభ రాశి వారు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కాలంలో మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శత్రువులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎక్కువగా ఎవరినైతే నమ్ముతారో అలాంటి వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు హిజ్రాల ఆశీర్వాదం తీసుకుంటే శుభ ఫలితాలు వస్తాయి.

సింహ రాశి..
ఈ రాశి నుండి బుధుడు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి ప్రత్యర్థుల నుండి అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు ఇతరులతో ఎంత బ్యాలెన్స్ గా మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది. అలా కాకుండా మీరు అవనసరమైన వాదనల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. లేదంటే సామాజిక స్థాయిలో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. మీరు ఈ సమస్యల నుండి ఉపశమనం పొందాలంటే గోమాతకు పచ్చని గడ్డిని తినిపించండి. ఇలా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను పొందుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి బుధుడు పన్నెండో పాదం నుండి ఆగమనం చేయనున్నాడు. ఈ సందర్భంగా మీకు మిశ్రమ పలితాలు ఎదురవుతాయి. మీరు ఆర్థిక పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బు సంబంధిత సమస్యల వల్ల మీ పనులు కొన్ని మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. వ్యాపారులు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తుంటే.. మీ భాగస్వామి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే వారి వల్ల మీకు లాభానికి బదులు నష్టం రావొచ్చు. మీకు మంచి ఫలితాలు రావాలంటే మీ తోబుట్టువులకు లేదా మీ అత్తమ్మకు ఏదైనా మంచి బహుమతి ఇస్తే శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

మీన రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. బుధుడు ఈ స్థానంలో ప్రయాణించడం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ఈ కాలంలో ఆహారంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి. తాజా ఆహారాన్ని తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహారానికి దూరంగా ఉండండి. అలాగే బయట తిండిని తినడం మానేయండి. మొత్తానికి బుధుడి రవాణా వల్ల ఈ రాశి వారికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి.



Click it and Unblock the Notifications