Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Budh Gochar 2022 :వృషభంలో బుధుడి సంచారం..ఈ రాశులకు చాలా అదృష్టం!
2022లో ఏప్రిల్ 25న వృషభంలోకి బుధుడి సంచారం వల్ల రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో బుధుడిని ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో అయితే బుధుడి అనుగ్రహం ఉంటుందో వారి వ్యాపారం, ఉద్యోగం ఇతర రంగాల్లో మెరుగ్గా ఉంటుంది.

అయితే బుధుడి స్థానం తప్పుడు స్థానంలో ఉంటే మనకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలా ఎంతో విశిష్టత కలిగిన బుధుడు మరికొన్ని గంటల్లో మేష రాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. 2022లో ఏప్రిల్ 25వ తేదీన అంటే సోమవారం నాడు అర్ధరాత్రి 12:05 గంటలకు రవాణా చేయనున్నాడు.

ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఇంతకీ ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏయే రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు బుధుడి రవాణా సమయంలో డబ్బును చాలా తెలివిగా ఖర్చు చేయాలి. లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మరోవైపు వ్యాపారులు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. మీరు ఏదైనా డాక్యుమెంట్లపై సంతకం చేసే ముందు పూర్తిగా చదవాలి. ఈ సమయంలో మీరు శారీరకంగా ఫిట్ గా ఉంటారు.
పరిహారం : మీరు తులసి మొక్కను నాటి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

వృషభరాశి..
ఇదే రాశిలోకి బుధుడు సంచారం చేయనున్న కారణంగా, ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల మధ్దతు లభిస్తుంది. మీరు ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నట్లయితు, సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
పరిహారం : బుధవారం రోజున వినాయకుడిని తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.

మిధున రాశి..
ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల పని విషయంలో గందరగోళంగా ఉంటుంది. మీరు ఆర్థిక పరంగా నష్టపోవచ్చు. ఈ సమయంలో మీకు ఒత్తిడి పెరగొచ్చు. ఇది మీ సంబంధంలో శాంతిని కూడా పెంచుతుంది. మీరు కొన్ని చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉన్నందున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
పరిహారం : మీ చూపుడు వేలికి ఆకుపచ్చని ఉంగరాన్ని దరించాలి.

కర్కాటక రాశి..
బుధుడి రవాణా సమయంలో ఈ రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగులకు జీతం పెరగొచ్చు. మీరు కుటుంబం మరియు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. మీరు సరైన ఆహారంతో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఈ కాలంలో పెట్టుబడి పెడితే మీరు మంచి లాభం పొందొచ్చు.
పరిహారం : మీరు ప్రతిరోజూ 108 సార్లు ‘ఓం బుధాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి.

సింహ రాశి..
బుధుడు సంచారం చేసే వేళ ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో శాంతి మరియు సామరస్యం ఉంటుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. అయితే ఫిట్ నెస్ కోసం వ్యాయామంపై కొంచెం శ్రద్ధ వహించాలి. భూమికి అనుసంధానంగా ఉండటం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
పరిహారం : బుధవారం రోజున ఆలయంలో పచ్చి పప్పు దానం చేయడం వల్ల మేలు జరుగుతుంది.

కన్య రాశి..
ఈ రాశి వారికి బుధుడి రవాణా సమయంలో కొత్త ఉద్యోగావకాశాలు రావొచ్చు. మీరు మీ పైఅధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే అనవసరంగా ఖర్చులు పెట్టకండి. మీ కుటుంబంతో మీ సంబంధాలు క్షీణించొచ్చు. మీకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
పరిహారం : ప్రతిరోజూ విష్ణువును పూజించాలి.

తుల రాశి..
బుధుడు సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. మీరు విదేశీ వనరుల నుండి మంచి ఆదాయాన్ని పొందొచ్చు. మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందొచ్చు. మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీరు ఒత్తిడికి దూరంగా ఉండాలి. లేదంటే మీకు ఆర్థిక పరంగా నష్టంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పని చేయాలి.
పరిహారం : మీరు ప్రతిరోజూ 108 సార్లు బుధ మంత్రాన్ని జపించాలి

వృశ్చిక రాశి..
ఈ రాశి వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీరు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఆరోగ్య పరంగా ఈ సమయం అప్రమత్తంగా ఉండాలి. వివాహితులకు ఈ కాలంలో కఠినంగా ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకుండా ఉండాలి.
పరిహారం : బుధవారం రోజున ఉపవాసం చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

ధనస్సు రాశి..
వృషభంలో బుధుడి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారిలో ఉద్యోగులు ప్రమోషన్ పొందొచ్చు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఇదే సరైన సమయం. ఈ కాలంలో విద్యార్థులు ఏకాగ్రతతో చదువుతారు. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు. మీరు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయొద్దు.
పరిహారం : చిలుకకు ఆహారం ఇస్తే శుభ ఫలితాలొస్తాయి.

మకర రాశి..
ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారులు అద్భుత ప్రయోజనాలను పొందుతారు. వివాహితులు మాత్రం ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనవసరమైన వివాదాల్లో చిక్కుకోవద్దు. ఇది మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మధ్య దూరాన్ని పెంచొచ్చు. ఈ కాలంలో మీరు మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు.
పరిహారం : ఆరోగ్యంగా ఉండేందుకు పచ్చి కూరగాయాలను మీ ఆహారంలో చేర్చుకోండి.

కుంభ రాశి..
బుధుడి రవాణా వల్ల ఈ కాలంలో వివాహం చేసుకోవాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీకు దగ్గు మరియు జలుబుకు సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో మంచిగా ఉంటుంది.
పరిహారం : మీరు మంచి నోటి పరిశుభ్రతను పాటించాలి.

మీన రాశి..
బుధుడి రవాణా కాలంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో గొడవ పడకండి. అది మీ సంబంధాన్ని మాత్రమే పాడు చేస్తుంది. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అవసరమైన చెకప్ లు చేసుకోవాలి.
పరిహారం : ఈ కాలంలో మీరు మాంసాహారం మరియు ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నట్లో అందబాటులో ఉన్నది మరియు ఊహాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. వీటిని పరిగణనలోకి తీసుకునే ముందు, ఈ పరిహారాలను పాటించడానికి మీరు వ్యక్తిగత జ్యోతిష్య నిపుణుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోగలరు.
బుధుడు మరికొన్ని గంటల్లో మేష రాశి నుండి వృషభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. 2022లో ఏప్రిల్ 25వ తేదీన అంటే సోమవారం నాడు అర్ధరాత్రి 12:05 గంటలకు రవాణా చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఇంతకీ ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.



Click it and Unblock the Notifications











