Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
Mercury Transit in Virgo:బుధుడు కన్యరాశిలోకి సంచారం.. ఈ రాశుల వారు జరభద్రం...!
బుధుడు కన్యరాశిలోకి సంచారం చేసే సమయంలో, ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలలో బుధుడిని రారాజుగా భావిస్తారు. ఎవరి జాతకంలో అయినా బుధుడి అనుగ్రహం ఉంటే.. వారికి మేధస్సు, తెలివితేటలు, సంపద పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

అలాంటి బుధుడు ఆగస్టు 26వ తేదీన తన స్థానాన్ని మారనున్నాడు. సింహ రాశిలో నుంచి కన్యరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెలరోజుల పాటు సంచారం చేయనున్నాడు.

సెప్టెంబర్ 22 తర్వాత కన్యరాశి నుండి తుల రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. అయితే బుధుడి రవాణా కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే చూసెయ్యండి.

మేష రాశి..
బుధుడు ఈ రాశి నుండి ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సందర్భంగా మేష రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒత్తిడి ఎక్కువగా తీసుకోకూడదు. దీని వల్ల మీకు మానసిక సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో మరియు కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో గొడవలు రావొచ్చు. మరోవైపు ఉద్యోగులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆఫీసు పాలిటిక్స్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి బుధుడు పదో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ రాశి వారికి బుధుడి రవాణా కారణంగా సాధారణ ఫలితాలు వస్తాయి. అయితే మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు తొందరపడితే చాలా నష్టపోవాల్సి వస్తుంది. సమాజంలో మీ పట్ల ఉన్న గౌరవం కాస్త తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అలాగే కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. దీని వల్ల మీరు చాలా వరకు నష్టపోవచ్చు. మరోవైపు బుధుడి రవాణా వల్ల వ్యాపారులకు మరియు విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి.

తుల రాశి..
ఈ రాశి నుండి బుధుడు పన్నెండో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో వ్యాపారులకు ఆర్థిక పరంగా నష్టం రావొచ్చు. మీరు ఈ కాలంలో ఎవరితో అయినా లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి విషయంలోనూ అస్సలు తొందరపడొద్దు. మీరు తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటే, మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మరోవైపు ఉద్యోగులు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆఫీసులో ప్రత్యర్థులుగా భావించే వారితో మరింత అప్రమత్తంగా ఉండాలి.

కుంభ రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఎనిమిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీరు మీ హెల్త్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఈ సమయంలో మీకు చర్మ సమస్యలు ఉండొచ్చు. ముఖ్యంగా అలర్జీ ఉండే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగా, ధ్యానం చేయడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మరోవైపు ఉద్యోగులు మరియు వ్యాపారులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత కష్టపడినా ఫలితం మీకు ప్రతికూలంగా రావొచ్చు.

మీన రాశి..
ఈ రాశి నుండి బుధుడు ఏడో పాదం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. అయితే ఇదంతా భాగస్వామ్య వ్యాపారం వల్లే సాధ్యమవుతుంది. మరోవైపు మీరు ఈ కాలంలో ప్రత్యర్థుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ఈ సమయం చాలా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి.



Click it and Unblock the Notifications