Latest Updates
-
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది?
Mesha Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత’ ఏడాదిలో మేష రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో ఉగాది పండుగ సందర్భంగా మేష రాశి వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మన దేశంలో నిన్ననే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా మేష రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-14, వ్యయం-14
మేష రాశి వారు ఈ కాలంలో నిరంతరం పనిలో నిమగ్నమై ఉంటారు. ఈ రాశి వారికి అశ్విని నక్షత్రం 1,2,3,4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, క్రుతిక నక్షత్రం మొదటి పాదం.. ఇలా మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో మేషరాశి వారి ఆదాయం, వ్యయాలు సమానంగా ఉంటాయి.

రాజపూజ్యం-3, అవమానం-6
ఈ ‘శుభకృత్' నామ సంవత్సరంలో మేషరాశి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్య భగవానుడు మూడు, ఆరో స్థానం నుండి సంచారం చేసేటప్పుడు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రభుత్వం నుండి సహాయం లభిస్తుంది. అలాగే చాలా విషయాల్లో తల్లిదండ్రుల నుండి మద్దతు లభిస్తుంది. తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి గౌరవం కన్నా అవమానాలు ఎక్కువగా ఉంటాయి.

గ్రహాల సంచార ప్రభావం..
ఈ సంవత్సరం బుధ, గురు, శుక్ర, కుజ, చంద్ర గ్రహాలు ఆయా స్థానాల్లో సంచారం చేసేటప్పుడు, కొత్త ఇల్లు, కొత్త వాహనం లేదా నూతన వస్తువులను కొనే యోగం లభిస్తుంది. అదేవిధంగా శుభకార్యాల్లోనూ పాల్గొంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఇలా ఈ సంవత్సరంలో మేష రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు.

శని గ్రహా ప్రభావం..
ఈ సంవత్సరంలో శని భగవానుడు 2022 జులై 13వ తేదీ తర్వాత మకర రాశిలో దశమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడొచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఉద్యోగ రంగంలో మాత్రం సానుకూల ఫలితాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం రావొచ్చు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్ కూడా రావొచ్చు.

గురుడి ప్రభావం..
ఏప్రిల్ నెలలో గురుడు మీన రాశిలోకి సంచారం చేసే సమయంలో ఈరాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో మీకు ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు. విద్యా సంబంధిత రంగంలో ఖర్చులు పెరగొచ్చు. అలాగే శుభకార్యాలకు కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది.

పాటించాల్సిన పరిహారాలు..
రాహువు జన్మ రాశిలో సంచారం చేస్తుండగా.. కేతువు సప్తమి స్థానంలో ఉన్న తుల రాశిలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మీరు చేపట్టే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడొచ్చు. ఈ నేపథ్యంలో మీరు కొన్ని పరిహారాలు పాటించాలి. ముందుగా శని భగవానుడి అనుగ్రహం కోసం సుందరకాండ పారాయణం చేయాలి. శనివారం రోజున పరమేశ్వరునికి అభిషేకం చేయాలి. గురువారం రోజున సాయిబాబాను ఆరాధించాలి. అలాగే రాహు, కేతు గ్రహాల శాంతి కోసం శ్రీకాళహస్తి వెళ్లి, అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటే మంచి ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications