For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mithuna Rasi Ugadi Rasi Phalalu 2022:'శుభకృత' ఏడాదిలో మిధున రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...

తెలుగు నూతన సంవత్సరంలో మిధున రాశి వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశంలో ఇటీవలే హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నాం.. అదే సమయంలో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం.

Midhuna Rasi Ugadi Rasi Phalalu 2022, Gemini Ugadi Horoscope Predictions in Telugu

2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. 'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృత' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం.

Midhuna Rasi Ugadi Rasi Phalalu 2022, Gemini Ugadi Horoscope Predictions in Telugu

ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, 'శుభకృతు' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Midhuna Rasi Ugadi Rasi Phalalu 2022, Gemini Ugadi Horoscope Predictions in Telugu

ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట. ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా మిధున రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Ugadi Rashi Phalalu 2022:'శుభ కృత'ఏడాదిలో మీ జాతకం తెలుసుకోండి.. మీ జీవితానికి సరికొత్త బాటలు వేసుకోండి...Ugadi Rashi Phalalu 2022:'శుభ కృత'ఏడాదిలో మీ జాతకం తెలుసుకోండి.. మీ జీవితానికి సరికొత్త బాటలు వేసుకోండి...

ఆదాయం-11, వ్యయం-05

ఆదాయం-11, వ్యయం-05

‘శుభకృత' నామ సంవత్సరంలో మిధున రాశి వారికి ఆదాయ పరంగా అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి గురు గ్రహం అనుగ్రహం వల్ల కొత్త ఏడాదిలో శుభకరమైన ఫలితాలొస్తాయి. విద్యార్థులకు విద్యారంగంలో మంచిగా ఉంటుంది. కాంట్రాక్టులకు భారీ ఒప్పందాలు కుదరొచ్చు. ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

రాజపూజ్యం-2, అవమానం-02

రాజపూజ్యం-2, అవమానం-02

మిధున రాశి వారికి కొత్త ఏడాదిలో శని గ్రహం వల్ల మిశ్రమ ఫలితాలు ఏర్పడొచ్చు. రాహు గ్రహం ప్రభావంతో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కల నెరవేరొచ్చు. కొత్త దంపతులకు సంతానం గురించి శుభవార్త వినిపించొచ్చు. మహిళలు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు.

Vrushabha Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత' ఏడాదిలో వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!Vrushabha Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత' ఏడాదిలో వృషభ రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!

కొత్త ఏడాదిలో..

కొత్త ఏడాదిలో..

తెలుగు నూతన సంవత్సరంలో కేతువు వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. సంవత్సరం మధ్యలో మహిళలకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు మీరు కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుంది.

కొన్ని సమస్యలు..

కొన్ని సమస్యలు..

తెలుగు సంవత్సరం కొత్త ఏడాది ప్రారంభంలో మీ కుటుంబ జీవితంలో ప్రోత్సాహాకరంగా ఉంటుంది. మీ అభిరుచికి తగిన విధంగా ఇంట్లో మార్పులు చేయొచ్చు. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

Mesha Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత' ఏడాదిలో మేష రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!Mesha Rasi Ugadi Rasi Phalalu 2022: ‘శుభకృత' ఏడాదిలో మేష రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!

ఆగస్టు నుండి..

ఆగస్టు నుండి..

మిధున రాశి వారు ఆగస్టు మాసం నుండి మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ ప్రణాళికలన్నీ కార్యరూపం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం వల్ల మీ ఖర్చులు పెరగొచ్చు. ఉద్యోగులకు ఆఫీసులో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. మీకు కొన్ని ఆకస్మిక ఆర్థిక సమస్యలు కూడా రావొచ్చు.

2023లో..

2023లో..

ఇక 2023 సంవత్సరంలోని జనవరి, ఫిబ్రవరి నెలలో అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు తమ ఉద్యోగం మార్పు కావాలంటే మంచి కాలంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సమస్యలు తగ్గొచ్చు. విద్యార్థులు ఈ కాలంలో విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ప్రయత్నాల వల్ల శుభప్రదంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది.

FAQ's

English summary

Mithuna Rasi Ugadi Rasi Phalalu 2022, Gemini Ugadi Horoscope Predictions in Telugu

Midhuna Rasi Ugadi Rasi Phalalu 2022: Here is the Gemini Ugadi Horoscope in Telugu. Midhuna rashi(Gemini) Ugadi Panchangam in Telugu. Read on
Desktop Bottom Promotion