Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
ఈ 5 రాశుల వారికి ధైర్యం తక్కువగా ఉంటుందట...!
ఈ రాశుల వారు చాలా పిరికితనంగా ఉంటారట. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి.
మనలో ఎవ్వరైనా సరే జీవితంలో ప్రతి ఒక్క క్షణంలో ఎదురైన సమస్యను అధిగమించడానికి ధైర్యం అనేది చాలా అవసరం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అత్యంత ఎక్కువ ధైర్యం కావాలి. ధైర్యంగా ఉండటం అంటే హింసలో పాల్గొనడం మాత్రమే కాదు..

తమ తప్పులను కూడా అంగీకరించేలా ఉండాలి. ఇలా ధైర్యంగా ఉండే వారు తమ జీవితంలో ఎలాంటి బంధాలను కోల్పోరు. అయితే ఇలాంటి ధైర్యం అందరికీ ఉండదు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ధైర్యం అస్సలు ఉండదని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీరు చాలా విషయాల్లో పిరికితనంగా ఉంటారట.

వీరికి ఏదైనా సమస్యను ఎదురైనప్పుడు దాన్ని అధిగమించే ప్రయత్నం చేయకుండా.. దాని నుండి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తారట. అంతేకాదు సమస్యలు ఎదురైనప్పుడు చాలా అపరిపక్వంగా ఉంటారట. ధైర్యం తక్కువగా ఉండటం వల్ల బాధ్యతతో కూడా వ్యవహరించరట.

అత్యవసర పరిస్థితుల్లో సైతం భయాందోళనలకు గురవుతారట. అయితే ఇలా భయపడే వారు ఎవరికైనా సులభంగా అబద్ధాలు చెబుతారట. ఇతరుల కంటే తామే గొప్ప అని చెప్పుకునేందుకు అసత్యాలను ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి ధైర్యం తక్కువగా ఉంటుంది.. ఎందుకని వారిలో పిరికితనం ఎక్కువగా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి..
ఈ రాశి వారు ప్రతి చిన్న విషయం గురించి చాలా లోతుగా ఆలోచిస్తారు. దీంతో వీరు అడుగు ముందు వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీరు తమ ఫీలింగ్స్ తెలుసుకుని, దాని నుండి బయటకు రావాలి. వీరు అనవసర విషయాలకు కాలయాపన చేయడం వల్ల పరిస్థితులు చేయి దాటి పోయే అవకాశం ఉంటుంది. దీంతో సమస్యలను పరిష్కరించే దశను దాటి వెళ్లొచ్చు. అయితే వీరు ఎప్పుడూ తమ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నించరు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల కోసం పోరాడేందుకు కొంత ధైర్యంగా ఉంటారు. అయితే వీరు తమ సొంత తప్పులకు బాధ్యత వహించినప్పుడు మాత్రం చాలా భయపడతారు. అందుకే వీరు పిరికి వారి రాశిచక్రాలలో ఒకటిగా ఉండిపోతారు.

కన్య రాశి..
ఈ రాశి వారు తమలో తాము చాలా తెలివిగా గౌరవించని ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడరు. ఎందుకంటే వారు తమకు తెలియని వాటిని ఒప్పుకోరు. ఇలాంటి విషయాలు వీరిని ఎక్కువగా భయపెడతాయి. అయితే వీరు తమ తప్పులకు బాధ్యత వహించనప్పుడు కొంత ధైర్యంగా ఉంటారు.

తులా రాశి..
ఈ రాశి వారు సంఘర్షణను ద్వేషించినప్పటికీ, నాటకాన్ని మాత్రం ద్వేషించరు. గందరగోళ పరిస్థితుల్లో బాగా ఏడుస్తుంటారు. అయితే ఏదైనా తప్పు చేసినప్పుడు దాన్ని డైవర్ట్ చేసేందుకు నాటకాలు సైతం వేసేందుకు వెనుకాడరు. వీరు తమ కార్యకలాపాలకు ప్రశాంతంగా మరియు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అయితే ఇది వారికి అనవసరమైన బాధ్యతలను పెంచుతుందని ఫీలవుతారు.

మీన రాశి..
ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. ఇలాంటి లక్షణం వల్లే వీరు భయంతో వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే వీరు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు బాధ్యతలను స్వీకరించడానికి బదులుగా, ఇతరులపై నిందలు వేయాలని చూస్తుంటారు. వీరు ఏదైనా సవాళ్లు ఎదురైనప్పుడు, వాటిని ఎదుర్కోకుండా.. ఆ పరిస్థితుల నుండి తమను తాము ఎలా కాపాడుకోవడాలా అని భయపడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications
