For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారిని అస్సలు మోసం చేయలేరు... ఎందుకంటే వీరికి ముందే తెలిసిపోతుందట...!

|

ఈ భూ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి తర్వాతి నిమిషం ఏమి జరుగుతుందనే విషయం అస్సలు తెలీదు. అయితే కొందరు కొన్ని అంచనాల ప్రకారం భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అంచనా వేస్తారు.

మరి కొంతమందికి భవిష్యత్తులో జరగబోయేదేంటో ముందుగానే తెలిసిపోతుంది. అయితే అన్ని విషయాలు కాదండోయ్.. అప్పుడప్పుడు కొన్ని అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. ఉదాహరణకు ఈరోజు వర్షం కురవదు అంటే.. ఆకాశం ఎంత మేఘావ్రుతమై ఉన్నప్పటికీ వర్షం అనేది అస్సలు కురవదు.

బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారు.. ఏదైనా క్రికెట్ మ్యాచ్ లేదా ఇంకేదైనా మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే విషయాలను ముందుగానే ఊహించి చెబుతుంటారు. అదేంటో వారు చెప్పిన మాదిరిగానే తూ.చ తప్పకుండా జరుగుతుంది. దీంతో వారు చెప్పింది అక్షరాల నిజమని చాలా మంది నమ్ముతారు. కానీ ఇదంతా నిజం కాదు.. వారికి ఆయా రంగాల్లో కొంత అవగాహన ఉంటుందట. దాంతో వారు కొన్ని విషయాలను ముందుగానే పసిగట్టి అలా చెబుతుంటారట. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అలాంటి వ్యక్తులెవరో తెలుసుకోవచ్చట. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి.

Sun Transit in Virgo:కన్యరాశిలో సూర్యుడి రవాణా.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావమంటే...!

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు సామాజిక విషయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. వీరికి ఎప్పుడు.. ఎక్కడ ఏమి మాట్లాడాలో బాగా తెలుసు. ఈ రాశి వారి దగ్గర మీరు ఏదైనా విషయం చెప్పాలనుకుంటే.. దాన్ని వీరు ముందుగానే పసిగట్టగలరు. మీరు తీవ్రంగా ఆలోచించిన విషయాల గురించి ఒక వాక్యంలో పూర్తి చేస్తారు. వీరు మల్టీ టాలెంట్ ను కలిగి ఉంటారు. వీరు ఎలాంటి పరిస్థితుల్లో చాలా బ్యాలెన్స్ గా ప్రవర్తిస్తారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు సహజంగా చాలా సున్నితంగా ఉంటారు. వీరు భావోద్వేగాలకు, బంధాలకు ఎక్కువగా విలువనిస్తారు. వీరు ఎవ్వరితో అయినా నవ్వుతూ మాట్లాడతారు. ప్రత్యర్థులతో సైతం మాట్లాడటానికి సైతం ఎల్లప్పుడూ ముందుంటారు. వీరికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువ. అందుకే వీరికి ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఇట్టే తెలిసిపోతుంది. వారి ఫేసు చూసి.. వారి హావభావాలను బట్టి వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలుసుకుని.. వాటిని తీర్చేందుకు సహాయపడతారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు ఉదయం నిద్ర లేచిదగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు తమ చుట్టుపక్కల ఏమి జరుగుతుందనే విషయాలను చాలా నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. వీరిని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే వీరు ఏదైనా విషయం చెబుతున్నారంటే.. అది కచ్చితంగా నిజమవుతుంది. వీరు అన్ని విషయాలను చాలా లోతుగా పరిశీలిస్తారు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. దీంతో వీరిని అందరూ మెచ్చుకుంటారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు చాలా సందర్భాల్లో తమ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాలను అందరి కంటే ముందే కనిపెట్టగలరు. అంతేకాదు ఏదైనా క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయంటే.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. వీరికి తెలియని విషయాల్ని సైతం వీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వీరు ప్రతి ఒక్క విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు. వాటి గురించి విశ్లేషణలు సైతం ఇస్తుంటారు.

డబ్బును ఆదా చేయడంలో ఈ 4 రాశులు మిమ్మల్ని మించగలవు ... మీ రాశి ఇక్కడ ఉందా?

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు తర్వాతి నిమిషంలో లేదా రాబోయే గంటలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే వివరాలను ముందుగానే పసిగట్టగలరు. అందుకు తగ్గట్టు వారు ప్లాన్లు వేసుకుంటారు. ఏదైనా తప్పు జరిగితే.. వారిలో వారే అడ్జస్ట్ అవుతారు. వీరి దగ్గర ఎవరైనా అబద్ధం చెప్పాలని ప్రయత్నిస్తే.. వీరు వెంటనే కనిపెట్టేస్తారు. కాబట్టి వీరిని మోసం చేయడం అంత ఈజీ కాదు. కాబట్టి వీరి దగ్గర అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వీరు చాలా తెలివి కలవారు.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు అందరికంటే చాలా భిన్నంగా ఆలోచిస్తారు. వీరు సాధారణంగా సహజంగా ఉంటారు. ఈ రాశి వారు కూడా తరువాతి క్షణం ఏమి జరుగుతుందనే విషయాలను ముందుగానే కనిపెడతారట. చాలా విషయాలు వీరు ముందుగానే ఊహిస్తూ ఉంటారు. దీంతో పరిస్థితులన్నీ వీరికి చాలా సులభంగా అర్థమైపోతూ ఉంటాయి. వీరి ఆలోచనలన్నీ కూడా చాలా సహజంగా ఉంటాయి.

English summary

Most Intuitive Zodiac Signs In Astrology

Here are the most intuitive zodiac signs in Astrology. Take a look
Story first published: Friday, September 17, 2021, 19:05 [IST]