Latest Updates
-
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్
ఈ 6 రాశుల మగాళ్లను ఎక్కువగా నమ్మొద్దు.. ముఖ్యంగా పెళ్లయిన వారితో జాగ్రత్త...!
రిలేషన్ షిప్ లో ఏ రాశుల వారు అత్యంత అవిశ్వాసంగా ఉంటారో తెలుసుకునేందుకు ఇక్కడ ఓ లుక్కేయండి.
ఏ రిలేషన్ షిప్ లో అయినా నిజాయితీ ఉంటేనే.. ఆ బంధంలో నమ్మకం అనేది ఏర్పడుతుంది. అప్పుడే ఆ రిలేషన్ షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అయితే రిలేషన్ షిప్ లో మోసం చేయడం, మోసపోవడం అనేది జీవితంలో ఎవరికైనా బాధ కలిగిస్తాయి.

ముఖ్యంగా ప్రేమ జీవితంలో మరియు వైవాహిక జీవితంలో నమ్మకం తగ్గినప్పుడు అనేక సమస్యలు తలెత్తుతాయి. దురదృష్టవశాత్తు చాలా మంది రిలేషన్ షిప్ లో నిజాయితీగా ఉండరు. అలాంటి వ్యక్తులు ఎవరినైనా చాలా సులభంగా మోసం చేస్తారు. ఇంకా కొందరు మోసం చేయడానికి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు.

అలాంటి వారిలో మగాళ్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. అలాంటి మగాళ్లను నమ్మడం చాలా కష్టమట. మరి అలాంటి వారిని ఎలా కనిపెట్టాలి.. అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవడం కొంత కష్టమే. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండరని అంచనా వేయబడింది. ఈ సందర్భంగా ఆ రాశిచక్రాలేవో మీరూ చూసెయ్యండి...

మీనరాశి
ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. వీరు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ భావోద్వేగానికి గురవుతుంటారు. అందుకే వీరు రిలేషన్ షిప్ లో ఏ చిన్న అసౌకర్యం కలిగినా చాలా నిరాశ చెందుతారు. అందుకే వీరు గొడవలు జరిగినప్పుడు తప్పుడు మార్గంలో ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో, సంబంధం అల్లకల్లోలమైన దశలోకి వెళ్ళినప్పుడు కూడా వారు తమ సంబంధాన్ని కొనసాగించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. ఇది కూడా సమస్యాత్మకంగా ఉంటుందని భావిస్తారు. అయితే ఇలాంటి సమయంలో సంబంధాన్ని ముగించడానికి బదులుగా భాగస్వామిని బాధపెట్టే ప్రయత్నం చేయొచ్చు. మిమ్మల్ని తప్పుదారి పట్టించొచ్చు.

మిధున రాశి
ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు నటిస్తారు. అయితే వీరి భాగస్వామి వీరి పట్ల 24 గంటల పట్ల చాలా శ్రద్ధగా ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో పక్కచూపులు కూడా ఎక్కువగా చూస్తుంటారు. వీరు రిలేషన్ షిప్ లో ఎల్లప్పుడూ ప్లాన్-ఏ ఫెయిలైతే.. ప్లాన్-బి సిద్ధంగా ఉంచుకుంటారు. ఎప్పుడైతే తమ భాగస్వామితో అవసరాలు తీరుతాయో.. వారు మరో రిలేషన్ షిప్ కోసం చూస్తుంటారు.

తులా రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ ను కొనసాగించేందుకు ఎక్కువగా విముఖత చూపుతుంటారు. ఎందుకంటే వీరు సమాజంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నట్లు ఫీలవుతుంటారు. అయితే ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి అవసరమైనప్పుడు అమ్మాయిలను ఆకాశానికెత్తేస్తారు. మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారు. ఇది సమస్య కానప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుంది.

కుంభ రాశి
ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో చాలా చురుగ్గా ఉంటారు. వీరు తమ మాజీ ప్రియురాలితో సన్నిహితంగా ఉండొచ్చు. వీరు తమ భాగస్వామిని శారీరకంగా మోసం చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే వీరు మానసికంగా ఖచ్చితంగా ద్రోహం చేయగలరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు మోసం చేసే జాబితాలో ఉండటం దురదృష్టకరం. ఎందుకంటే వీరు తమ భాగస్వామి పట్ల ఎప్పుడూ నిజాయితీగా ఉండాలని భావించే వారు. కానీ తమ భాగస్వామి తమ పట్ల నిజాయితీగా లేదని తెలుసుకున్నప్పుడు వీరి మూడ్ పూర్తిగా మారిపోతుంది. వీరు అనుభవించిన బాధ కంటే తమ భాగస్వామి అందుకు వంద రెట్లు ఎక్కువ నొప్పిని అనుభవించాలని భావిస్తారు. అందుకు అనుగుణంగా చర్యకు దిగుతారు.

మకర రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ కు సంబంధించి నిర్దిష్ట అంశాలను పరిశీలిస్తారు. ఇది సాధారణంగా ఆనందం, మద్దతు మరియు స్థిరత్వంపై కేంద్రీకృతమై ఉంటుంది. అయితే, ఏ జీవిత భాగస్వామి కూడా ఇలాంటి వాటిని ఎల్లప్పుడూ అందించలేరు. అందుకే రిలేషన్ షిప్ లో ఎక్కడైతే ఆనందం దొరుకుతుందో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇతరులపై ఆసక్తి పెంచుకుంటారు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆరు రాశుల మగాళ్లు రిలేషన్ షిప్ లో నమ్మకంగా ఉండరు. ఎల్లప్పుడూ తమ భాగస్వామిని మోసం చేయాలని చూస్తుంటారు. వారిలో మీన రాశి, తులరాశి, మిధున రాశి, వృశ్చికరాశి, కుంభ రాశి, మకరరాశి వారు ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేయబడింది.



Click it and Unblock the Notifications