For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mother's Day 2021: ఈ మదర్స్ డే నాడు అదిరిపోయే కానుకలిచ్చి ‘అమ్మ’ను ఆశ్చర్యపరచండి...!

|

ఈ లోకంలో తన కోసం కాకుండా.. తన పిల్లల గురించి అమితంగా.. అపారంగా ఆలోచించేది.. ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే.

అందుకే ప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మ ఎంతో ప్రత్యేకం. అలాంటి అద్భుతమైన అమ్మ ప్రేమను సెలబ్రేట్ చేసుకునే రోజే మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా అదిరిపోయే కానుకలను అమ్మకు అందించండి..

అయితే ఎప్పుడూ ఇచ్చే గిఫ్టులను కాకుండా.. ఈసారి కాస్త ప్రత్యేకమైన మంచి బహుమతులు ఇచ్చేయండి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఖరీదైన బహుమతులు కొనే ఛాన్స్ లేదు.

కాబట్టి మీరు ఇంట్లో ఉంటూనే మీరిచ్చే బహుమతుల్లోనే మీ ప్రేమను పూర్తిగా నింపేసి తనకు ఇస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది. ఈ సందర్భంగా మీరు ఇంట్లోనే ఉంటూ అమ్మ ఆశ్చర్యపరిచే బహుమతులు ఎన్నో ఇవ్వొచ్చు. అవేంటో మీరూ చూసెయ్యండి మరి...

Mother's Day 2021: మదర్స్ డే రోజున 'అమ్మ' మధురమైన అనుభూతిని పొందాలంటే... ఇలా ట్రై చేయండి...

తల్లే తొలి గురువు..

తల్లే తొలి గురువు..

ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి తల్లే తొలి గురువు. ప్రతి ఒక్క చిన్నారికి ఆమె గురువు, స్నేహితురాలిగా మారిపోతుంది. ప్రతి ఒక్క బిడ్డ నోటి నుండి వచ్చే తొలి పదం కూడా అమ్మ. మనం ముసలివాళ్లమైనా.. మనకు అకస్మాత్తుగా ఏదైనా దెబ్బ తగిలినా.. వెంటనే ‘అమ్మా' అనే అంటాం. అందుకే ఇంటర్నేషనల్ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మంటే మీకు ఎంత ఇష్టమో చెప్పండి. ఆమె మీ కోసం పడిన కష్టాన్ని గుర్తించండి. ఈ లాక్ డౌన్ సమయంలో తనకు మధురమైన కానుకలను అందించండి.

పూల కుండీలు..

పూల కుండీలు..

మీ అమ్మకు మొక్కలన్నా.. పూలన్నా ఇష్టమా.. అయితే తన కోసం ఒక మంచి తోటను ఇంటి వద్దే ఏర్పాటు చేయండి. మీ ఇంటి ఆవరణంలో అంత పెద్ద స్థలం లేదని ఆలోచిస్తున్నారా? మీకు స్థలం తక్కువగా ఉంటే.. దాబాపై లేదా బాల్కనీలో మంచి బొన్సాయి గార్డెన్ ఏర్పాటు చేయండి. ఇలాంటివి కుదరకపోతే మీ కుండీల్లో అమ్మకు ఇష్టమైన పూల మొక్కలను ఉంచి అందించండి. తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అందంగా పెంచేందుకు తగిన ఏర్పాట్లు చేసేయ్యండి. ఇది చాలా సులభమే అని తెలుసా..

స్పా ట్రీట్మెంట్..

స్పా ట్రీట్మెంట్..

ప్రతిరోజూ ఇంటి పని.. వంట పనితో పాటు అనేక బాధ్యతలు, బరువులు మోసే అమ్మ శారీరకంగా.. మానసికంగా చాలా అలసిపోతూ ఉంటుంది. అందుకే అమ్మ తను శారీరకంగా, మానసికంగా తిరిగి పునరుత్తేజం పొందేందుకు మంచి స్పా ట్రీట్మెంట్ ను బహుమతిగా ఇవ్వండి. మీ దగ్గర అంత సొమ్ము లేకపోతే, ఒక అందమైన సెంటెడ్ క్యాండిల్స్ సెట్ కొని మీరే స్వయంగా అమ్మకు స్పా ట్రీట్మెంట్ ఇవ్వొచ్చు.

Mother's Day 2021: అమ్మను మించిన దైవం లేదు... ఆమె జీవితం అందరికీ ఆదర్శం..

ఫొటో ఫ్రేమ్..

ఫొటో ఫ్రేమ్..

మన భావాలను పదాల్లో వ్యక్తీకరించకపోయినా.. ఒక ఫొటోతో మన ఫీలింగ్స్ తెలిపే చిత్రాలెన్నో ఉంటాయి. అందులో అమ్మతో కలిసి దిగిన ఫొటోలు ఎన్నో ఉంటాయి. అందుకే చాలా మంది అమ్మతో దిగిన ఫొటోలను ఫ్రేమ్ కట్టించి పెట్టడం వంటివి మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. కానీ ఇలా ఫ్రేమ్ చేయించినా.. కొన్ని రోజులే అందంగా ఉంటాయి. తర్వాత అవి చెడిపోతాయి. అందుకే దీనికి బదులుగా మీరు ఒక మంచి ఉడెన్ ఫ్రేమ్ పై మీ ఇద్దరి చిత్రాలను గీస్తే ఎంత అందంగా ఉంటుంది.

బ్యూటిఫుల్ సారీ..

బ్యూటిఫుల్ సారీ..

చీరలంటే ఎవరికిష్టముండదు చెప్పండి? మహిళలందరికీ చీరలంటే చాలా ఇష్టం. ఈ మదర్స్ డే సందర్భంగా మీ అమ్మకు ఇష్టమైన ఓ మంచి పట్టు లేదా గద్వాల జరీ చీర వంటి వాటిని బహుమతిగా ఇవ్వండి. మీకు చీరల గురించి పెద్దగా ఐడియా లేకపోతే.. తననే తీసుకెళ్లి మరీ కొనుగోలు చేయండి. లేదా ఎవరికైనా చెప్పి మంచి చీరను సెలెక్ట్ చేసి.. అమ్మను ఆశ్చర్యపరచండి.

అందమైన మేకప్ బాక్స్..

అందమైన మేకప్ బాక్స్..

మనలో చాలా మంది తల్లులు మేకప్ అంటే పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ సహజంగా ఉండాలని కోరుకుంటారు. అయితే లైట్ గా కనిపించే మేకప్ వారి లుక్ ని మరింత అందంగా మారుస్తుంది. అందుకే చాలా మంది మహిళలు ఇటీవలి కాలంలో మేకప్ పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు కూడా నో మేకప్ లుక్ కి సంబంధించిన వస్తువులను కొని.. దాన్ని అందమైన మేకప్ బాక్సు లో ఉంచి తనకు గిఫ్ట్ గా ఇవ్వండి.

అమ్మకు విషెస్ చెప్పి..

అమ్మకు విషెస్ చెప్పి..

అయితే అమ్మకు కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే కాదని గుర్తుంచుకోండి. ప్రతి రోజూ అమ్మదే. అన్ని రోజులూ మీరు అమ్మకు ప్రేమను అందిస్తేనే.. మదర్స్ డేకు మీరు సరైన ప్రియారిటీ ఇచ్చి అమ్మను ప్రేమించినట్లు అవుతుంది. ఈ ఒక్క రోజు మాత్రమే అమ్మకు విషెస్ చెప్పి.. అమ్మతో ఫొటోలు దిగి.. స్టేటస్ పెట్టుకోవడం.. ఎఫ్ బి, ఇన్ స్టాలో పోస్టు చేయడం వంటివి చేస్తే.. మీరు చేసిందంతా వ్యర్థమే అని చెప్పుకోవచ్చు.

English summary

Mother's Day Gift Ideas for Every Kind of Mom

Listed below are the best and most unique gifts that you can gift your mom this year on Mother’s day! Check out the list and make this day special for your mum who is often not given the importance that we youngsters tend to forget!