For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National Mathematics Day 2021:ఈరోజే గణిత దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

జాతీయ లెక్కల దినోత్సవ తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

భారత గణిత శాస్త్ర నిపుణుడు శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈయన తమిళనాడు రాష్ట్రంలో 1887 సంవత్సరంలో డిసెంబర్ 22వ తేదీన ఈరోడ్ ప్రాంతంలోని అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో శ్రీనివాస రామానుజన్ జన్మించారు.

National Mathematics Day 2021 : Date, History And Significance in Telugu

రామానుజన్ రాయల్ సొసైటీకి చెందిన అతి చిన్న వయసులోని వారిలో ఒకరు. అర్డసీర్ కర్సెట్జీ తర్వాత సాధించిన రెండో భారతీయుడు.శ్రీనివాస రామానుజన్ కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జన్మించారు.

ఈయన సంఖ్య సిద్ధాంతం మరియు అనంతమైన శ్రేణులను కలిగి ఉన్న గణితం కోసం చాలా దోహదపడ్డారు. ఈ గణిత మేధావి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ప్రత్యేకంగా విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకం. విద్యార్థులు ఏ విభాగాలకు చెందిన వారైనా.. ఈయన సిద్ధాంతాలు మరియు జీవిత వాస్తవాలు గణితంపై ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సందర్భంగా శ్రీనివాస రామనుజన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

జాతీయ గణిత దినోత్సవం..

జాతీయ గణిత దినోత్సవం..

శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి ఏటా రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని గణిత దినోత్సవంగా జరుపుకుంటామని అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

గణిత శాస్త్రంలో కీలకం..

గణిత శాస్త్రంలో కీలకం..

ఈ ప్రపంచంలో గణిత శాస్త్రంలో విప్లవాల విషయానికొస్తే, ఆర్యభట్ట నుండి నేటి సిఆర్ రావు వరకు మన భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. శ్రీనివాస రామానుజన్ చేసిన ఆవిష్కరణలు, సంఖ్యా సిద్ధాంతం, విభజన సూత్రాలు, గణిత టీటా ఫంక్షన్లు, అనంతమైన శ్రేణులు వంటివి గణిత శాస్త్రంలో కీలక పాత్ర పోషించాయి.

నెమ్మదిగా గుర్తింపు..

నెమ్మదిగా గుర్తింపు..

శ్రీనివాస రామానుజన్ తన మొదటి పేపర్ ను ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీ జర్నల్ లో ప్రచురించాడు. అనంతరం నెమ్మదిగా గుర్తింపు పొందాడు. 1913 సంవత్సరంలో శ్రీనివాస రామానుజన్ బ్రిటన్ గణిత శాస్త్రవేత్త గాడ్ ఫ్రే, హెచ్.హార్డీతో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి ప్రత్యేక స్కాలర్ షిప్ మరియు కేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాల నుండి పొందాడు.

ఇంగ్లాండులో పర్యటన..

ఇంగ్లాండులో పర్యటన..

రామానుజన్ కు మతపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, 1914 సంవత్సరంలో ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభించారు. గాడ్ ఫ్రే హెచ్.హార్టీ అతనికి శిక్షణ ఇచ్చాడు. తనతో కలిసి కొన్ని పరిశోధనలలో కూడా పాల్గొన్నాడు. శ్రీనివాస రామానుజన్ రీమాన్ సీరిస్, ఎలిఫిక్ ఇంటిగ్రల్స్, హైపర్ జోమెట్రిక్ సిరీస్ మరియు జీటా ఫంక్షన్ యొక్క ఫంక్షనల్ ఈక్వేషన్స్ వంటి అనేక విషయాలపై పని చేశాడు. దీంతో పాటు తన సొంత డివర్టెంట్ సీరిస్ సిద్ధాంతాలపై పని చేశాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో సంఖ్యల విభజనలో రామానుజన్ మరింత పురోగతి సాధించాడు. రామానుజన్ యొక్క పత్రాలు ఇంగ్లాడ్ మరియు యూరోపియన్ జర్నల్స్ లో ప్రచురించబడ్డాయి. 1918 సంవత్సరంలో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ కు ఎంపిక చేయబడ్డాయి.

రామానుజన్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు..

రామానుజన్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు..

* 11 సంవత్సరాల వయసులోనే రామానుజన్ గణితంలో కొన్ని అద్భుతాను చూపించడం ప్రారంభించాడు. 12 సంవత్సరాల వయసులో తను ఎవరి సహాయం లేకుండా అనేక సిద్ధాంతాలు మరియు త్రికోణమిలో ప్రావీణ్యం సంపాదించాడు.

* తన పరిశోధనల కోసం హార్టీ మరియు లిటిల్ వుడ్ లతో కలిసి కేంబ్రిడ్జిలో ఐదు సంవత్సరాల పాటు గడిపాడు.

* దీంతో శ్రీనివాస రామానుజన్ కు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేశారు. దీని తర్వాత 1916లో అత్యంత సమ్మిళిత సంఖ్యలపై చేసిన పరిశోధనలకు గాను తన పేరు పిహెచ్ డిగా మార్చబడింది.

* రామానుజన్ ఇంగ్లాండులో ఉన్నప్పు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. తన ఆరోగ్యం బాగా క్షీణించింది. తను క్షయ వ్యాధితో బాధపడ్డాడు. విటమిల్ లోపం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 1917 సంవత్సరంలో తనకు క్షయ వ్యాధి సోకింది.

* దీంతో ఆయన 1919లో మద్రాసు పట్టణానికి తిరిగొచ్చాడు. అయితే 1920 సంవత్సరంలో ఏప్రిల్ 26వ తేదీన తుదిశ్వాస విడిచాడు. రామానుజన్ 32 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. తను ఒక షీఫ్ పేజీలు మరియు మూడు నోట్ బుక్స్ ను చివరగా విడిచిపెట్టాడు. వీటిని ప్రముఖంగా ‘లాస్ట్ నోట్ బుక్' అని పిలుస్తారు. రామానుజన్ మరణించి సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గణిత శాస్త్రవేత్తలు తన ఫలితాలను కనుగొనడాన్ని ధ్రువీకరించారు.

FAQ's
  • శ్రీనివాస రామానుజన్ ఎన్ని సంవత్సరాలు జీవించారు?

    భారత గణిత శాస్త్ర నిపుణుడు శ్రీనివాస రామానుజన్ కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జన్మించారు.1920 సంవత్సరంలో ఏప్రిల్ 26వ తేదీన తుదిశ్వాస విడిచాడు.

  • శ్రీనివాస రామనుజన్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

    మన దేశంలోని తమిళనాడు రాష్ట్రంలో 1887 సంవత్సరంలో డిసెంబర్ 22వ తేదీన ఈరోడ్ ప్రాంతంలోని అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో శ్రీనివాస రామానుజన్ జన్మించారు.

  • జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపకుంటారు?

    ప్రతి సంవత్సరం మన దేశంలో డిసెంబర్ 22వ తేదీన శ్రీనివాస రామానుజన్ జన్మదినం సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజున దేశవ్యాప్తంగా గణిత దినోత్సవ డుకలను ఘనంగా జరుపుకుంటారు.

English summary

National Mathematics Day 2021 : Date, History And Significance in Telugu

Here we are talking about the national mathematics day 2021:Date, history and significance in Telugu. Have a look
Story first published:Wednesday, December 22, 2021, 11:50 [IST]
Desktop Bottom Promotion