For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

National Science Day 2023:రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఈరోజే నేషనల్ సైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు?

రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి మరియు తన జయంతి రోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. భారతీయ శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ 'రామన్ ఎఫెక్ట్'ను 1928లో ఫిబ్రవరి 28వ తేదీన కనుగొన్నారు.

National Science Day 2022

అందుకే ప్రతి ఏటా భారతదేశంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సర్ సి.వి.రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు తనకు 1930వ సంవత్సరంలో నోబెల్ అవార్డు కూడా లభించింది. ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇతర విద్యాసంస్థల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్లు, క్విజ్ పోటీలు, ఉపన్యాసాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు.

National Science Day 2022

సైన్స్ రంగంలో రామన్ చేసిన సేవలను ఈరోజున స్మరించుకుంటూ వేడుకలను జరుపుకుంటారు. ఇంతకీ 'రామన్ ఎఫెక్ట్' అంటే ఏమిటి? సర్ సి.వి.రామన్ సైన్స్ రంగంలో ఎలాంటి సాహసాలను చేశారు.. ప్రపంచంలో మన దేశ కీర్తి ప్రతిష్టలను ఎలా ఇనుమడింపజేశారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అక్కడ శివునికి పాలాభిషేకం చేస్తే.. మజ్జీగ లభిస్తుందట...!అక్కడ శివునికి పాలాభిషేకం చేస్తే.. మజ్జీగ లభిస్తుందట...!

నీలి రంగులోనే ఎందుకు..

నీలి రంగులోనే ఎందుకు..

మనలో చాలా మందికి ఇప్పటికీ సముద్రంలోని నీరు నీలి రంగులో ఎందుకు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ఆ విషయాన్ని మొట్టమొదటి కనిపెట్టింది సర్ సి.వి.రామనే. అంతేకాదు పగలు ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు కనబడవు, నింగి నీలి రంగులోనే ఎందుకుంటుందనే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అలా ఎందుకు జరుగుతుందనేందుకు కచ్చితమైన కారణాలను చెప్పారు.

రామన్ ఎఫెక్ట్..

రామన్ ఎఫెక్ట్..

సర్ సి.వి.రామన్ సిద్ధాంతం ప్రకారం, ఒక రంగు కాంతి కిరణం ద్రవంలోకి ప్రవేశించినప్పుడు, ఆ ద్రవం ద్వారా వెదజల్లిన కాంతిలో కొంత భాగం వేరే రంగులో ఉంటుందని కనుగొన్నారు. ఇలా చెల్లాచెదురైన కాంతి యొక్క స్వభావం ప్రస్తుతం ఉన్న నమూనా రకంపై ఆధారపడి ఉంటుందని ఆయన ఆలోచించారు. ఇందుకు సంబంధించి కలకత్తాలో ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అలా సాగరం నీలి రంగులో ఎందుకు ఉంటుందనే వివరాలను తన పరిశోధనల రుజువు చేశారు.దానికే ‘రామన్ ఎఫెక్ట్' అని నామకరణం చేశారు.

నేషనల్ సైన్స్ డే చరిత్ర..

నేషనల్ సైన్స్ డే చరిత్ర..

ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ సైన్స్ రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1986 సంవత్సరంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్(NCSTC) ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే ప్రకటించింది. భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 1987 నుండి నేషనల్ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. ఈరోజున సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే సైన్స్ టెక్నాలజీ కోసం ప్రజలను ప్రోత్సహిస్తారు.

నోబెల్ బహుమతి..

నోబెల్ బహుమతి..

1888 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు సి.వి.రామన్ జన్మించారు. ఆధునిక భారత విజ్ణాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వారిలో మొదటి వ్యక్తి. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త కూడా సర్ సి.వి.రామనే.

భారత రత్న అవార్డు..

భారత రత్న అవార్డు..

తను చేసిన ఒక పరిశోధనా ఫలితానికే 1930లో నోబెల్ అవార్డు రావడంతో.. రామన్ ను భారత ప్రభుత్వం తొలి జాతీయ ఆచార్యునిగా నియమించింది. 1954లో ‘భారత రత్న'బిరుదుతో సత్కరించింది. 1957లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ అవార్డు'ను ఇచ్చింది. విదేశాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ, మన దేశంలో ఉన్న కొద్దిపాటి వనరులతోటే రీసెర్చ్ చేసి సి.వి.రామన్ ఎన్నో విజయాలు సాధించారు.

రామన్ ఇన్ స్టిట్యూట్..

రామన్ ఇన్ స్టిట్యూట్..

1907 సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన రామన్ 1907 నుండి 1933 వరకు కోల్ కతాలోని ఇండియన్ అసొసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ లో పని చేశారు. భౌతిక శాస్త్రంలో వివిధ విషయాలపై పరిశోధనలు చేశారు. తన పదవీ విరమణ తర్వాత బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ని స్థాపించారు. అనంతరం 1970లో నవంబర్ 21వ తేదీన మరణించారు.

FAQ's
  • నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారత శాస్త్రవేత్త ఎవరు?

    1888 సంవత్సరంలో నవంబర్ 7వ తేదీన తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు సి.వి.రామన్ జన్మించారు. ఆధునిక భారత విజ్ణాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వారిలో మొదటి వ్యక్తి. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త కూడా సర్ సి.వి.రామనే.

  • జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి రామన్ సైన్స్ రంగంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1986 సంవత్సరంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్(NCSTC) ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే ప్రకటించింది. భారత ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత 1987 నుండి నేషనల్ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. ఈరోజున సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే సైన్స్ టెక్నాలజీ కోసం ప్రజలను ప్రోత్సహిస్తారు.

English summary

National Science Day 2023: What is Raman Effect and why does India celebrate the man behind it?

Here we are talking about the National Science Day 2023: What is Raman Effect and why does India celebrate the man behind it? Read on
Desktop Bottom Promotion