For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Navratri 2021: నవరాత్రుల వేళ 12 రాశిచక్రాల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ 7 నుండి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల వేళ హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామతను పూజిస్తారు. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి ఆరాధిస్తారు. ఈ పండుగ వేళ ప్రతి ఒక్కరూ మంచి పనిని చేయాలని.. అందుకు అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకుంటారు. ఈ నేపథ్యంలో నవరాత్రుల వేళ తమ భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకోవాలని కొందరు ఆశిస్తుంటారు. ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవరాత్రుల వేళ 12 రాశి చక్రాల వారి జాతకం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం...

నవరాత్రి 2021: మీరు ఈ వస్తువులను నవరాత్రులలో ఇంటికి తీసుకువస్తే, అదృష్టం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారిలో నవరాత్రుల వేళ ఆర్థిక పరంగా మరియు ఉద్యోగ పరంగా స్థిరత్వం కలిగి ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభించేందుకు అనుకూలం. మీ రొమాంటిక్ లైఫ్ ఉత్కంఠభరింతగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న కోరికలు ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మీరు పోటీని అధిగమిస్తారు. విద్యార్థులకు విజయం లభిస్తుంది. ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది. మీరు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. మీరు ఆర్థిక పరంగా నష్టపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు సహనంతో ఉండాలి. మీరు శారీరకంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నవరాత్రి 2021: దుర్గా మాత ఆశీస్సులు పొందడానికి దేవిని ఈ విధంగా పూజించండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ కాలంలో మీరు కొత్త నైపుణ్యాల గురించి తెలుసుకోవాలి. ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మీ ఆందోళనలను సులభంగా అధిగమిస్తారు. ఉద్యోగులకు సహోద్యోగులతో సంబంధాలు చాలా ముఖ్యం. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారిలో విద్యారంగంలో ఉండే వారికి ఈ సమయం విజయం లభిస్తుంది. ఒంటరిగా ఉండే వారికి ప్రత్యేక భాగస్వామి కనిపిస్తుంది. మీరు వివాహం చేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి. రెగ్యులర్ గా తేలికపాటి వ్యాయామం చేయాలి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయి. మీరు గణనీయమైన డబ్బు సంపాదించే అవకాశం ఉంది. మీరు మీ ప్రత్యేక వ్యక్తిని కనుగొనలేకపోవచ్చు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి.

నవరాత్రులలో తొమ్మిది రోజులు పాటు అఖండ దీపం గురించి మీకు తెలుసా? ఏమి చేయాలో మీకు తెలుసా?

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారిలో విద్యావేత్తలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ ముఖ్యమైన పనులను ప్రారంభించొచ్చు. మరోవైపు ప్రేమికులకు ఈ కాలంలో సానుకూల ఫలితాలొస్తాయి. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయొచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారిలో నవరాత్రుల వేళ పోటీ ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువగా కష్టపడాలి. మీరు ఖరీదైన వస్తువులను కొనడం వాయిదా వేయాలి. మీ ప్రేమ విషయంలో వివాదాలు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈ సమయంలో ఎలాంటి సమస్యలు ఉండవు.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ కాలంలో మీరు ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలను పొందుతారు. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబం మరియు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపండి. దీర్ఘకాలిక గుండె జబ్బులు ఉన్న వారు ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం తీసుకోవాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. అయితే మీరు సానుకూలంగా ఆలోచించడం ద్వారా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. మీ లక్ష్యాలు మరియు కలలను నిజం చేసుకునేందుకు మరింత కష్టపడాలి. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామితో బంధం బలపడుతుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో ఆర్థిక పరంగా ఈ కాలంలో నష్టం రావొచ్చు. కాబట్టి మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నవరాత్రుల సమయంలో మీరు పొదుపుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీ కలలను నిజం చేసుకునేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు మీ వైవాహిక జీవితంలో సానుకూలంగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో కష్టాలు మరియు విజయాలు రెండూ సమానంగా ఉండొచ్చు. అయితే భవిష్యత్తులో మీరు ఊహించిన ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మరోవైపు మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.

నవరాత్రుల వేళ ఏ అమ్మవారిని తొమ్మిదిరూపాల్లో అలంకరించి ఆరాధిస్తారు?

హిందూ సంప్రదాయం ప్రకారం నవరాత్రుల వేళ దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు.

English summary

Navratri 2021: Astrology Predictions for the 9 Day Festival for 12 Zodiac Signs in Telugu

Navratri 2021 Horoscope: Check Out 9 Day Astrological Predictions for 12 zodiac signs in Telugu.
Story first published: Saturday, October 9, 2021, 14:24 [IST]