Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
వాస్తు ప్రకారం ఈ వస్తువులు ఎవరికీ దానం చేయవద్దు.. చేస్తే కష్టాలు తప్పవు
దానం మంచిదే అయినా కొన్ని వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ దానం చేయకూడదని చెబుతున్నాయి శాస్త్రాలు. కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయని పండితులు హెచ్
హిందూ పురాణాల ప్రకారం దానం చేయడం వల్ల యాగం చేసినంత పుణ్యం వస్తుంది. లేనివారికి మనదగ్గర ఉన్న దాంట్లోంచి కొంత దానం చేయడం వల్ల దేవతలు కూడా ఆనందిస్తారని చెబుతారు. మానవ సేవయే మాదవ సేవ అనేది దానం నుండే వచ్చింది. దానం గురించిన ప్రస్తావన చాలా మతాల్లో ఉంది.పేదవారికి, బిక్షగాళ్లకు దానం చేయాలని ప్రతి ఒక్క మతం చెబుతోంది. దానం చేయడం వల్ల దేవతలు ప్రసన్నం చేసుకుంటారని, పుణ్యఫలం లభిస్తకుందని చెబుతున్నాయి శాస్త్రాలు.

దానం మంచిదే అయినా కొన్ని వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ దానం చేయకూడదని చెబుతున్నాయి శాస్త్రాలు. కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందని, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు వస్తాయని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి వస్తువులు దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్లాస్టిక్ ఉత్పత్తులు:
జ్యోతిష్యం ప్రకారం ప్లాస్టిక్ వస్తువులను దానం చేయకూడదు. ప్లాస్టిక్ వస్తువులు దానం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. కుటుంబసభ్యుల మధ్య కలహాలు మొదలవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత దెబ్బతింటుంది. ప్లాస్టిక్ వస్తువులను దానం చేయడం వల్ల వ్యాపారంలోనూ రకరకాల సమస్యలు వస్తాయి.

ఇనుప వస్తువులు:
ఇనుప పాత్రలను ఇతరులకు దానం చేయడం దురదృష్టాన్ని తీసుకువస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో ప్రశాంతత తొలగిపోతుంది. కుటుంబసభ్యుల మధ్య ఏదో ఒక విషయంలో రోజూ గొడవలు, వాగ్వాదాలు జరుగుతుంటాయి. ఈ తగాదాల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు.

గడియారం:
సమయాన్ని చెప్పడానికి చేతికి ధరించే గడియారాలను ఇతరులకు దానం ఇవ్వకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గడియారాన్ని ఒకరి సమయంగా భావిస్తారు. అటువంటి గడియారాన్ని దానం చేస్తే జీవితంలో సమస్యలు వస్తాయి. కుటుంబసభ్యుల మధ్య తగాదాలు మొదలవుతాయి. ఉద్యోగం చేసే వారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. పని భారం పెరుగుతుంది. దీని వల్ల కుటుంబసభ్యులతో గడిపే సమయం తగ్గుతుంది.

చీపురు:
ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురును లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే చీపురు కాలికి తగిలితే మొక్కుతుంటారు. చీపురు మీది నుండి అటు నుండి ఇటు వైపు దాటరు. అలాంటి చీపురును ఇతరులకు దానం ఇవ్వకూడదు. చీపురు దానం చేస్తే ఇంట్లో నుండి లక్ష్మీ వెళ్లిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి చీపురును ఎట్టిపరిస్థితుల్లోనూ దానం చేయకూడదు.

కత్తి, కత్తెర:
ఇంట్లో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తులను, బట్టలు కత్తిరించేందుకు వాడే కత్తెరలను దానం చేయడం మంచిది కాదు. ఈ వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. దీని వల్ల మనశ్శాంతి ఉండదు.



Click it and Unblock the Notifications