Latest Updates
-
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే!
New year 2021 : జనవరి 1నే కొత్త ఏడాది వేడుకలు జరుపుకుంటారో తెలుసా...!
జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం వేడుకలను ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలోని అనేక దేశాలు సాధారణంగా జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. ఈరోజు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోందంటే చాలు ప్రతి ఒక్కరిలోనూ ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ వస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో 2020కి గుడ్ బై చెప్పేసి.. 2021 ఆంగ్ల నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే పార్టీలు చేసుకునేందుకు కూడా రెడీ అయ్యారు.

అయితే జనవరి ఒకటో తేదీనే నూతన సంవత్సరం ఎందుకు ప్రారంభమవుతుందనే విషయం గురించి అడిగితే మనలో చాలా మంది తెలియదనే సమాధానం చెబుతారు. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం వేడుకలను జనవరి 1నే ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

2 వేల ఏళ్ల క్రితం..
మనలో చాలా మందే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని ఉంటారు. అయితే జనవరి 1వ తేదీనే కొత్త ఏడాది ఎందుకు ప్రారంభమవుతుంది. ఈరోజునే ఎందుకు వేడుకలు జరుపుకోవాలనే ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం 2 వేల సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే.

క్రీస్తు పూర్వం..
చరిత్రను పరిశీలిస్తే.. క్రీస్తు పూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి పట్టే సమయం ఆధారంగా దీన్ని రూపొందించారు.

కొన్నిసార్లు లీప్ ఇయర్..
‘భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజుల కంటే కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మనం కొన్నిసార్లు లీప్ ఇయర్ జరుపుకుంటాం. అందుకే లీప్ ను ప్రవేశపెట్టాల్సి వచ్చింది' అని కీల్ యూనివర్సిటీ అబ్జర్వేటరీ డైరెక్టర్ డాక్టర్ జాకో వాన్ లూన్ తెలిపారు.

ఒకేరోజు ఆ రెండు..
అయితే భూమి రోజులో ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అందుకే ప్రతిరోజూ ఒకసారి సూర్యోదయం మరియు సూర్యస్తమయం అవుతూ ఉంటాయి.

జనవరినే ఎందుకంటే..
ఇదిలా ఉండగా.. క్యాలెండర్ ను ప్రవేశపెట్టేటప్పుడు సంవత్సరాన్ని మొదలు పెట్టే రోజును సీజర్ ఎంచుకోవాల్సి వచ్చింది. రోమన్లకు జనవరి నెల ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వారి దేవత జవస్ పేరిట ఏర్పడిన నెల అది.

ఇదే సరైన సమయమని..
పురాణాల ప్రకారం.. హిందువులు పూజించే బ్రహ్మదేవుడికి నాలుగు తలలు ఉన్నట్టు మాదిరే రోమన్లు ఆరాధించే జనస్ కు రెండు తలలు ఉంటాయని వారి నమ్మకం. ఈయనను ప్రారంభాల దేవత (గాడ్ ఆఫ్ బిగినింగ్స్)గా రోమన్లు భావిస్తుంటారు.

రెండువైపులా..
‘ఆయనకు ముందు, వెనుక రెండువైపులా తలలు ఉండటం వల్ల.. తను రెండు వైపులా చూడగలరు. ఏదైనా తాజాగా ప్రారంభించేందుకు ఏడాది మొత్తంలో ఏదైనా సమయాన్ని ఎవరైనా ఎంచుకోవాలంటే ఇదే సరైనది అని (యూరోపియన్లు) భావించేవారు' అని బర్మింగ్ హామ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్పెన్నర్ చెప్పారు.

శక్తివంతమైన కాలం..
యూరప్ లో శీతాకాలం తర్వాత పగటిపూట సమయం ఎక్కువ ఉండేది కూడా ఇప్పుడే. ‘రోమన్లకు ఇదొక శక్తివంతమైన కాలం. ఎందుకంటే వారు అప్పటివరకూ పగటివేళ చాలా తక్కువగా ఉండే రోజుల్ని నెట్టుకొస్తుంటారు. వీరికి ఈ సమయం విశ్రాంతి లాంటిది' అని డయానా వివరించారు.

క్యాలెండర్ విస్తరణ..
అలా రోమన్లు తమ అధికారాన్ని విస్తరించి కొద్దీ వాళ్ల రాజ్యంతో పాటు క్యాలెండర్ కూడా ఇతర ప్రాంతాలకు చేరింది. అయితే, పాశ్చాత్యంలో ఐదో శతాబ్దంలో రోమాన్ల సామ్రాజ్యం పతనమై, దాని స్థానంలో క్రైస్తవం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జనవరి 1వ తేదీని అన్యమత సంప్రదాయంగా భావించేవాళ్లు.

16వ శతాబ్దంలో..
ఇక ఆ తర్వాత 16వ శతాబ్దంలో పోప్ 13వ గ్రెగోరీ గ్రెగోరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టారు. క్రైస్తవ దేశాల్లో కూడా కొత్త సంవత్సర దినోత్సవాన్ని జనవరి ఒకటో తేదీగా పునరుద్ధరించారు. అయితే ఇంగ్లాండ్ మాత్రం 1752 వరకూ నూతన సంవత్సర దినోత్సవాన్ని డిసెంబర్ 25వ తేదీగ జరుపుకుంటూ వచ్చింది. ఆ తర్వాత అక్కడి దేశ పార్లమెంటు ఒక చట్టం తీసుకొచ్చి, యూరప్ తో పాటుగా ఇంగ్లాండ్ కూడా కొత్త సంవత్సరాన్ని జనవరి ఒకటో తేదీన జరుపుకునేట్లు చేసింది. ప్రస్తుతం చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ నే ఫాలో అవుతున్నాయి. కాబట్టి జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications