For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Numerology: బర్త్ డేను బట్టి మీ పర్సనాలిటీ గురించి ఎలా తెలుసుకోవచ్చంటే...!

|

ఈ లోకంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. వారి పర్సనాలిటీ, అభిరుచులు, అలవాట్లు అస్సలు కలవవు. అందుకే ఏ వ్యక్తి యొక్క ప్రవర్తనను మనం అంచనా వేయలేం.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వారు పుట్టిన నెల, తేదీ ఆధారంగా వారి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవచ్చని పండితులు చెబుతుంటారు. అయితే సంఖ్యాశాస్త్రం ద్వారా కూడా మీరు పుట్టినరోజు, వారాన్ని బట్టి మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చట.

ముఖ్యంగా ఏడు వారాల్లోని రోజుల్లో ఏ రోజున పుట్టిన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు.. వారి వ్యక్తిత్వ లక్షణాలేంటి అనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Mercury Transit in Libra on 22 September 2021:తులరాశిలో బుధుడి సంచారం.. ఈ రాశులకు ప్రయోజనం...!

ఆదివారం..

ఆదివారం..

ఈరోజున సూర్యభగవానుడికి అంకితమివ్వబడింది. ఆదివారం జన్మించిన వారు చాలా తెలివైన వ్యక్తులు. వీరు తక్కువ కాలంలో స్థిరపడరు. వీరు వీరి సొంత టాలెంట్ తో ప్రపంచంలో తమ కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. వీరు ఎవరిపైనా ఆధారపడటానికి ఇష్టపడరు. వీరు సాహసం చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వీరు తమ పర్సనల్ లైఫ్ ను పూర్తిగా ఆస్వాదించాలని కోరుకుంటారు. వీరు ప్రతిరోజూ పూర్తిగా ఆస్వాదించాలనుకుంటారు. వీరు ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు చాలా చురుకుగా వ్యవహరిస్తారు.

సోమవారం..

సోమవారం..

న్యూమరాలజీ ప్రకారం, ఈరోజున పుట్టిన వారిని చంద్రుడు నియంత్రిస్తాడు. అందుకే వీరు చంద్రుడిలాగే ప్రశాంతంగా ఉంటారు. వీరు తమ జీవితంలో కుటుంబ సంబంధాలను బలంగా కోరుకుంటారు. వీరికి దయ, జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు చాలా సందర్భాల్లో సర్దుకుపోతుంటారు. ఇలాంటి వ్యక్తులు తమ తల్లులు మరియు మహిళలతో మరింత ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంటారు. వీరు వాస్తవాల కంటే ఎక్కువగా అనుభవాలను నమ్ముతారు. వీరు నిజమైన ఉదారవాదులుగా ఉంటారు. ప్రపంచాన్ని మంచిగా మార్చేందుకు ఎల్లప్పుడూ ఆసక్తితో ఉంటారు. ఈరోజున పుట్టిన వారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు సోమవారం రోజు పరమేశ్వరుడిని మరియు వినాయకుడిని పూజించాలి.

మంగళవారం..

మంగళవారం..

ఈరోజున పుట్టిన వారు అంగారకుడి చేత పాలించబడతారు. ఈ కారణంగా వీరు బలమైన సంకల్ప శక్తి కలిగి ఉంటారు. వీరు కఠినమైన పరిస్థితులో కఠినమైన పోరాట యోధులుగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని కనుగొంటారు. వీరు తమ జీవితాన్ని ఉత్సాహపూరితంగా కొనసాగించాలని కోరుకుంటారు. వీరు ఇతరులకు ఎక్కువ ప్రేరణగా ఉంటారు. అయితే వీరిలో ప్రతికూలత ఏంటంటే.. ఏదైనా విషయంలో విజయం సాధించాలనే తపనలో కొన్నిసార్లు విధ్వంసకరంగా మారొచ్చు. వీరు తమ కలలను నిజంగా మార్చుకోగలరు. వీరు శక్తి, సామర్థ్యాలను పెంచుకోవడానికి మంగళవారం రోజున దానధర్మాలు చేయాలి.

మీరు గ్రహాల చెడును వదిలించుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి..పాలతో పరిష్కారముందని తెలుసా...

బుధవారం..

బుధవారం..

ఈరోజున పుట్టిన వ్యక్తులు బుధ గ్రహం చేత పాలించబడతారు. ఈరోజున పుట్టిన వారికి తమ వ్యక్తిగత జీవితంలో కొంత అశాంతి ఉంటుంది. అయితే వీరికి ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి. వీరు మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉంటారు. వీరు ఎవరితో అయినా చాలా స్వేచ్ఛగా మాట్లాడతారు. అయితే కొన్నిసార్లు ఇదే వీరికి ప్రతికూలంగా మారుతుంది. వీరు జీవితంలో ఎల్లప్పుడూ కొత్త మార్గాల కోసం అన్వేషిస్తారు. వీరు తమ లైఫ్ ను చాలా విశ్లేషణాత్మక విధానాన్ని కలిగి ఉంటారు. వీరి తెలివితో ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కొంటరాు. వీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే.. బుధవారం రోజున ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనాలి.

గురువారం..

గురువారం..

ఈ రోజున పుట్టిన వ్యక్తులు గ్రహాలలో అత్యంత ప్రభావవంతమైన గురు గ్రహం చేత పాలించబడతారు. ఈ కారణంగా వీరు చాలా బలమైన సంకల్పం కలిగి ఉంటారు. వీరు ఇతర వ్యక్తుల పట్ల చాలా ఉదారంగా మరియు దయ, జాలిని కలిగి ఉంటారు. వీరు జన్మించిన ప్రదేశంలో అందరినీ ఇష్టపడతారు. వీరు ఇతరుల నుండి ఎక్కువ విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. వీరు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు తాము పుట్టినరోజున ఏదైనా మత పరమైన ప్రదేశానికి వెళ్లి పసుపు రంగులో ఉండే వస్తువులను దానం చేయాలి.

శుక్రవారం..

శుక్రవారం..

ఈ రోజున జన్మించిన వారు శుక్ర గ్రహం చేత పాలింబచడతారు. ఈ కారణంగా వీరు ప్రేమ మరియు ఆప్యాయతను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు తమ బంధాలను ముఖ్యంగా రొమాంటిక్ గా ఉండే బంధాలు మరియు మనోహరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి లక్షణాల వల్ల వీరు ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షించొచ్చు. వీరు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరు వ్యక్తిగత మరియు వ్రుత్తి పరమైన జీవితాలలో భాగస్వామ్యాలను విలువైనదిగా భావిస్తారు. వీరు తమ జీవితంలో ఎల్లప్పుడూ ఉత్సాహం కోసం తమ జీవిత భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలి.

శనివారం..

శనివారం..

ఈరోజున పుట్టిన వారు శని గ్రహ ప్రభావంతో ఉంటారు. వీరి పోరాటాలు స్థిరంగా ఉంటాయి. అందువల్ల వీరు చాలా బలంగా తయారవుతారు. వీరు ప్రతిదాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. వీరు సాధారణంగా చాలా తెలివైన మరియు ఆచరణాత్మక వ్యక్తులు. వీరు జీవితంలో కఠినమైన సరిహద్దు కలిగి ఉంటారు. వీరు అత్యంత క్రమశిక్షణ కలవారు. అయితే కొన్నిసార్లు అనుమానస్పదంగా మరియు మొండిగా చూడొచ్చు. మరోవైపు వీరు చాలా గొప్ప స్నేహితులుగా ఉంటారు. వీరు జీవితంలో తక్కువ పోరాటాలు కలిగి ఉండటానికి శనివారం రోజున దానధర్మాలు చేయాలి.

English summary

Numerology: How To Decode Someone Personality By Day of Birth Astrology Prediction

Here we are talking about the Numerology : How to decode someone personality by day of birth astrology prediction. Have a look