For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

August 14:అది భయంకరమైన రోజు.. మళ్లీ ఇది రీపిట్ కావొద్దు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన...

ఆగస్టు 14వ తేదీన దేశ విభజన, భయానక పరిస్థితుల సంస్మరణ దినంగా ప్రధాని ప్రకటించారు.

|

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాత్యంత్రం రాక ముందు పరిస్థితులను, దేశ విభజనకు ముందు జరిగిన జ్ణాపకాలను గుర్తు చేసుకుంటూ, ఈ బాధను ఎన్నటికీ మరువలేమని, ఆగస్టు 14వ తేదీ శనివారం నాడు ఓ కీలక ప్రకటన చేశారు.

Partition Horrors Remembrance Day on August 14; Know History and Significance

1947 ఆగస్టు 14వ తేదీ కంటే ముందు లక్షలాది మంది ప్రజలు తాము నివసిస్తున్న ప్రాంతాలను వదులుకుని వలస వెళ్లారని, విభజన వల్ల కలిగిన ద్వేషం మరియు హింస కారణంగా ఎందరో అమాయకులు, యోధులు ప్రాణాలు కోల్పోయారని మోడీ గుర్తించారు.

Partition Horrors Remembrance Day on August 14; Know History and Significance

ఈ నేపథ్యంలో అప్పటి ప్రజల బాధలు, త్యాగాలను గుర్తు చేసుకంటూ ఆగస్టు 14వ తేదీన మనం 'విభజన భయానక జ్ణాపకాల దినంగా జరుపుకుందాం' అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

75th Independence Day:స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారు తెలుగు యోధులెవరో తెలుసా...75th Independence Day:స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వారు తెలుగు యోధులెవరో తెలుసా...

బ్రిటీష్ వారు..

బ్రిటీష్ వారు..

దాదాపు రెండు శతాబ్దాల వరకు మన దేశాన్ని ఆంగ్లేయులు పట్టి పీడించారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమి తర్వాత బ్రిటీష్ వారు వెళ్తూ వెళ్తూ మత ప్రాతిపదికన దేశాన్ని రెండుగా చీల్చారని దీంతో భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి కొద్ది గంటల ముందే భారదేశం రెండుగా విడిపోయింది. స్వాతంత్య్రానికి కొన్ని గంటల ముందు భారత్ నుండి పాకిస్థాన్ విడిపోయి ప్రత్యేక దేశంగా ఆవర్భవించింది.

లక్షలాది మంది..

లక్షలాది మంది..

ఆ విభజన సమయంలో లక్షలాది మంది అల్లర్లకు బలయ్యారని.. కోట్లాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. విభజన గాయాలు భారతీయులు కొన్ని దశాబ్దాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. పక్క దేశమైన పాకిస్థాన్ లో మతోన్మాద మూకలు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డాయి. ఈ నేపథ్యంలో కొన్ని లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భారతదేశానికి తరలివచ్చారు.

ఆగస్టు 14న

ఆగస్టు 14న

ఈ నేపథ్యంలోనే దేశ విభజన జరిగిన ఆగస్టు 14వ తేదీ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి ఆగస్టు 14న ‘విభజన భయానక స్మారక దినం'గా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక నుండి..

ఇక నుండి..

‘దేశ విభజన సమయంలో ఎన్నటికీ మరువలేం. మతిలేని ద్వేషం, హింస కారణంగా కొన్ని లక్షల మంది సోదర, సోదరీమణులు నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఎందరో ప్రజలు తమ విలువైన ప్రాణాలను కోల్పోయారు. మన ప్రజల త్యాగాలు, కష్టాలు గుర్తు చేసుకునేందుకు ఆగస్టు 14వ తేదీని ఇకపై ‘విభజన భయానక స్మారక దినం'గా ప్రకటిస్తున్నాం అని మోడీ ట్వీట్ చేశారు.

అవి తొలగిపోతాయని..

అవి తొలగిపోతాయని..

దీంతో అయినా మన దేశంలో సామాజిక వ్యత్యాసాలు, విరోధం వంటివి తొలగిపోతాయని ఆశిద్దామని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యమత్యమే మహాబలం అని, సామాజిక సామరస్యాన్ని మానవళి మెరుగయ్యేందుకు.. అందరం కలిసి ముందుకు సాగేందుకు ఈ దినోత్సవాన్ని పాటిద్దామంటూ మోదీ పిలుపునిచ్చారు. దేశ విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ లోని నోఖాలి, బీహార్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో నోఖాలి జిల్లాలో శాంతి, మత సామరస్యాన్ని నెలకొల్పడానికి మహాత్మగాంధీ అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నారు.

English summary

Partition Horrors Remembrance Day on August 14; Know History and Significance

Prime Minister Narendra Modi announced on Saturday that August 14 will be observed as Partition Horrors Remembrance Day in the memory of the struggles and sacrifices of people, saying the pain of partition can never be forgotten.
Story first published:Saturday, August 14, 2021, 16:53 [IST]
Desktop Bottom Promotion