Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
చంద్ర గ్రహణం రోజున ఈ రాశుల వారిపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది.. మీ రాశి ఉందేమో చూడండి...!
జూన్ 5వ తేదీన చంద్ర గ్రహణం సందర్భంగా 12 రాశి చక్రాల వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో మీరే చూడండి.
హిందూ క్యాలెండర్ ప్రకారం జూన్ 5వ తేదీన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇప్పటికే జనవరి మాసంలో తొలి చంద్ర గ్రహణం పూర్తయిన సంగతి అందరకి తెలిసిందే.

ఈ చంద్ర గ్రహణం సమయంలో చంద్రుడు పూర్తిగా కనిపించడు. అలాగే జూన్ 5వ తేదీన ప్రారంభమయ్యే చంద్ర గ్రహణంపై మన దేశంపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

ఈ చంద్ర గ్రహణం జూన్ 5న సుమారు అర్ధరాత్రి సమయంలో అంటే 11:16 గంటలకు ప్రారంభమై జూన్ 6వ తేదీన 2:34 గంటలకు ముగియనుంది. సుమారు మూడు గంటల 18 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగనుంది.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో అన్ని రాశులు ప్రభావితమవుతాయని పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం కారణంగా రాహు-కేతువులతో సహా గురుడు, శని, శుక్ర గ్రహాలన్నీ వ్యతిరేక దిశలో ప్రయాణిస్తాయట. కాబట్టి వాటి ప్రభావం వల్ల అన్ని రాశులపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. ఇంతకీ ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలియాలంటే ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూడాల్సిందే...

మేష రాశి..
జూన్ 5వ తేదీ ప్రారంభమయ్యే చంద్ర గ్రహణం ప్రభావం మీ ఆరోగ్యంపై ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఆ రోజున వివాదాలకు దూరంగా ఉండండి. గ్రహణం సమయంలో మంత్రాలు పఠించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

వృషభ రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీరికి వాణిజ్యం వంటి విషయాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని గమనిస్తూ.. వారి ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి. గ్రహణం సమయంలో శుక్రుడిని ప్రార్థించండి. అలాగే దేవుడిని ఆరాధించండి.

మిధున రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం రోజున ఏ మహిళను ఏ కారణం వల్లనో నిందించకండి. అయితే ఇదే సమయంలో మీరు మహిళల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరమైన విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. జూన్ 5వ తేదీన కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చంద్ర గ్రహణం సమయంలో లాంతరు వెలిగించి మంత్రాలను జపిస్తే మీకు మంచి జరుగుతుంది.

సింహ రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో తల్లి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాగే సూర్యుడు మరియు చంద్రుని యొక్క శ్లోకాలను పఠించాలి. అప్పుడే చంద్ర గ్రహణం ప్రభావం లేకుండా మంచి జరుగుతుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం రోజున ఎలాంటి వివాదంలో పాల్గొనకూడదు. ఇంట్లో తోబుట్టువులతో కూడా సంబంధాల విషయంలో ఏదైనా సమస్య తలెత్తితే శాంతంగా ఉండాలి. వ్యాపారులకు ఎక్కువగా లాభం ఉండకపోవచ్చు. కన్య రాశి వారు గ్రహణం సమయంలో బుధ మంత్రం జపిస్తే మంచిది.

తుల రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం అయిన జూన్ 5వ తేదీ ఎవరితోనూ చెడుగా మాట్లాడకూడదు. మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంత ఆలోచించి మాట్లాడటం మంచిది. మీరు గ్రహణం సమయంలో శుక్ర మంత్రం జపించడం మంచిది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అదే సమయంలో మీకు ఆధ్యాత్మికతపై అభిమానం పెరుగుతుంది. జూన్ 5వ తేదీ అయిన జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఇంద్ర-గాయత్రీ మంత్రాన్ని జపిస్తే మీకు మంచి జరుగుతుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం రోజు చాలా గందరగోళానికి గురవుతారు. ప్రతికూల ఆలోచనలు మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి చెడు ఆలోచనలను నివారించడానికి ఆధ్యాత్మికత వైపు మీ మనసును మళ్లించాలి. గ్రహణం సమయంలో గురు మంత్రాన్ని జపించడం మంచిది.

మకర రాశి..
చంద్ర గ్రహణం సమయంలో మకర రాశి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురుకావచ్చు. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు తలెత్తుతాయి. ఇంట్లో పెద్దల మార్గదర్శకాన్ని అంగీకరించండి. శని మంత్రం జపించి, శని ఆలయానికి వెళ్లి పూజలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది.

కుంభ రాశి..
చంద్ర గ్రహణం సమయంలో కుంభ రాశి వారికి చాలా సమస్యలు ఎదురవుతాయి. మీరు మీ తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ శత్రువులు బలపడే అవకాశం ఉంది. శని గ్రహం దయ మీపై ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇందుకోసం మీరు శని మంత్రాన్ని జపించాలి.

మీన రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం రోజున ప్రయాణించకూడదు. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ సంబంధాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్యానికి గురికాకండి. గ్రహణం సమయంలో గురు మంత్రాన్ని జపిస్తే మంచిది.



Click it and Unblock the Notifications
