For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సొంతరాశిలోకి శని నేరుగా ప్రవేశిస్తే... ఈ రాశులకు బంపరాఫర్...!

|

మనలో చాలా మంది శని దేవుడిని ప్రతికూల ఫలితాలకు అధిపతిగా భావిస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కూడా శని ప్రభువు క్రూరమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అయితే వాస్తవానికి శని దేవుడు కూడా అందరికీ న్యాయం చేయగలడన్న విషయం చాలా మందికి తెలియదు.

అయితే తప్పు చేసిన వారికి ఎలాంటి కష్టాలు పెడతారో.. మంచి పనులు చేసిన వారికి సంతోషాన్ని కూడా కలిగిస్తాడట. గ్రహాలలో అందరి కంటే నెమ్మదిగా ప్రయాణించే గ్రహం శని గ్రహం. శని ఓరాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించడానికి సుమారు రెండున్నరేళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల తర్వాత శని గ్రహం అక్టోబర్ మాసంలో 11వ తేదీ నుండి తన సొంత మకరరాశిలోకి వేగంగా ప్రయాణిస్తున్నాడు.

దీన్నే తిరోగమనం అని కూడా అంటారు. ఇలా శని గ్రహం తిరోగమనం చేసే సమయంలో ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అయితే ఈ కాలంలో చాలా మంది జీవితాల్లో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అయితే శని సొంత రాశి మకరంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయట. ఇంతకీ ఆ రాశులేవి.. ఏయే రాశుల వారు ఎలాంటి ప్రత్యేక ఫలితాలు పొందుతారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఈ రాశుల వారు అత్యంత త్వరగా ధనవంతులతారట... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు శని రవాణా వల్ల అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు తమ కెరీర్లో ఉన్నత పదవులను అలంకరించే అవకాశం ఉంది. నిరుద్యోగులు కూడా ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు ఈ కాలంలో ఏదైనా కొత్త వ్యాపారం లేదా సొంత వ్యాపారం చేయాలనుకుంటే.. సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు అనుభవం ఉన్న వారి సలహా తీసుకుని ముందడుగు వేయాలి. మీ వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మీకు ధైర్యం, శక్తి పెరుగుతుంది. దీంతో మీరు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి శని రవాణా వల్ల సమాజంలో ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ కాలంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీ బాస్ నుండి మీరు ప్రశంసలు పొందుతారు. మీకు పురోగతి గురించి శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. వ్యాపారులకు ఊహించిన లాభాలొస్తాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి శని రవాణా వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే.. ఈ కాలంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైనా పోటీ పరీక్షలో పాల్గొని ఉంటే... ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగులు కెరీర్లో అద్భుత ఫలితాలు సాధించే అవకాశం ఉంది. వ్యాపారులు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు లాభాలను పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

తులారాశిలోకి అంగారకుడు ప్రవేశం, ఈ రాశుల వారికి మస్త్ ప్రయోజనాలు..

సింహం

సింహం

శని రవాణా వల్ల ఈ రాశి వారిలో ఉద్యోగులకు అద్భుత విజయాలు లభిస్తాయి. ఆఫీసులో మీ పనిని సహోద్యోగులు, సీనియర్లు, యజమాని మెచ్చుకుంటారు. వ్యాపారులకు ఈ కాలంలో అద్భుతమైన ఫలితాలు రావొచ్చు. ఈ కాలాన్ని సువర్ణకాలంగా చెప్పొచ్చు. ఆర్థిక పరంగా ఊహించిన ఫలితాలొస్తాయి. మీ వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. మీరు స్నేహితుల మద్దతు పొందుతారు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి శని రవాణా కారణంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ జీవితంలో సంబంధాలు చాలా మధురంగా ఉంటాయి. మీరు మీ రంగంలో విజయం సాధిస్తారు. మీ పనికి ప్రత్యేక ప్రశంసలు అందుతాయి. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి శని రవాణా వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. ఇప్పటివరకు మీ పనుల్లో ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులను సంతోషంగా ఉంచడానికి మీరు చేయగలిగినదంతా చేస్తారు. తద్వారా కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. మీరు మీ జీవనశైలిలో కొన్ని మంచి మార్పులను చూస్తారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఓపికగా మరియు మెరుగ్గా విశ్లేషించడం వలన మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది. మొత్తం మీద మీరు ఏ విషయంలోనైనా తెలివిగా వ్యవహరించి మంచి ఫలితాలను పొందుతారు.

English summary

People of These Zodiac Signs Are Destined to Rise Before Saturn’s Path

Did you know people of these zodiac signs are destined to rise before Saturn’s path. Read on...
Story first published: Saturday, October 23, 2021, 13:11 [IST]