Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ రాశుల వారికి డబ్బంటే లెక్కే ఉండదు.. విపరీతంగా ఖర్చు పెడతారు
డబ్బంటే లెక్కే లేకుండా విపరీతంగా ఖర్చు పెట్టడాన్ని జాతకంలోని 2వ ఇల్లు సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు అందరికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఆ రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. వచ్చేది రూపాయి అయితే ఖర్చు 2 రూపాయిలు ఖర్చు చేస్తుంటారు. అధిక ఖర్చుల అప్పులకు దారి తీస్తాయి. ఖర్చులు ఎక్కువైతే ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు అనేక ఇతర సమస్యలను తెచ్చిపెడతాయి. మానసిక ప్రశాంతత ఉండదు. కుటుంబంలో కలహాలు మొదలవుతాయి. ఒకదానిపై ఒక సమస్య వస్తూనే ఉంటాయి.

డబ్బంటే లెక్కే లేకుండా విపరీతంగా ఖర్చు పెట్టడాన్ని జాతకంలోని 2వ ఇల్లు సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు అందరికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తుంటారు. ఆ రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఖర్చు గురించి దిగులు ఉండదు. ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనకాడరు. అనుకున్నది కావాలనుకుంటారు వాటి కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. అయితే ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ధనుస్సు రాశి వారికి కోరికలు పరిమితంగానే ఉండటం.
ధనుస్సు రాశి వారు బట్టలు, ఉపకరణాలు, ఆహారం కోసం డబ్బు ఖర్చు చేస్తుంటారు. విలాసాలపై డబ్బు ఖర్చుచేయడం చాలా తక్కువే.

2. తులారాశి
తులారాశి వారు భావోద్వేగాలను చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలరు. కానీ ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవడం తులారాశి వారు ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు. తులారాశి వారికి కోరుకున్నది కావాలి. వాటిని ఎంత ధరైనా పెట్టి కొంటారు.
తులారాశి వారు పెట్టుబడి పెట్టే విషయంలోనూ ఎక్కువగా ఆలోచించరు. దాని వల్ల కొన్ని పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడితే, కొన్ని మాత్రం నష్టాలు తెచ్చిపెడతాయి.

3. మీనరాశి
మీనరాశిని బృహస్పతి పాలిస్తుంది. మీనరాశి వారు జీవితంలో అర్థవంతమైన అనుభవాలను కోరుకుంటారు. అలాంటి అనుభవాల కోసం ఖర్చు చేస్తుంటారు. మూడ్ బాగాలేకపోతే షాపింగ్‌కు వెళ్తుంటారు లేదంటే ఒంటరిగా సినిమాలకు వెళ్తుంటారు.
మీనరాశి వారు సున్నిత హృదయులు దీని వల్ల డబ్బు ఆదా చేయలేకపోతారు. వీరిని ఎవరైనా సహాయం అడిగితే తమ సొంత డబ్బులు పెట్టి సహాయం చేస్తుంటారు. దీని వల్ల పర్సు ఖాళీ కాకుండా ఎలా ఉంటుంది.

4. మేషరాశి
మేషరాశి వారు ఆకస్మిక ఖర్చులు చేస్తారు. కోరికలు తీర్చుకునేందుకు ఖర్చు చేస్తుంటారు. ఏదైనా వస్తువు చూస్తే టెంప్ట్ అవుతారు. దాని కోసం ఖర్చు చేస్తుంటారు. మేషరాశి వారికి కోరికలు, అవసరాల మధ్య తేడా తెలియదు.
మేషరాశి వారికి విలాసవంతమైన జీవనశైలి అంటే ఇష్టం. అలా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఖర్చు పెడుతుంటారు. భవిష్యత్తులో ఈ అలవాట్లే ఎక్కువగా సంపాదించేందుకు దోహదపడతాయి.

5. సింహరాశి
ఆహారం కోసం, గాడ్జెట్ల కోసం సింహరాశి వారు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. సింహ రాశి వారికి భౌతిక సంపదలో ఆనందాన్ని పొందే ధోరణి ఉంది. ఇలా వారు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు.
సింహ రాశి వారికి కేవలం డబ్బు ఖర్చు చేయాలన్న తాపత్రయమే కాదు ఎలా సంపాదించాలన్న కోరిక కూడా ఉంటుంది. అయితే ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడుతుంటారు. దీని వల్ల సింహరాశి వారి దగ్గర సేవింగ్సే ఏం ఉండవు.



Click it and Unblock the Notifications