Latest Updates
-
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల
ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా...
ఏప్రిల్ మాసంలో పుట్టిన వారికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ లోకంలో ఉండే ప్రతి వ్యక్తికి విభిన్న లక్షణాలు, విభిన్న అలవాట్లు ఉంటాయి. అయితే మనం పుట్టిన నెలను బట్టి.. మన వ్యక్తిత్వ లక్షణాలు నిర్ణయించబడతాయని మీకు తెలుసా..

వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇందులో కొంత వాస్తవం ఉన్నది. ఈ సందర్భంగా ఏప్రిల్ మాసంలో పుట్టిన వ్యక్తుల యొక్క లక్షణాలు, అలవాట్లు, అభిరుచులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

సాహసమంటే ఇష్టం..
ఈ నెలలో పుట్టిన వారు సాహసం అంటే బాగా ఇష్టపడతారు. అంతేకాదు.. ఎక్కువ సమయం థ్రిల్ కావాలని కోరుకుంటారు. వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు కూడా ఇలాంటి వ్యక్తులనే ఇష్టపడతారు. వీరు బోరింగ్ గా ఉండటాన్ని అస్సలు ఇష్టపడరు. వీరి జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా.. వీరు అస్సలు భయపడరు.

చాలా సున్నితంగా..
ఈ నెలలో జన్మించిన వారు చూడటానికి కాస్త కఠినంగా కనిపించినప్పటికీ.. చాలా సున్నితంగా ఉంటారట. సాధారణంగా వీరిని చూస్తే.. వీరికి చాలా అహంకారం ఉన్నట్లు కనిపించినప్పటికీ.. వీరు చాలా సున్నితంగా వ్యవహరిస్తారు. పేదవారి పట్ల చాలా దయతో ఉంటారు.

సులభంగా ఒప్పించగలరు..
ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఏ విషయంలోనైనా ఇతరులను చాలా సులభంగా ఒప్పించగలరు. వీరు అసాధారణమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. వీరు అత్యుత్సాహంతో నిర్ణయాలు తీసుకోకుండా.. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఇతరులను చాలా ఈజీగా ఒప్పిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వీరు ఒక మంచి పరిష్కారాన్ని కనుగొంటారు.

ఎక్కువ ఎనర్జీతో..
ఈ నెలలో పుట్టిన వారు ఎల్లప్పుడూ చాలా చురుకుగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులను మీరు ఎప్పుడైనా కలిస్తే.. వారు ఎంత ఎక్కువ ఎనర్జీ ఉన్నవారో మీరే చెప్పేస్తారు. వీరు చేసే పనుల్లో ఏదైనా ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వీరు ఫుడ్, స్పోర్ట్స్, స్టడీతో పాటు ఇతర విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు.

రిస్క్ తీసుకుంటారు..
ఏప్రిల్ మాసంలో పుట్టిన వారు చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. అయితే అవసరమైన సమయాల్లో మాత్రమే ఇలాంటివి చేస్తారు. ఎందుకంటే వీరి డిక్షనరీలో ‘అసాధ్యం'అనే పదానికి చోటే లేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితులైనా.. వీరి నైపుణ్యాలతో అధిగమిస్తారు. వీరు ప్రశాంతంగా సమస్యల పరిష్కారాలను కనుగొంటారు.

క్రియేటివ్ థాట్స్..
ఈ నెలలో పుట్టిన వారికి క్రియేటివ్ ఆలోచనలు ఎక్కువగానే ఉంటాయి. వీరు పెయింటింగ్ వంటి వాటిని బాగా ఇష్టపడతారు. వీరే స్వయంగా కొన్నింటిని స్రుష్టిస్తారు కూడా.

ఇతరులపై ఆధారపడరు..
ఈ నెలలో పుట్టిన వారు తాము ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే.. తమ కుటుంబసభ్యులతో పాటు ఇతరులపై ఆధారపడాలని ఎప్పటికీ కోరుకోరు. వీరు తమ కేరీర్లో స్వతంత్రంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. వీరు తమ లక్ష్యాలను సాధించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తారు.

ఆలస్యం అంటే అసహ్యం..
ఈ నెలలో పుట్టిన వ్యక్తులు సమయపాలన బాగా పాటిస్తారు. వీరికి ఉత్సాహంతో పాటు ఉద్రేకం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా పని మొదలుపెడితే.. దానిని సకాలంలో పూర్తి చేయాలని భావిస్తారు. కాస్త ఆలస్యం అయిన అస్సలు సహించరు.

నమ్మకంగా ఉంటారు..
ఈ నెలలో పుట్టిన వ్యక్తులతో స్నేహం చేయాలనుకుంటే.. మీరు నిరంభ్యంతరంగా చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తులు తమ జీవితంలో ఉత్తమంగా ఉండాలనుకుంటారు. అలాగే ఎప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని అస్సలు ఇష్టపడరు. స్నేహం కోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు.

నిజాయితీగా ఉంటారు..
ఈ నెలలో జన్మించిన వ్యక్తులు చాలా విషయాల్లో నిజాయితీగా ఉండటాన్ని ఇష్టపడతారు. వీరు తమ ప్రియమైన వారి పట్ల ప్రేమను ఇతర మార్గాల్లో వ్యక్తపరుస్తారు. ఎందుకంటే వీరు నిజాయితీగా ఉండటాన్ని ఇష్టపడతారు. వీరు తమకిష్టమైన వారిపై అపారమైన ప్రేమ, గౌరవం కలిగి ఉంటారు.

క్రీడలంటే ఇష్టం..
ఈ నెలలో పుట్టిన వారికి సాహసం, థ్రిల్ తో పాటు క్రీడలంటే కూడా చాలా మక్కువ. వీరు క్రీడల్లో చాలా చురుకుగా పాల్గొంటారు. వీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, క్రీడలకు మాత్రం కచ్చితంగా సమయం కేటాయిస్తారు.

రొమాన్స్ విషయంలో..
ఈ నెలలో పుట్టిన వారు రొమాంటిక్ లైఫ్ ను అద్భుతంగా గడుపుతారు. వీరు తమ భాగస్వాములను అన్ని సమయాల్లో ప్రియమైన మరియు ప్రత్యేకమైన అనుభూతి చెందడానికి ఏదైనా చేస్తారు. వీరు తమ భాగస్వాముల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. రిలేషన్ షిప్ కాపాడుకోవడం కోసం వీరు చాలా కష్టపడతారు.



Click it and Unblock the Notifications