Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
Valentines Day 2023: మీ రాశి ప్రకారం వాలెంటైన్స్ డే నాడు ఈ రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేయండి
మీ ఇద్దరి రాశుల ప్రకారం ఎలాంటి ప్రదేశానికి వాలెంటైన్స్ డే రొమాంటిక్ ట్రిప్ కు వెళ్తే మరింత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాలెంటైన్స్ రోజు లవర్ తో లేదా జీవిత భాగస్వామితో గడపాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ప్రేమికుల రోజు ప్రత్యేకంగా ఉండాలని చాలా మంది ప్లాన్ వేస్తుంటారు. ఎప్పుడూ ఒకే రకంగా, రొటీన్ గా, బోరింగ్‌గా వాలెంటైన్స్ డే జరుపుకుంటే ఏం మజా ఉంటుంది. అందుకే ఏదైనా రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేయండి. ప్రకృతికి దగ్గరగా, హాయిగా, మనోహరంగా, ఏకాంతంగా ఉండే మంచి ప్రాంతానికి వెళ్లి సంతోషంగా గడపండి. హైకింగ్, ట్రెక్కింగ్, హిల్ స్టేషన్, బీచ్ లకు వెళ్లడం లాంటివి చేయవచ్చు.

మీ ఇద్దరి రాశుల ప్రకారం ఎలాంటి ప్రదేశానికి వాలెంటైన్స్ డే రొమాంటిక్ ట్రిప్ కు వెళ్తే మరింత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి:
మేషరాశి వారు సాహసోపేతంగా, శక్తివంతంగా ఉంటారు. వీరికి అవుట్ డోర్ కు వెళ్లడం చాలా ఇష్టం కూడా. మేషరాశి వారు సహజంగా థ్రిల్ కోరుకునే వారు. చురుకుగా ఉంటారు. కొత్త విషయాలను అనుభవించడానికి ప్రయత్నిస్తారు.
* హైకింగ్
* రాఫ్టింగ్
* గుర్రపు స్వారీ
* స్కీయింగ్ వంటివి చక్కగా నప్పుతాయి.

వృషభ రాశి:
వృషభ రాశి వారు కొత్త సంస్కృతులను అన్వేషించడానికి ఇష్టపడతారు. వీరు శృంగారభరితంగా ఉండటం వీరికి చాలా ఇష్టం. లగ్జరీ, సౌకర్యం కావాలని కోరుకుంటారు.
* ద్రాక్షతోట
* స్పా రిసార్ట్
* హిల్ స్టేషన్లు వీరికి బాగుంటాయి.

మిథునం:
మిథున రాశి వారు సహజంగానే ఆసక్తి కలిగి ఉంటారు. కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడతారు.
* సిటీ బ్రేక్
* సాంస్కృతిక నగరాలు
* మ్యూజియం
* ఉదయ్ పూర్ లాంటి చారిత్రక నగరాలు

కర్కాటకం:
కర్కాటక రాశి వారు భావోద్వేగ స్వభావులు. ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు.
* బీచ్
* ప్రకృతి పర్యాటకం
* హిల్ స్టేషన్స్
* సంస్కృతిక ప్రాంతాలు

సింహరాశి:
సింహరాశి వారు డ్రామటిక్ గా ఉంటారు. ఎదుటి వారి దృష్టిలో పడేందుకు ఇష్టపడతారు. శృంగారభరితంగా ఉండటం వీరికి ఇష్టం.
* ముంబై
* గోవా లాంటి విలాసవంతమైన ప్రాంతాలు
* నైట్ అవుట్ పార్టీలు
* ఫైన్ డైనింగ్

కన్య రాశి:
కన్య రాశి వారు వేటినైనా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చాలా చురుకుగా ఉంటారు. సాహసోపేత క్రీడల నుండి రొమాంటిక్ ట్రిప్పులను వీరు బాగా ఎంజాయ్ చేస్తారు.
* శృంగారభరిత ప్రాంతాలు
* సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలు
* కళాత్మక నగరాలు
* హైకింగ్
* సైక్లింగ్

తులారాశి:
తులా రాశి వారు సహజంగానే శృంగారభరితంగా ఉంటారు. అందం, సామరస్యంతో చుట్టుముట్టడానికి ఇష్టపడతారు.
* ఆగ్రా
* ఉదయ్ పూర్
* మంచి వంటకాలు దొరికే ప్రాంతాలు
* గోవా

వృశ్చికం:
వృశ్చిక రాశి వారు ఉద్వేగభరితంగా, రహస్యంగా ఉంటారు. వీరు థ్రిల్‌ను బాగా ఇష్టపడతారు. చారిత్రక ప్రాంతాలకు వెళ్లడం బాగుంటుంది. శిథిలాలు, పురాతన దేవాలయలకు వెళ్లవచ్చు.
* కోల్ కతా
* వారణాసి, కాశీ
* పురాతన దేవాలయాలు
* ట్రెక్కింగ్
* క్యాంపింగ్

ధనుస్సు రాశి:
వీరు స్వేచ్ఛగా విహరించడానికి మొగ్గు చూపుతారు. బాలి, ఆస్ట్రేలియా లాంటి ప్రదేశాలను బాగా ఇష్టపడతారు.
* సర్ఫింగ్
* కయాకింగ్
* స్నో బోర్డింగ్
* బంగీ జంప్ లాంటి సాహక క్రీడలు

మకరం:
మకరరాశి వారు ఆచరణాత్మకంగా ఉంటారు. కష్టపడతారు. విలాసాలను, ప్రశాంతతను బాగా ఇష్టపడతారు.

కుంభం:
కుంభరాశుల వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా ఉంటారు. కుంభ రాశి వారు సృజనాత్మకంగా ఉంటారు.
* చండీగఢ్
* బెంగళూరు
* కొత్త ప్రాంతాలకు వెళ్లడం వీరికి ఇష్టం.

మీనం:
బాలి, మౌయి లాంటి ప్రదేశాలను మీనరాశి వారు బాగా ఇష్టపడతారు. కళాత్మక నగరాలకు వెళ్లడాన్ని వీరు బాగా ఎంజాయ్ చేస్తారు.



Click it and Unblock the Notifications