Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Planet Change in November 2021:3 గ్రహాల మార్పుతో.. ఈ రాశులకు ఆర్థిక పరంగా నష్టాలు...!
నవంబర్ 2021లో మూడు పెద్ద గ్రహాలు తమ స్థానాలను మార్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో రాశిచక్రాలపై పడే ప్రభావం గురించి తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, నవంబర్ మాసంలో దీపావళి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగనున్నాయి. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఇదే నెలలో నవ గ్రహాలలో మూడు పెద్ద గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి.

ముందుగా నవంబర్ రెండో తేదీన మంగళవారం నాడు బుధుడు కన్యరాశి నుండి నిష్క్రమించి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత నవంబర్ 21వ తేదీన ఆదివారం నాడు తులరాశి నుండి వృశ్చికరాశిలోకి అడుగు పెట్టనున్నాడు.

నవంబర్ 16వ తేదీన సూర్యుడు తన బలహీనమైన తులరాశిని వదిలి వృశ్చికరాశిలోకి ఆగమనం చేయనున్నాడు. నవంబర్ 20వ తేదీన గురుడు మకర రాశి నుండి నిష్క్రమించి కుంభ రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఇలా మూడు పెద్ద గ్రహాలు నవంబరు మాసంలో తమ స్థానం నుండి మరో స్థానంలోకి మార్పు చెందడం వల్ల ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

ఈ సందర్భంగా ఏ రాశి వారిపై ప్రతికూల ఫలితాలు రానున్నాయి.. ఏ రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఎప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు. నవంబరులో గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఖర్చులు పెరగొచ్చు. అంతేకాదు మీకు ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు చాలా డబ్బులు ఖర్చులు చేయాల్సి రావచ్చు. మరోవైపు ఈ కాలంలో మీరు ఎవ్వరికీ రుణాలు ఇవ్వడం లేదా ఎవ్వరితోనూ రుణాలు తీసుకోవడం వంటివి చేయకూడదు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో శుభ ప్రదంగా ఉంటుంది.

మిధున రాశి..
నవంబరులో మూడు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారు వ్యక్తిగతంగా లాభపడొచ్చు. ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు రావొచ్చు. అయితే ఆర్థిక పరంగా మాత్రం నష్టాలు తప్పేలా లేవు. కాబట్టి ఇలాంటి సమయంలో ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు అప్పులు ఉన్నవారు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నవంబర్ 20 తర్వాత పరిస్థితులలో కొంత మెరుగుదల ఉంటుంది. మీరు బడ్జెట్ ను కూడా బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి.

కర్కాటక రాశి..
నవంబరులో మూడు గ్రహాల మార్పు వల్ల ఈ రాశి వారికి కుటుంబంలో ఎదురయ్యే సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. దీని తర్వాత, మీ ఐదో స్థానంలో సూర్యుని రాశి మార్పు జరుగుతుంది. విద్యార్థులకు ఈ కాలంలో విద్య గురించి మంచి ఫలితాలు రావొచ్చు. నవంబర్ 22వ తేదీ తర్వాత మీకు మంచి ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీ కెరీర్లో శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి..
నవంబర్ నెలలో మూడు గ్రహాల రాశుల మార్పు వల్ల మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీ మొదటి, రెండో మరియు మూడో ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. సూర్యుడు ఈ రాశి నుండి మూడో పాదంలో కూడా సంచరిస్తాడు. గ్రహాల సంచారం కారణంగా, మీరు నవంబర్ నెలలో ఆకస్మిక ద్రవ్య లాభాలను పొందొచ్చు.

ధనస్సు రాశి..
ఈ నెలలో బుధుడు ఈ రాశి నుండి 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. మీరు ఈ నెలలో టెక్నికల్ గా మంచిగా ఉంటుంది. ఈ నెలలో మీ కుటుంబ జీవితంలో కొంత ప్రతికూలంగా ఉంటుంది. అయితే మీ జీవిత భాగస్వామి ఉద్యోగంలో ఉంటే మీరు వారి నుండి ప్రయోజనాలు పొందొచ్చు. ఈ సమయంలో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు.

మకర రాశి..
ఈ రాశి వారికి మూడు గ్రహాల మార్పుల వల్ల వారి కోరికలు నెరవేరుతాయి. ఈ నెలలో బుధుని రవాణా కారణంగా మీ కెరీర్లో శుభ ఫలితాలను పొందుతాడు. నవంబర్ 22 తర్వాత, మీరు మీ కెరీర్లో పురోగతికి అవకాశాలను పొందొచ్చు. కుంభరాశిలో గురుడి సంచారం వల్ల మీ ప్రసంగం మధురంగా ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి వారికి అధిపతి అయిన గురుడు నవంబర్ నెలలో 11వ పాదం నుండి నిష్క్రమించి 12వ స్థానంలోకి ప్రవేశించనున్నాడు. గురుడి స్థానం మార్పు వల్ల మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరోవైపు మీరు ఈ కాలంలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాహితులు తమ సంతానం కోసం ఖర్చులు చేయాల్సి రావొచ్చు. విద్యకు సంబంధించి ఎక్కువ ఖర్చులు ఉండొచ్చు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.
నవంబరు నెలలో మొత్తం మూడు గ్రహాలు మార్పు చెందనున్నాయి.ముందుగా నవంబర్ రెండో తేదీన మంగళవారం నాడు బుధుడు కన్యరాశి నుండి నిష్క్రమించి తులరాశిలోకి ప్రవేశించనున్నాడు. నవంబర్ 16వ తేదీన సూర్యుడు తన బలహీనమైన తులరాశిని వదిలి వృశ్చికరాశిలోకి ఆగమనం చేయనున్నాడు. నవంబర్ 20వ తేదీన గురుడు మకర రాశి నుండి నిష్క్రమించి కుంభ రాశిలోకి రవాణా చేయనున్నాడు.



Click it and Unblock the Notifications











